మీ కారును ప్రకృతి సాన్నిహిత్యంగా ఉంచేందుకు ఐదు చిట్కాలు

By Ravi

ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ క్లీన్ ట్రాన్స్‌పోర్టేషన్ (ఐసిసిటి) నిర్వహించిన ఓ సర్వే ప్రకారం, భారతదేశ రోడ్లపై 2003లో 50 మిలియన్లుగా ఉన్న వాహనాల సంఖ్య 2013 నాటికి 130 మిలియన్లకు పెరిగింది. అంటే, కేవలం పదేళ్ల కాలంలో ఎంత భారీ సంఖ్యలో వాహనాలు పెరిగాయో అర్థం చేసుకోండి. పెరుగుతున్న వాహనాలతో పాటే, వాహన కాలుష్యం కూడా నానాటికీ అధికమవుతోంది.

అధికారిక గణాంకాల ప్రకారం, 2003 నుంచి వాహనాలు విడుదల చేస్తున్న ప్రమాదక నైట్రోజన్ ఆక్సైడ్ వ్యర్థాల సంఖ్య సుమారు 10 శాతానికి పైగా పెరిగింది. వెహికల్ పర్టిక్యులేట్ మ్యాటర్ (పిఎమ్) వ్యార్థాలు కూడా ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి, వీటి ఫలితంగా ప్రతి ఏటా సుమారు 40,000 మంది ప్రజలు మృత్యవాత పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

మరి ఈ వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి వేరే మార్గం లేదా అని అడిగే ముందు, ఆ మార్గం మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని గుర్తించాలి. అవును పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనదే. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ఈ క్రింది చిట్కాలను పాటించినట్లయితే, వాహన కాలుష్యాన్ని కొంత మేరకైనా తగ్గించి, భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించవచ్చు. మరి ఆలస్యమెందుకు ఆ చిట్కాలను ఇప్పటి నుంచే పాటిద్దాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

కారును ప్రకృతి సాన్నిహిత్యంగా ఉంచేందుకు ఐదు చిట్కాలు

వాహన కాలుష్యాన్ని తగ్గించే చిట్కాలను తర్వాతి స్లైడ్‌లలో తెలుసుకోండి.

1. కారును సరిగ్గా మెయింటైన్ చేయండి

1. కారును సరిగ్గా మెయింటైన్ చేయండి

కారును ఎప్పుడూ చక్కగా వర్కింగ్ కండిషన్‌లో ఉంచుకోవటం ఎంతో ముఖ్యం, అలా చేయటం వలన కారు ఎక్కువ కాలం ప్రకృతి సాన్నిహిత్యంగా (ఈకో-ఫ్రెండ్లీ) ఉండగలదు. కారును ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించుకుంటూ, తరచూ ట్యాన్ చేయించుకోవటం వలన అది మరింత సమర్థవంతంగా పనిచేయటమే కాకుండా, తక్కువ కర్భన వ్యర్థాలను విడదల చేస్తుంది. కారును ట్యూన్ఆప్ చేయటం వలన దాని సామర్థ్యం 4 శాతం పెరుగుతుంది, అలాగే ఎయిర్ ఫిల్టర్‌ను రీప్లేస్ చేయటం వలన ఎఫీషియెన్సీ 10 శాతం పెరుగుతుంది. ఫాల్టీ ఆక్సిజెన్ సెన్సార్ వలన కారు మైలేజ్ 40 శాతం తగ్గిపోతుంది. అందుకే కారును ఎప్పుడూ కండిషన్‌లో ఉంచుకోవాలి.

2. టైరులో గాలి చెక్ చేసుకోండి

2. టైరులో గాలి చెక్ చేసుకోండి

కారు టైర్లలో గాలి సరైన మోతాదులో లేకపోయినట్లయితే, వాటి రోలింగ్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఫలితంగా, కారును ముందుకు నడిపిందేంకు ఇంజన్‌పై మరింత అధిక భారం పడుతుంది, దాని వల్ల అధిక ఇంధనం ఖర్చు అవుతుంది. సరైన మోతాదులో గాలి నిండిన టైర్లు ఎక్కువ కాలం మన్నడమే కాకుండా, పర్యావరణంపై కూడా తక్కువ ప్రభావాన్ని చూపుతాయి. టైర్లను సరిగ్గా మెయింటైన్ చేసుకుంటే, మీ విలువైన నగదు కూడా ఆదా అవుతుంది.

