కార్లలో ఇది గమనించక పోతే చచ్చిపోతారు.. ఆ లైట్‌ బ్లింక్‌ అయితే చాలా కష్టం!

కారులో ఎయిర్‌బ్యాగ్స్‌ చాలా కీలకంగా ఉంటాయి. మీ కారు ఏదైనా ప్రమాదంలో ఇతర వాహనాన్ని లేదా ఏదైనా వస్తువుని ఢీకొన్నప్పుడు ఇవి మీ ప్రాణాలను కాపాడతాయి. కావున కార్ల యజమానులు ఎయిర్‌బ్యాగ్‌ మెయింటైనెన్స్‌ని నిర్లక్ష్యం చేయవద్దు. దీనివల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కారు రెగ్యూలర్ చెకప్స్‌లో ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్ సక్రమంగా పనిచేస్తోందా లేదా అనే విషయాన్ని ధృవీకరించుకోవడం చాలా ముఖ్యం. మీరు కూడా ఎయిర్‌బ్యాగ్ సెట్టింగ్‌ని క్రమం తప్పకుండా చెక్‌ చేస్తూ ఉండాలి. ఒకవేళ దీని మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగ్ సకాలంలో తెరుచుకోక పోవడం మూలన ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల కారులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అది ప్రాణాంతకం కూడా అవ్వవచ్చు.

మీ కారు ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌ని ఎలా నిర్వహించాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ ఎయిర్‌బ్యాగ్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే మీ డ్యాష్ బోర్డ్‌పై ఎయిర్‌బ్యాగ్ వార్నింగ్ లైట్‌ వస్తుంది. దీనిని రెగ్యూలర్‌గా గమనించాలి. దీనినే సాధారణంగా SRS లైట్ అని పిలుస్తారు. ఈ అలర్ట్‌ లైట్ ఆన్‌లో ఉంటే ఎయిర్ బ్యాగ్ సిస్టమ్‌లో ఏదైనా సమస్య ఉండవచ్చని అర్థం చేసుకోవాలి. దీనిపై మీకు అవగాహన లేకపోతే టెక్నీషియన్‌ సహాయం తీసుకోవాలి.

Airbag Safety in Cars

ఈ లైట్ రెగ్యూలర్‌గా బ్లింక్‌ అవుతుంటే ఎయిర్‌బ్యాగ్‌ సిస్టమ్‌ ప్రమాద సమయంలో తెరుచుకోదు. ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్ మంచి కండిషన్‌లో ఉంచడానికి రెగ్యులర్ సర్వీసింగ్ చాలా కీలకం. పైన చెప్పిన విధంగా కార్ల యజమానులు ప్రతి రెగ్యూలర్‌ సర్వీసింగ్‌లో ఎయిర్‌బ్యాగ్, వాటి భాగాలను చెక్‌ చేయామని చెప్పాలి. దీనిని రెగ్యూలర్‌గా చెక్‌చేయాల్సిన పనిలేదు. ప్రతి 6 నుంచి 12 నెలలకు ఒకసారి చెక్‌ చేస్తే సరిపోతుంది.

ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్, సెన్సార్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీనివల్ల ప్రమాదంలో ఎయిర్‌బ్యాగ్ తెరచుకునేందుకు సహాయపడతాయి. అలాగే కారు తయారీదారు సైతం యూజర్ మాన్యువల్‌లో ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్ మెయింటైనెన్స్ కోసం నిర్దిష్ట సూచనలు అందిస్తారు. దీనిని మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకుని తనిఖీ చేయడం ఉత్తమం. ప్రమాదంలో ఎయిర్‌బ్యాగ్స్‌ తెరుచుకోకుండా నిరోధించడానికి అనేక అంశాలు ఉంటాయి. అవి ప్రమాద సయమలో సరిగ్గా రెస్పాండ్‌ కాకపోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతుంది.

Airbags Light Blink

ముఖ్యంగా కొలిషన్ సెన్సార్లలో లోపాలు, ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ మోడల్ దెబ్బతినడం, కారు బ్యాటరీలో సమస్యలు లేదా ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్ వయస్సు వంటివి ఉన్నాయి. కావున ఎయిర్‌బ్యాగ్‌ వయస్సు దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉంటే ఎయిర్‌బ్యాగ్స్‌ తక్కువ గాలి కారణంగా సరిగ్గా తెరుచుకోవు. ఇది దీర్ఘకాలంలో పెద్ద సమస్యకు దారితీస్తాయి. ప్రమాదం జరిగిన తర్వాత ఎయిర్‌బ్యాగ్‌ సిస్టమ్ సైతం దెబ్బతింటుంది.

ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌ నిర్వహణ కోసం కారు యజమానులు కొన్ని నియమాలను పాటించాలి. ఎయిర్‌బ్యాగ్స్‌, వాటి సెన్సార్లు క్రమం తప్పకుండా తనిఖీ చేయబడేలా చూసుకోవడం.. వాటి ఫిక్సింగ్‌ వంటివి చాలా కీలకం. ఏదైనా రిపేర్ సమయంలో ఒరిజినల్ విడిభాగాలను మాత్రమే ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌లో అమర్చాలి. అది కూడా అధీకృత సర్వీస్ సెంటర్ వద్ద మాత్రమే నిర్వహించడం చాలా ముఖ్యం.

Airbags in Cars

అలాగే డ్యాష్‌బోర్డ్ లేదా స్టీరింగ్ కవర్ వంటి ఎయిర్‌బ్యాగ్‌ సకాలంలో తెరచుకోవాలంటే కారు భాగాలను మార్చకుండా (మోఢిఫికేషన్స్) వంటివి చేయకుండా ఉండాలి. చివరగా, ఎయిర్‌బ్యాగ్ వార్నింగ్ లైట్‌ని ఎప్పుడూ విస్మరించకూడదు. ప్రమాదం తర్వాత ఎయిర్‌బ్యాగ్స్‌ తెరిచి ఉన్నాయా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఆ సిస్టమ్‌ని మళ్లీ తనిఖీ చేయాలి. దీనివల్ల కొలిషన్ సెన్సార్లు లేదా మోడళ్లకు నష్టం జరగవచ్చు, తద్వారా వాటిని ఫిక్స్‌ చేయవచ్చు.

More from DriveSpark

Article Published On: Saturday, November 23, 2024, 11:34 [IST]
English summary
Airbag safety maintenance and precautions needs to take
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+