హిల్ అసిస్ట్ ఫీచర్ అంటే ఏమిటి; అదెలా పనిచేస్తుంది..?
సాధారణంగా కొండ ప్రాంతాలు, ఏటవాలు ప్రాంతాల్లో వాహనాలను నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. ఇటువంటి ప్రాంతాల్లో వాహనాన్ని నిలపాల్సి (పార్కింగ్) వచ్చినప్పుడు మామూలు వాహనాల్లో (హిల్ అసిస్ట్ ఫీచర్ లేని వాహనాల్లో) అయితే, ఇంజన్ ఆఫ్ చేసిన తర్వాత వాహనాన్ని గేర్‌లో ఉంచి, హ్యాండ్ బ్రేక్ వేసి నిలపాల్సి ఉంటుంది.
ఇలా నిలిపిన వాహనాన్ని మళ్లీ తిరిగి స్టార్ట్ చేయాలని ప్రయత్నించినప్పుడు ఎంత జాగ్రత్తగా ప్రయత్నించినప్పటికీ ఏటవాలు రోడ్లపై వాహనం కొద్దిగా వెనక్కు జరిగే ఆస్కారం ఉంటుంది. వాహనంలో కూర్చుని, గేర్‌ను న్యూట్రల్ చేసుకుని, హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసిన తర్వాత, బ్రేక్ పెడల్‌పై కాలు ఉంచి ఇంజన్ స్టార్ట్ చేసి కాలును బ్రేక్ పెడల్ నుండి యాక్సిలేటర్ పెడల్‌కు మార్చేలోపుగా వాహనం కొద్దిగా వెనక్క జరుగుతుంది.
ఇటువంటి సందర్భంలో, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా లేదా వెనుక వైపు ఏదైనా మరో వాహనం పార్క్ చేయబడి ఉన్నా పెను ప్రమాదమే వాటిళ్లుతుంది. ఇలాంటి ప్రమాదం జరగుండా సహాయపడే ఫీచరే "హిల్ అసిస్ట్". ఈ ఫీచర్ ఉండే కార్లలో బ్రేక్ పెడల్‌పై కాలు తీసివేసినప్పటికీ దాదాపు 2-3 సెకండ్ల వరకూ బ్రేక్ ఆన్‌లోనే ఉంటుంది. ఈ లోపుగా కాలును బ్రేక్ పెడల్ నుండి యాక్సిలేటర్ పెడల్‌పై మార్చుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా కారు వెనక్కు వెళ్లటం జరగదు.
డ్రైవ్ స్పార్క్ ఫోటో గ్యాలరీ | డ్రైవ్ స్పార్క్ ఫేస్‌బుక్
ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్) సిస్టమ్ కలిగిన కార్లకు ఈ ఫీచర్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వీటిల్లో క్లచ్ ఉండదు కాబట్టి. అలాగే మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌లలో ఈ ఫీచర్‌ను పరిచయం చేయడం జరుగుతుంది. హిల్ అసిస్ట్ ఫీచర్ ద్వారా కొండలు, లోయలు ఉండే ప్రాంతాల్లో సురక్షితంగా ప్రయాణించేందుకు వీలవుతుంది.


Click it and Unblock the Notifications