3. మైలేజ్ కోసం డ్రైవ్ చేయటం నేర్చుకోండి

3. మైలేజ్ కోసం డ్రైవ్ చేయటం నేర్చుకోండి

మైలేజ్ అనేది డ్రైవింగ్ చేసే వారి డ్రైవింగ్ తీరునుబట్టి కూడా ఆధారపడుతుంది. హఠాత్తుగా కారును స్టాప్ చేయటం, స్టార్ట్ చేయటం, కారును జర్కీగా డ్రైవ్ చేయటం, అనవసరమైన చోట్ల బ్రేక్స్ అప్లయ్ చేయటం, అవసరం లేని చోట వేగంగా వెళ్లటం, లాంగ్ సిగ్నల్స్ వద్ద ఇంజన్ ఐడిల్‌గా ఉంచటం, గేర్ షిఫ్టింగ్ వంటి అనేక అంశాలు మైలేజ్‌పై ప్రభావం చూపుతాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని డ్రైవ్ చేయటం వలన కారు మైలేజ్ పెరగటంతో పాటుగా, తక్కువ ఇంధనం ఖర్చయ్యి పర్యావరణానికి కొంత మేర మేలు జరుగుతుంది.

4. మీ కారును తేలికగా ఉంచడం

4. మీ కారును తేలికగా ఉంచడం

అధిక భారం కలిగిన కారు అధిక ఇంధనాన్ని గ్రహిస్తుందని గుర్తుంచుకోండి. కాబట్టి, ఎల్లప్పుడూ మీ కారును వీలైనంత వరకు తేలికగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. కారులో అనవసరమైన లగేజ్ ఏదైనా ఉంటే, దానిని తొలగించండి. అవసరం లేనప్పుడు రూఫ్ మౌంటెడ్ లగేజ్ ర్యాక్‌లను, బూట్ స్పేస్‌లోని ఎక్స్‌ట్రా లగేజ్‌ని తొలగించండి. ఇలా చేయటం వలన కారు తేలికగా మారి, ఇంజన్‌పై అధనపు భారం పడకుండా, తక్కువ ఇంధనాన్ని గ్రహిస్తుంది. ఫలితంగా పర్యావరణానికి కొంత మేరైనా మేలు జరుగుతుంది.

5. మీ కారును జాగ్రత్తగా వాష్ చేయండి

5. మీ కారును జాగ్రత్తగా వాష్ చేయండి

ఇంటి వద్ద మీ కారును వాష్ చేసేటప్పుడు అత్యంత అమూల్యమైన నీటిని వృధా చేయకండి. కారును శుభ్రం చేయటం తగినంత నీటిని మాత్రమే వాడండి. వీలైనంత వరకు మీ కారును పొడిబట్టతో శుభ్రం (డ్రై వైప్) చేయటానికి ప్రయత్నించండి. మరీ ఎక్కువ మురికి పట్టి ఉంటే నీటిని జాగ్రత్తగా వినియోగిస్తూ క్లీన్ చేయండి. పర్యావరణానికి హాని కలిగించని ఈకో ఫ్రెండ్లీ క్లీనర్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి, వాటి సాయంతో కారును శుభ్రం చేసి, పర్యావరణ పరిరక్షణకు పాటుపడండి.

చివరిమాట

చివరిమాట

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. పర్యావరణ పరిరక్షణలో మన వంతు కృషిగా ఈ చిన్ని చిట్కాలను పాటించి, కొంత మేరకైనా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేద్దాం.

ఈ కథనంలో పేర్కొన్నవి కాకుండా, పర్యావరణాన్ని రక్షించేందుకు మీకు తెలిసిన మరిన్ని చిట్కాలు ఏవైనా ఉంటే, వాటిని మా పాఠకులతో పంచుకోండి.

More from DriveSpark

Article Published On: Thursday, June 5, 2014, 18:22 [IST]
English summary
According to a survey conducted by the International Council of Clean Transportation or ICCT, the number of vehicles on the road in India has almost trebled to 130 million in 2013 from 50 million in 2003. As a result, harmful nitrogen oxide emissions have also increased by 10 percent from 2003.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+