ఇంజన్ ఐడిల్‌గా ఉంచడం వలన కలిగే నష్టాలు

By Ravi

ఇంజన్ ఐడిలింగ్ గురించి చాలా మందిలో కొన్ని అపోహలు ఉంటాయి. కారు ఇంజన్‌ను స్టార్ట్ చేసి, ఇంజన్ న్యూట్రల్‌లో కానీ లేదా రన్నింగ్‌లో కానీ ఉంచడాన్ని ఇంజన్ ఐడిలింగ్ అంటారు. సాధారణంగా, ప్రయాణంలో ఉన్నప్పుడు ఎక్కువ సేపు కారును నిలపాల్సి వస్తే (ప్రత్యేకించి ఎక్కువ సమయం వేచి ఉండే ట్రాఫిక్ సిగ్నల్స్, భారీ ట్రాఫిక్ జామ్స్ వద్ద), చాలా మంది ఇంజన్‌ను అలానే రన్నింగ్‌లో ఉంచుతారు.

అలాంటి సందర్భాల్లో తరచూ కారు ఇంజన్‌ను ఆఫ్ చేసి, ఆన్ చేయటం కన్నా ఇంజన్‌ను రన్నింగ్‌లో ఉంచడం వల్లనే ఎక్కువ మేలు జరుగుతుందని చాలా మంది భావిస్తుంటారు. అలాగే, రోజులో మొదటి సారిగా కారును స్టార్ట్ చేసినప్పుడు ఇంజన్‌ను వామప్ చేయటం కోసం చాలా సేపు ఐడిల్‌లో ఉంచుతారు. ఇలా చేయటం వలన మార్గ మధ్యంలో ఇంజన్ ఆగిపోదని వారు భావిస్తారు. వాస్తవానికి ఇవన్నీ అపోహలు మాత్రమే. మరి నిజాలు ఏంటి? తెలుసుకుందాం రండి!

ఇంజన్ ఐడిల్‌గా ఉంచడం వలన కలిగే నష్టాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి.

ఇంజన్ ఐడిల్‌గా ఉంచడం వలన కలిగే నష్టాలు

తర్వాతి స్లైడ్‌లలో ఇంజన్ ఐడిల్‌గా ఉంచడం వలన కలిగే నష్టాల గురించి తెలుసుకోండి.

ఇంధనం వృధా

ఇంధనం వృధా

ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంజన్‌ను ఐడిల్‌గా ఉంచడం వలన ఇంధనం వృధా అవుతుంది. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నప్పుడు లేదా కారును ఎక్కడైనా పక్కగా కొంత సమయం పాటు నిలపాల్సి వచ్చినప్పుడు దానిని అలాగే ఎక్కువసేపు ఐడిల్‌గా ఉంచకుండా స్విఫ్ చేయాలి అన్నమాట. ఒక్కమాటలో చెప్పాలంటే 20 సెకండ్ల కన్నా ఎక్కువ సమయం కారును ఐడిల్‌గా ఉంచాల్సి వచ్చినప్పుడు, దాన్ని అలానే ఐడిల్‌లో ఉంచే కన్నా స్విఫ్ చేయడం మంచిది.

కారును 10 సెకండ్ల కన్నా ఎక్కువ సేపు ఐడిల్‌గా ఉంచడం వలన అయ్యే ఇంధన ఖర్చు, కారును స్టార్ట్ చేయడానికి కావలసిన ఇంధన ఖర్చు కన్నా ఎక్కువగా ఉంటుంది. అదే రెండు నిమిషాల పాటు కారు ఇంజన్ ఆన్‌లో ఉంటే (ఐడిల్‌గా ఉంటే) అయ్యే ఇంధన ఖర్చుతో సుమారు ఒక మైలు దూరం ప్రయాణించవచ్చు.

ఇంజన్‌లో భాగాలు పాడవుతాయి

ఇంజన్‌లో భాగాలు పాడవుతాయి

కారు ఇంజన్‌ను తరచూ ఆన్/ఆఫ్ చేయటం వలన ఇంజన్‌లోని రన్నింగ్ పార్ట్స్ దెబ్బతింటాయని చాలా మంది భావిస్తుంటారు. కానీ, నిజానికి అది అపోహ మాత్రమే. నేటి ఆధునిక ఇంజన్లను ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో పనిచేస్తాయి, అంతేకాకుండా ఇందులోని అధునాతన విడిభాగాలు ఈ వత్తిడిని సహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఒకవేళ ఏవైనా చిన్నపాటి విడిభాగాలు పాడైనా, వాటి ఖర్చు మనం వృధా చేసే ఇంఝనం ఖర్చు కన్నా తక్కువగానే ఉంటుంది.

