సౌరశక్తితో నడిచే బైకును రూపొందించిన 13 ఏళ్ల పాఠశాల విద్యార్థి

Written By:

తరగని ఇంధన వనరుల్లో ఒకటైన సౌరశక్తితో వాహనాలను నడిపేందుకు కావాల్సిన సాంకేతికతను అభివృద్ది చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు పరిశోధనల్లో నిమగ్నమయ్యారు. కాన్సెప్ట్ దశలో అనేక ఉత్పత్తులు వచ్చినా... అవి ఇంకా పూర్తి స్థాయి వినియోగంలోకి రాలేదు. కాని హర్యాణాకు చెందిన ఓ బాలుడు సౌరశక్తితో నడిచే బైకును రూపొందించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. మరిన్ని వివరాలు ఈ స్టోరీలో చూద్దాం రండి...

To Follow DriveSpark On Facebook, Click The Like Button
సౌరశక్తితో నడిచే బైకును రూపొందించిన 13 ఏళ్ల కుర్రాడు

హర్యాణాకు చెందిన 13 ఏళ్ల వయసున్న బాలుడు అవనీత్ కుమార్ సోలార్ పవర్‌తో నడిచే బైకును రూపొందించాడు. ఆ వయసు పిల్లలకు తట్టని ఆలోచనతో ఈ ఆవిష్కరణకు కార్యరూపం దాల్చాడు.

సౌరశక్తితో నడిచే బైకును రూపొందించిన 13 ఏళ్ల కుర్రాడు

హర్యాణాలోని రేవరీ ప్రాంతంలో నివసించే అవనీత్ కుమార్ సృష్టించిన బైకులో వెనుక వైపున సోలార్ ప్యానల్ అందించాడు. ఇది బైకు ముందుకు కదలడానికి కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

సౌరశక్తితో నడిచే బైకును రూపొందించిన 13 ఏళ్ల కుర్రాడు

దిగ్గజ పత్రికకు అవనీత్ కుమార్ ఇచ్చిన ఇంటర్వూలో తాను భవిష్యత్తులో సౌర శక్తితో కారును రూపొందించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపాడు. టాటా నానో కారు కన్నా తక్కువ ధరతోనే సోలార్ ఎనర్జీతో నడిచే కారును అభివృద్ది చేయడం తన కల అని చెప్పుకొచ్చాడు.

సౌరశక్తితో నడిచే బైకును రూపొందించిన 13 ఏళ్ల కుర్రాడు

అవనీత్ ఆవిష్కరించిన ఈ బైకు ఎలాంటి ఉద్గారాలను విడుదల చేయదు. మరియు ఇంధనంతో నడిచే ద్విచక్ర వాహనాల కన్నా దీని ధర చాలా తక్కువ.

సౌరశక్తితో నడిచే బైకును రూపొందించిన 13 ఏళ్ల కుర్రాడు

ప్రస్తుతం ఉన్న ఇంధనంతో నడిచే ఉత్పత్తుల కన్నా తక్కువ ధరతో సౌరశక్తితో నడిచే టూ వీలర్లను అభివృద్ది చేయవచ్చు. అయితే కొన్ని సౌర బైకుల తయారీ సంస్థలు భారీ ధరతో తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి.

సౌరశక్తితో నడిచే బైకును రూపొందించిన 13 ఏళ్ల కుర్రాడు

ఏదైమయినప్పటికీ ఇలాంటి ఉద్గార రహిత వాహనాల వినియోగం పర్యావరణానికి ఎంతో మేలు కలిగిస్తాయి. కాబట్టి అందరూ పెట్రోల్ మరియు డీజల్ వినియోగించుకునే వాహనాలకు బదులుగా విద్యుత్ మరియు సౌరశక్తితో నడిచే వాహనాలను స్వచ్ఛందంగా కొనుగోలు చేయడానికి ముందుకు రావాలి.

 

English summary
13-Year Old Boy Designs A Bike That Runs On Solar Energy
Story first published: Saturday, April 1, 2017, 13:47 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark