వేసవిలో మీ కారు లోపల చల్లగా ఉండాలంటే.. ఏసీతో పాటు ఈ టిప్స్ తప్పనిసరి
ఈ ఏడాది మార్చి నెల నుంచే ఎండలు మండిపోతున్నాయి. భానుడి తాపానికి జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఇక వాహనదారుల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. కారులో కూర్చున్నా ఉక్కపోత(Car Cooling Tips)కు అల్లాడిపోతున్నారు. ఏసీ లేకుండా బయటకు వెళ్లాలంటే పట్టపగలే చుక్కలే కనిపిస్తున్నాయి.
ఈ క్రమంలో వేసవిలో కారులో ఏసీ వేసుకుని ప్రయాణించినా కానీ మీ వాహనానికి మీకు సహజ గాలి అనేది, సహజంగా లభించే చల్లదనం అవసరం. ఇందుకోసం కారుకు ఎండ తాపం కలగకుండా.. చల్లగా ఉండేలా చూసుకోవాలి. పార్కింగ్ సమయాల్లో మాత్రమే ఇది సాధ్యం. ఇందుకోసం కార్ల యజమానులు కొన్ని చిట్కాలు తప్పనిసరిగా పాటించాలి. అవేంటంటే...

సన్‌షేడ్: మీరు కారును పార్క్ చేసేటప్పుడు మీ కారు విండ్ షీల్డ్‌పై(Car Cool Tips In Summer) సన్‌షేడ్ ఏర్పడేలా చూసుకోండి. అంటే సూర్యకిరణాలు తగలకుండా కారు పార్కింగ్ చేసుకునేలా ప్రయత్నించండి. దీని ద్వారా సూర్యకిరణాలు కారు లోపలికి ప్రవహించకుండా ఉంటుంది. దీంతో ఇంటీరియర్, క్యాబిన్ చల్లగా ఉంటుంది.
నీడలో పార్క్ చేయండి: వేసవిలో మీ కారును వీలైనంత వరకూ నీడలో మాత్రమే పార్క్ చేసుకునేలా చూడండి. సూర్యుని కాంతి నేరుగా తగలకుండా ఉండేలా చూసుకోవాలి. చెట్లు, పార్కింగ్ గ్యారేజీలు లేదా భవనాల నీడ తగిలే చోట మీ కారును ఉంచడానికి ప్రయత్నించడం. దీని ద్వారా మీ కారు వేడెక్కకుండా ఉంటుంది.

విండోలను తెరవండి: వేసవిలో కారు లోపల నిత్యం వేడిగానే ఉంటుంది. ఇందుకోసం మీరు వేడి గాలి బయటకు వెళ్లేందుకు, తాజా గాలి కారు లోపలికి వెళ్లేందుకు విండోలను కొద్దిగా తెరిచి ఉంచండి. మొత్తంగా తెరిచి ఉంచకుండా సగం లేదా కొద్దిగా తెరిచి ఉంచండి. విండోలను మొత్తంగా తెరిచి ఉంచితే దుమ్ము లోపలికి పోయే అవకాశం ఉంటుంది.
విండో విజర్: వేసవిలో మీ కారు విండోలకు విండో విజర్ ఇన్‌స్టాల్ చేసుకోండి. దీని ద్వారా మీ జర్నీలో ఉన్నప్పుడు విండోల ద్వారా సూర్యకాంతి లోపలికి రాకుండా విజర్‌లు అడ్డుకుంటాయి. అంతే కాకుండా మీకు లోపల నీడగా కూడా ఉంటుంది. ఇంకా గాలి ప్రసరణ కూడా ఉంటుంది.

స్టీరింగ్ వీల్, సీట్లు: వేసవి కాలంలో అధిక వేడి కారణంగా కారు క్యాబిన్ కొంత మేర దెబ్బతినే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్టీరింగ్ వీల్, సీట్లు. ఇందుకోసం మీరు వాటిపై కవర్లను ఉంచండి. దీని ద్వారా వేసవి తాపం స్టీరింగ్ వీల్, సీట్లపై పడకుండా ఉండటమే కాకుండా.. మీకు జర్నీలో సౌకర్యంగా ఉండేలా చేస్తుంది.
కూలింగ్ సీట్ కుషన్: వీలైతే కార్ల యజమానులు కూలింగ్ సీట్ కుషన్‌లకు ప్రాధాన్యత ఇవ్వండి. కూలింగ్ సీట్ కుషన్ లేదా వెంటిలేటెడ్ సీట్ కవర్లు.. కారులో తాజా గాలి ప్రసరించేలా చేస్తుంది. అంతేకాకుండా సీటుపై వేడి లేకుండా చల్లగా ఉంచడంలో దోహదపడుతుంది.

ఏసీ వెంట్లు: మీ కారు ఇంటీరియర్‌లో ముఖ్యమైన భాగంలో ఏసీ వెంట్లు. మీరు కారు ఎక్కగానే ముందుగా.. ఎయిర్ కండిషనింగ్‌ను వెంట్ మూడ్‌లోకి మార్చండి. విండోస్ కొద్దిగా ఓపెన్ చేయండి. దీని ద్వారా వేడి గాలి బయటకు వెళ్లిపోయి.. మీ కారు పూర్తిగా ఏసీ మోడ్‌లోకి వెళ్లిపోతుంది.
పార్కింగ్ పొజిషన్: కారు పార్కింగ్ చేయడం ఓ పని అయితే.. దాన్ని సరైన పొజిషన్, స్థలంలో పార్క్ చేయడం మరో పెద్ద పని. ఉదయం సమయంలో మీ కారును తూర్పు వైపు పార్కింగ్ చేయండి. మధ్యాహ్నం సమయంలో పడమర వైపు పార్కింగ్ చేయడానికి ప్రయత్నించండి. దీని ద్వారా సూర్యకిరణాలు ఎక్కువగా లోపలికి ప్రసరించవు.

ఎండాకాలంలో కారు మెయింటెనెన్స్ సరిగ్గా చేయడం చాలా అవసరం. ఈ కాలంలో కారు ఇంజిన్ వేడెక్కడం, పొగలు వ్యాపించడం, హఠాత్తుగా ఇంజిన్‌లో నుంచి మంటలు రావడం లాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే పైన చెప్పిన చిట్కాలు తప్పనిసరిగా పాటించాలి.


Click it and Unblock the Notifications