ఇంజన్ ఐడిల్‌గా ఉంచడం వలన కలిగే నష్టాలు

వాస్తవానికి కారు ఇంజన్‌ను ఆన్/ఆఫ్ చేయటం కన్నా ఇంజన్‌ను ఐడిల్‌గా ఉంచడం వల్లనే అందులోని భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇంజన్‌ను ఐడిల్‌గా ఉంచడం వలన అందులో ఇంధన సమర్థవంతంగా మండదు, అంతేకాకుండా కొన్ని ఫ్యూయెల్ రెసిడ్యూస్ ఇంజన్‌లోనే మిగిలిపోతాయి. సరైన ఉష్ణోగ్రత వద్ద ఇంజన్ రన్ కాదు, కాబట్టే ఇలా జరుగుతుంది. ఇలా ఇంజన్‌లో మిగిలిపోయిన ఫ్యూయెల్ రెసిడ్యూస్ వలన మైలేజ్ తగ్గటం జరుగుతుంది. ఇంజన్‌ను వామప్ చేయాలంటే, దానిని ఐడిల్‌గా ఉంచడం కన్నా రన్ చేయటమే మేలు.

వాయు కాలుష్యం

వాయు కాలుష్యం

ప్రస్తుతం మనం పీల్చే గాలి పూర్తిగా కాలుష్యంతో నిండిపోయింది. ఇంజన్‌ను అనవసరంగా ఐడిల్‌గా ఉంచడం వలన, దాని నుంచి వెలువడే కార్బన్ డై ఆక్సైడ్ గాలిలో కలిసిపోయి, స్వచ్ఛమైన గాలిని కాస్తా విష వాయువుగా మార్చేస్తోంది. ఎయిర్ పొల్యూషన్, గ్లోబల్ వార్నింగ్‌కు ఇది కూడా ఒక కారణమే. కాబట్టి, అవసరం లేనప్పుడు కారును స్విచ్ ఆఫ్ చేసినట్లయితే, పర్యావరణానికి మనం కూడా మేలు చేసిన వారం అవుతాం.

ఇంజన్ ఐడిల్‌గా ఉంచడం వలన కలిగే నష్టాలు

వాతావరణ వార్తావిశేషాలను తెలిపిన న్యూస్ వెబ్‌సైట్ ఎకోవాచ్ ప్రకారం, వాహనాలను వినియోగించే ప్రతి వ్యక్తి 10 నిమిషాల పాటు ఇంజన్ ఐడిలింగ్‌ను నివారించగలిగినట్లయితే (ఇంజన్ ఆఫ్ చేస్తే) సగటు ఒక పౌండ్ కార్బన్ డై ఆక్సైడ్ గాలిలో కలవకుండా నియంత్రించవచ్చు.

మరో కెనడియన్ అధ్యయనం ప్రకారం, ప్రతి కెనడియన్ సగటున రోజుకు 3 నిమిషాల పాటు ఇంజన్ ఐడిలింగ్‌ను నియంత్రిస్తే, అది ప్రతి ఏటా రోడ్డుపై 3,20,000 వాహనాలను తొలగించి వేసిన దానితో సమానం అవుతుందని తేలింది.

బ్రెయిన్ డ్యామేజ్

బ్రెయిన్ డ్యామేజ్

ఇంజన్ ఐడిలింగ్‌కి బ్రెయిన్ డ్యామేజ్‌కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? వాహనాల సైలెన్సర్ల నుంచి వచ్చే పొగను పీల్చడం వలన మెదడులోని కణాలు దెబ్బతిని, ఔటిస్మ్ అనే నరాల సంబంధిత వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, ఇది మనుషుల ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది, ఆస్తమాను పెంచుతుంది, అలెర్జీలకు కారణం అవుతుంది, హుద్రోగ సమస్యలకు దారి తీస్తుంది. దీని వలన క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

చిన్నారులకు హాని

చిన్నారులకు హాని

పెద్దవారి కన్నా చిన్నారులు ఎక్కువ గాలిని పీలుస్తుంటారు. కాబట్టి పాఠశాలల వద్ద ఎట్టి పరిస్థితుల్లోను మీ వాహనాన్ని ఐడిల్‌గా ఉంచకండి. అలా చేస్తే, వారి భవిష్యత్తును మీరే నాశనం చేసిన వారు అవుతారు.

డబ్బును ఆదా చేసుకోండి

డబ్బును ఆదా చేసుకోండి

ఇంజన్‌ను స్విచ్ చేయటం వలన చాలా ఇంధనం ఆదా అవుతుంది. ఇంధనం ఆదా కావడమంటే, డబ్బు ఆదా అయినట్లే. ఇటీవలి అధ్యయనం ప్రకారం, అమెరికన్లు ప్రతిరోజు తమ వాహనాలను ఐడిల్‌గా ఉంచడం వలన సగటున రోజుకు 13 మిలియన్ డాలర్ల డబ్బును వృధా చేస్తున్నారట. ఇంజన్ ఐడిలింగ్ వలన అయ్యే ఖర్చుతో కారు మెయింటినెన్స్ జరిపోతుంది.

ఇంజన్ ఐడిల్‌గా ఉంచడం వలన కలిగే నష్టాలు

మరి ఆలోచించండి.. మీరు కూడా ఇంజన్ ఐడిలింగ్‌ను నివారించండి.. బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి..!

More from DriveSpark

Article Published On: Wednesday, November 19, 2014, 11:54 [IST]
English summary
Letting the car idle could seem like the best option when one has to stop for a few minutes. Stopping and restarting the engine could lead to more wear and tear of the engine and running components, many may feel. Well, thats wrong. Just to begin with.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+