ఒంటరిగా క్యాబ్స్‌, ఆటో లలో వెళ్తున్నారా? ఎవరినీ నమ్మలేం.. మీ అక్కా, చెల్లెమ్మలకు వెంటనే షేర్‌ చేయండి!

దేశంలో మహిళలపై వేధింపులు, లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి ఘటనలు నిత్యం వార్తల్లో కనిపిస్తున్నాయి. అదే విధంగా కొన్ని ట్యాక్సీలలో మహిళలపై డ్రైవర్లు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి సంఘటనలపై మహిళలు చాలా వరకు మహిళలను అప్రమత్తంగా ఉంటున్నారు. అయినా కానీ ట్యాక్సీ బుక్ చేసుకోవడం దగ్గర నుంచి గమ్యస్థానానికి చేరుకోవడం వరకు కుటుంబాలు, తోటి స్నేహితులకు కాస్త ఆందోళన ఉండటం సహజం. కాబట్టి మహిళలను కార్లు, ట్యాక్సీలు, ఆటో రిక్షాలు మొదలైన వాటిలో ప్రయాణించేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని చిట్కాలపై ఓ లుక్కేయండి.

కార్ ట్యాక్సీ కంపెనీ వివరాలు చెకింగ్‌: క్యాబ్ సర్వీస్ అందించే కంపెనీల గురించి గూగుల్‌లో కొంచెం రీసెర్చ్ చేస్తే మంచిది. స్థానిక క్యాబ్ సేవను ఉపయోగించడానికి బదులుగా, సాధ్యమైనంత పెద్ద నెట్‌వర్క్‌ని ఉపయోగించడం బెటర్. కారులో ఎక్కే ముందు క్యాబ్ సర్వీస్ కంపెనీ వెబ్‌సైట్‌/యాప్‌లో క్యాబ్ ట్యాక్సీ రిజిస్ట్రేషన్ నెంబర్ చెక్ చేసుకోవాలి.

Safety Tips for Women Cabs

డ్రైవర్‌ని వెరిఫై చేయండి: కారు రిజిస్ట్రేషన్ నెంబర్‌ సరిగ్గా ఉన్న తర్వాత, కారులోకి ప్రవేశించే ముందు డ్రైవర్‌ని ఓ సారి నిశితంగా పరిశీలించండి. నేటి క్యాబ్ సర్వీస్ కంపెనీలు డ్రైవర్ పూర్తి వివరాలను ఫోటోలతో ప్రచురిస్తున్నాయి. ఫొటోలో ఉన్న వ్యక్తి డ్రైవర్ అని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. అతను రాలేకపోయాడు కాబట్టి నేను ఇక్కడ ఉన్నానని మరో వ్యక్తి చెబితే వెంటనే క్యాబ్ క్యాన్సిల్ చేయండి.

వివరాల గోప్యత: కారులో కూర్చున్న తర్వాత ఓటీపీ, గమ్యస్థానం వివరాలను మినహా డ్రైవర్‌తో ఎలాంటి వివరాలు పంచుకోకూడదు. ప్రతిరోజూ మిమ్మల్ని తీసుకెళ్లే వ్యక్తి అయినప్పటికీ వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దు. అలాగే, కారులో కూర్చున్నప్పుడు మొబైల్ ఫోన్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో ఇవి వారు రికార్డింగ్‌ని చేసే అవకాశం ఉంటుంది.

Women in Cabs

మొబైల్ ఫోన్‌ని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోండి: మీరు ట్యాక్సీలు మరియు ఆటోలలో ఒంటరిగా ప్రయాణించేటప్పుడు, మీ మొబైల్ ఫోన్ మాత్రమే మీకు పూర్తిగా సపోర్ట్‌ చేస్తుందని మర్చిపోవద్దు. ట్యాక్సీ, డ్రైవర్‌పై అనుమానం ఉంటే వెంటనే మీ ఫోన్‌లో వీడియో కూడా తీయండి. అలాంటి ట్రిప్ చేయాలనుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎమర్జెన్సీని వినియోగించండి. ముఖ్యంగా మీ ఫోన్‌ ఫుల్‌ ఛార్జ్ ఉండేలా చేసుకోండి.

మ్యాప్స్‌ని ఉపయోగించండి: మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి ట్రిప్ పొడవునా గూగుల్ మ్యాప్స్‌ని ఆన్‌లో ఉంచండి. క్యాబ్ సర్వీస్ కంపెనీలు కూడా తమ మొబైల్ యాప్స్‌ ద్వారా మ్యాప్స్‌ని అందిస్తాయి. మీ ఫోన్‌లోనూ దీన్ని ఉపయోగించడం ఇంకా మంచిది. అవసరమైతే లైవ్ లొకేషన్‌ని మీ ఫ్యామిలీ లేదా మీ సన్నిహితులను షేర్‌ చేయండి.

Women Safety in Cabs

షార్ట్ కట్ అవసరం లేదు: మీరు వేగంగా వెళ్లాలనే కారణంతో ఇతర మార్గాలు లేదా షార్ట్ కట్‌లను ఎంచుకోమని డ్రైవర్ కు చెప్పవద్దు. ఒకవేళ డ్రైవర్ తనంతట తానుగా వేరే మార్గాన్ని ఎంచుకున్నట్లయితే, వెంటనే దాని గురించి అతడిని అడగండి. ఒకవేళ అతడు సరైన సమాధానం ఇవ్వనట్లయితే, వెంటనే కారును ఆపి వేయమని లేదా ఫోన్‌ ద్వారా కస్టమర్‌ లేదా 100కి డయల్‌ చేయండి.

చాలా జాగ్రత్తగా ఉండండి: ఒంటరిగా ప్రయాణించేటప్పుడు మహిళలే కాదు, క్యాబ్‌ల్లో వెళ్లేవారు ఎవరైనా చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణమంతా జాగ్రత్తగా ఉండటం వల్ల మిమ్మల్ని, మీ వద్ద ఉండే ఖరీదైన వస్తువులను రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. మొదటిసారి గుర్తుతెలియని ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. మీ ప్రయాణం ఆరంభం అవ్వగానే కునుకు తీసినా లేదా అప్రమత్తంగా లేకపోయినా కొత్త చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

Safety Tips for Women in cabs

డ్రైవ్స్‌పార్క్ వ్యాఖ్య: మహిళలపై లైంగిక వేధింపులు ఖండించదగినవి. మన స్వతంత్ర భారతంలో మహిళలు అనేక రంగాల్లో పురోగతి సాధిస్తున్నారు. కానీ మహిళల ప్రజారవాణా సురక్షితంగా లేకుంటే అది మొత్తం సొసైటీకి ప్రమాదం. కావున ఇంతకు ముందు చెప్పినట్లుగా మహిళలు ఆ చిట్కాలు పాటించి మీ గమ్యాన్ని సురక్షితంగా చేరుకోండి. ఒంటరిగా ప్రయాణించే వారికి కూడా ఇది వర్తిస్తుంది.

More from DriveSpark

Article Published On: Sunday, September 15, 2024, 14:47 [IST]
English summary
8 safety tips and precautions for women when travelling in cab
Read more on: #auto tips #taxi #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+