మీ ఎలక్ట్రిక్ బైక్‌లో మంటలు రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

భారత ఆటో మొబైల్ మార్కెట్లో ప్రముఖంగా పేరుగాంచిన ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీకి చెందిన వాహనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై మరోసారి ప్రజల్లో ఆందోళనలు పెరిగాయి. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటనతో, ఎలక్ట్రిక్ వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది.

ప్రమాదం జరిగిన తీరు
సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓ ప్రముఖ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. కంపెనీ వెంటనే ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు ప్రకటించింది.

5 Essential Tips to Prevent Fire in Your Electric Vehicle

ఈ స్కూటర్ మెటల్ బాడీ కలిగి ఉండటం వల్ల, కేవలం వైరింగ్, ప్యానెల్స్‌ మాత్రమే కాలిపోయాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ప్రమాదం జరిగిన వాహనం కొనుగోలు చేసి ఏడాది అవుతుంది. ఇప్పటి వరకు 10,000 కి.మీ.లు నడిచింది.

గతంలో కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు, కంపెనీ ఇది అగ్నిప్రమాదం కాదని, కేవలం ప్లాస్టిక్ భాగాల నుండి పొగ వచ్చిందని పేర్కొంది. ఈ సంఘటన, తమ ఉత్పత్తులపై కంపెనీ గతంలో చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఉండటం విమర్శలకు దారితీసింది. ఇది పరిశ్రమలో ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై ఉన్న సవాళ్లను మరోసారి గుర్తుచేస్తుంది.

5 Essential Tips to Prevent Fire in Your Electric Vehicle

మీ ఎలక్ట్రిక్ వాహనాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి ముఖ్యమైన చిట్కాలు
ఎలక్ట్రిక్ వాహనాల్లో అగ్ని ప్రమాదాలు చాలా అరుదుగా జరిగినా, అవి సంభవించినప్పుడు నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మీ ఎలక్ట్రిక్ వాహనాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ 5 చిట్కాలను పాటించడం తప్పనిసరి.

ఓవర్ ఛార్జ్ చేయడాన్ని తగ్గించండి
చాలా వరకు ఎలక్ట్రిక్ వాహనాల్లో ఓవర్ ఛార్జింగ్‌ను నివారించే టెక్నాలజీ ఉన్నప్పటికీ, బ్యాటరీ 100% ఛార్జ్ అయిన తర్వాత కూడా ఛార్జింగ్ కొనసాగించకుండా చూసుకోవాలి. బ్యాటరీ దీర్ఘకాల మన్నిక, సేఫ్టీ కోసం బ్యాటరీ ఛార్జ్‌ను 20% నుండి 80% మధ్య మెయింటైన్ చేయడం బెస్ట్. ఇది బ్యాటరీ మీద అనవసర ఒత్తిడిని తగ్గిస్తుంది.

పదేపదే ఛార్జింగ్ చేయొద్దు
బ్యాటరీని ఎప్పుడూ 100% ఛార్జ్ చేసి ఉంచడం మంచిది కాదు. ఇది బ్యాటరీలో వేడిని పెంచుతుంది. దాని లైఫ్ టైం తగ్గిస్తుంది. ముఖ్యంగా, వాహనాన్ని ఎక్కువసేపు నడిపిన వెంటనే ఛార్జ్ చేయకుండా కనీసం 30 నిమిషాల తర్వాత ఛార్జ్ చేయడం మంచిది.

5 Essential Tips to Prevent Fire in Your Electric Vehicle

ఫాస్ట్ ఛార్జింగ్‌కు దూరంగా ఉండాలి
ఫాస్ట్ ఛార్జింగ్ సౌలభ్యం ఉన్నప్పటికీ, దీనిని తరచుగా ఉపయోగించడం వల్ల బ్యాటరీ లైఫ్ టైం తగ్గిపోతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల బ్యాటరీ వేగంగా వేడెక్కుతుంది. అత్యవసరం అయినప్పుడు మాత్రమే ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఉపయోగించాలి. వీలైనంత వరకు ఇంట్లోనే నెమ్మదిగా ఛార్జ్ చేయడం బ్యాటరీ మన్నికకు తోడ్పడుతుంది.

ఒరిజినల్ ఛార్జింగ్ పరికరాలనే ఉపయోగించాలి
డబ్బు ఆదా చేసుకోవాలనే ఉద్దేశంతో నాసిరకం లేదా నాన్‌-బ్రాండెడ్ ఛార్జర్లను ఉపయోగించడం చాలా ప్రమాదకరం. ఇలాంటి ఛార్జర్లు బ్యాటరీని దెబ్బతీస్తాయి. అగ్ని ప్రమాదాలకు కారణమవుతాయి. మీ వాహనానికి ఎల్లప్పుడూ కంపెనీ సూచించిన ఒరిజినల్ ఛార్జింగ్ పరికరాలనే వాడాలి. బ్యాటరీ భాగాలలో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే, కంపెనీ షోరూమ్ నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి.

నీడలో ఛార్జ్ చేయాలి
ఎక్కువ ఉష్ణోగ్రత బ్యాటరీకి హానికరం. అందుకే, నేరుగా సూర్యరశ్మి కింద వాహనాన్ని ఛార్జ్ చేయకూడదు. నీడ ఉన్న ప్రదేశంలో వాహనాన్ని నిలిపి ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ వేడెక్కకుండా ఉంటుంది. వాహనం నుండి బ్యాటరీని విడిగా తీసుకెళ్లి ఛార్జ్ చేస్తే, దానిని చల్లని, సురక్షితమైన ప్రదేశంలో ఉంచి జాగ్రత్తలు పాటించాలి.

గతంతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల్లో అగ్ని ప్రమాదాలు బాగా తగ్గాయి. అయితే, ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి వాహన తయారీ సంస్థలు అడ్వాన్సుడ్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ (BMS), కూలింగ్ టెక్నాలజీలను డెవలప్ చేస్తున్నాయి. అదే సమయంలో, వినియోగదారులు కూడా పైన పేర్కొన్న జాగ్రత్తలను పాటిస్తే అగ్నిప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చు. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 17, 2025, 14:55 [IST]
English summary
5 essential tips to prevent fire in your electric vehicle
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+