ప్రయాణికులకు ఎయిరిండియా బంపర్‌ ఆఫర్‌.. ఫ్లైట్ టికెట్లపై భారీ డిస్కౌంట్‌.. కానీ.??

మీరు తరచూ విమాన ప్రయాణాలు చేస్తుంటారా.. అయితే మీకు ఇక్కడ ఓ బంపర్‌ ఆఫర్‌ న్యూస్‌ అందిస్తున్నాం. అదేంటంటే.. టాటా గ్రూప్‌నకు చెందిన ఎయి‌ర్‌లైన్స్ సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్(Air India Express) ప్రయాణికులకు ఓ గుడ్‌న్యూస్‌ అందించింది. విమాన టికెట్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ డిస్కౌంట్లు ఎలా వర్తిస్తాయి.?? పూర్తి సమాచారం ఈ కథనంలో..

ఇకపై ఎయిరిండియా(Air India Express Lite Fare) విమాన సేవలు సులభతరం కానున్నాయి. అందుకు తగినట్లుగా ఈ ఎయిర్‌లైన్స్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే ఈ సర్వీస్‌లో కొన్ని కండిషన్స్‌ ఉన్నట్లు ఎయిరిండియా వెల్లడించింది. ఆ కండిషన్స్‌ను ఫాలో అయితే ప్రయాణికులు టికెట్లపై భారీ తగ్గింపును పొందవచ్చు. అదెలా అంటే..

Discounts-On-Air-India-Express-Flight-Tickets

టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌(Air India Flight Discounts)లో ప్రయాణికులకు నాణ్యమైన సేవలందిస్తున్నాయి. కాగా విమాన ప్రయాణానికి ముందు చెక్‌ ఇన్‌ ఫ్లయర్‌ కౌంటర్లు, బ్యాగేజీ బెల్ట్‌ల వద్ద ఎక్కువ క్యూ ఉండటాన్ని చూస్తుంటాం. అయితే దీన్ని నివారించేందుకు ఎయిర్‌ ఇండియా ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు విమాన టికెట్లపై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది.

ప్రయాణికులు ఎవరైతే చెక్ ఇన్ బ్యాగేజ్ లేకుండా జర్నీ చేసేందుకు ఇష్టపడతారో వారికి టికెట్లపై తగ్గింపు అందిస్తున్నట్లు తాజాగా ఎయిరిండియా ప్రకటించింది. దీనర్థం.. ఎలాంటి బ్యాగేజ్‌ లేకుండా విమాన ప్రయాణాలు చేసే వారికి తక్కువ ధరలోనే విమాన ప్రయాణాలు చేసేందుకు అవకాశం కల్పిస్తూ ఎక్స్‌ప్రెస్ లైట్ స్కీమ్‌(Express Lite Scheme)ను ప్రవేశపెట్టింది.

Discounts-On-Air-India-Express-Flight-Tickets

ఈ ఎక్స్‌ప్రెస్‌ లైట్‌ ద్వారా ప్రయాణికులు సాధారణ ఛార్జీల(Discounts on Flight Tickets) కంటే తక్కువ ధరలో ఎయిరిండియా విమాన టికెట్లు పొందవచ్చు. ఈ స్కీమ్‌ ద్వారా కౌంటర్లు, బ్యాగేజ్ బెల్ట్‌ల వద్ద క్యూలైన్లను నివారించవచ్చని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. అదే విధంగా ముందుగా బుక్‌ చేసుకుంటే.. 15 కిలోలు, 20 కిలోల చెక్ ఇన్ బ్యాగేజీలపై డిస్కౌంట్‌ పొందవచ్చని ప్రకటనలో వివరించింది.

అంతేకాకుండా ఎక్స్‌ప్రెస్ లైట్ స్కీమ్‌ ద్వారా డిస్కౌంట్లు పొందే ప్రయాణికులు ప్రీ బుక్ ఆప్షన్ ద్వారా కాంప్లిమెంటరీ కింద అదనంగా 3 కిలోల బ్యాగేజ్‌ను ఫ్రీగా బుక్‌ చేసుకోవచ్చని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ వెల్లడించింది. ఇందుకోసం ప్రయాణికులు తప్పనిసరిగా చెక్ ఇన్ బ్యాగేజ్ చేయాల్సి ఉంటుందని వివరించింది. కాగా 15, 20 కేజీల అదనపు స్లాబ్ బ్యాగేజీ కోసం ప్రయాణికులు ప్రీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

Discounts-On-Air-India-Express-Flight-Tickets

ఎయిర్‌పోర్ట్‌ ఎయిర్‌ లైన్‌ కౌంటర్లలోని ప్రయాణికులు చెక్‌ ఇన్‌ బ్యాగేజీ సేవలను వినియోగించుకోవచ్చని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ప్రకటనలో వెల్లడించింది. ఎక్స్‌ప్రెస్‌ లైట్‌ స్కీమ్‌ ద్వారా ప్రయాణికులకు క్యూ లైన్‌ సమస్య తీరుతుందని ఎయిర్‌ లైన్స్‌ వెల్లడించింది. దీని ద్వారా సేవలు మరింతగా విస్తరిస్తాయని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ అంకుర్‌ గార్గ్‌ ఆశాభావం వ్యక్తం చేసారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, February 22, 2024, 8:01 [IST]
English summary
Air india express lite scheme passengers can get flight tickets at cheap price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+