ఎయిర్‌బ్యాగ్స్: ఎలా పనిచేస్తాయి, ఎన్ని రకాలు, చరిత్ర

By Super

ఎయిర్‌బ్యాగ్ - వాహనంలో అత్యంత ముఖ్యమై సేఫ్టీ ఫీచర్. అత్యవర పరిస్థితుల్లో మిల్లీ సెకండ్ల సమయంలో విచ్చుకొని ప్రయాణీకుల ప్రాణాలకు రక్షణ కవచంగా నిలిచే సంజీవని. ఇప్పటికే అనేక దేశాల్లోని వాహనాల్లో ఎయిర్‌బ్యాగ్ అనేది ఓ తప్పనిసరి సేఫ్టీ ఫీచర్‌గా మారిపోయింది. కానీ, మన దేశంలో ఇదొక ఆప్షనల్ ఫీచర్. ఇందుకోసం అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

ఎయిర్‌బ్యాగ్‌లు లేని వాహనాలను నడుపుతున్నప్పుడు ప్రమాదం జరిగినట్లయితే, ఫ్రంట్ సీట్లో కూర్చున్న డ్రైవర్, ప్యాసింజర్ తీవ్ర గాయాల పాలయ్యే ఆస్కారం ఉంది. అదే, ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్న వాహనాలను నడుపుతున్నప్పుడు ప్రమాదం జరిగినట్లయితే, ఆ ప్రమాద తీవ్రత నుంచి డ్రైవర్ ప్యాసింజర్ తప్పించుకునే ఆస్కారం ఉంటుంది. కేవలం డ్రైవర్ ప్యాసింజర్‌కే కారులోని ఇతర ప్రయాణీకుల కోసం కూడా పలు రకాల ఎయిర్‌బ్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఈనాటి మన కార్ టాక్ శీర్షికలో అసలు ఎయిర్‌బ్యాగ్‌లు ఎన్ని రకాలు, అవి ఎలా పనిచేస్తాయి, వీటిని మొట్టమొదటిసారిగా కనుగొన్నది ఎవరు, ఎయిర్‌బ్యాగ్‌లు మనుషుల ప్రాణాలను ఎలా కాపాడుతాయి తదితర వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఎయిర్‌బ్యాగ్స్ ఎలా పనిచేస్తాయి

తర్వాతి స్లైడ్‌లలో ఎయిర్‌బ్యాగ్‌లకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

చరిత్ర

చరిత్ర

జర్మన్ ఇంజనీర్ వాల్టర్ లిండరర్, అమెరికన్ ఇండస్ట్రియల్ ఇంజనీర్ జాన్ డబ్ల్యూ హెట్రిక్‌లు తొలిసారిగా 1941లో ఎయిర్‌బ్యాగ్‌ను డిజైన్ చేశారు. వాల్టర్ అక్టోబర్ 6, 1951లో పేటెంట్ కోసం ధరఖాస్తు చేసుకోగా నవంబర్ 12, 1951లో అనుమతి లభించింది. అంతకంటే మూడు నెలల ముందుగా అంటే ఆగస్ట్ 18, 1953వ తేదీన హెట్రిక్‌కి పేటెంట్ లభించింది.

అయితే, వీరిద్దరి డిజైన్లు కార్యరూపం దాల్చలేదు. వాల్టర్ డిజైన్ యాక్సిడెంట్ సమయంలో వేగంగా విచ్చుకోలేదనే నెపంతో రిజెక్ట్ అయింది. హెట్రిక్ డిజైన్ మాత్రం పెట్టుబడిదారులు ముందుకి రాని కారణంగా ఫెయిల్ అయ్యింది. హెట్రిక్ పేటెంట్‌కి కాలం చెల్లిపోయిన తర్వాత అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ తమ కొన్ని వాహనాల్లో ఎయిర్‌బ్యాగ్‌ని ఓ ఎక్స్‌పెరిమెంట్‌గా పరిచయం చేసింది.

ఎయిర్‌బ్యాగ్స్ ఎలా పనిచేస్తాయి

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఆటోమొబైల్ సేఫ్టీ సిస్టమ్‌ల తయారీ సంస్థల్లో ఒకటైన బ్రీడ్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు అలెన్ కె బ్రీడ్, ప్రమాదం జరిగినప్పుడు కేవలం 30 మిల్లీ సెకండ్లలో ఎయిర్‌బ్యాగ్ విచ్చుకునేందుకు కావల్సిన మెకానికల్ సెన్సార్లను పరిచయం చేశారు. ఈ ఎయిర్‌బ్యాగ్స్ కంప్రెస్డ్ ఎయిర్‌తో కాకుండా సోడియం అజైడ్‌తో విచ్చుకుంటాయి. క్రిస్లర్‌తో కలిసి బ్రీడ్ వీటిని మార్కెటింగ్ చేశారు. అమెరికాలో ఎయిర్‌బ్యాగ్‌లు పూర్తిగా ప్రాచుర్యంలోకి వచ్చింది 1990 ఆరంభంలో.

ఎయిర్‌బ్యాగ్స్ ఎలా పనిచేస్తాయి

1970 కాలంలో చాలా మంది సీట్ బెల్టులను సరిగ్గా ఉపయోగించని కారణంగా, ప్యాసింజర్ వాహనాలలో ఎయిర్‌బ్యాగ్‌లను ఆఫర్ చేయటం మొదలుపెట్టారు. తొలుతగా ఫోర్డ్, ఆ తర్వాత జనరల్ మోటార్స్ కంపెనీలు చిన్న తరహా వాహనాల్లో ఎయిర్‌బ్యాగ్‌లను పరిచయం చేశాయి. మొదట్లో ఎయిర్‌బ్యాగ్‌ల కారణంగా 7గురు చనిపోయినట్లు జనరల్ మోటార్స్ ఇండియాపై ఆరోపణలు కూడా వచ్చాయట. ఆ తర్వాత రోడ్డు నిబంధనలు మరింత కఠినతరం కావటంతో, సీట్ బెల్టులు తప్పనిసరి అయ్యాయి, దాంతో ఎయిర్‌బ్యాగ్‌ల వినియోగం తగ్గుముఖం పట్టింది.

ఎయిర్‌బ్యాగ్ రకాలు

ఎయిర్‌బ్యాగ్ రకాలు

ఎయిర్‌బ్యాగ్‌లు విభిన్న రూపాల్లో, విభిన్న పరిమాణాల్లో లభిస్తాయి. ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో ఉన్న మనుషులను వివిధ కోణాలను రక్షించేందుకు వివిధ రకాల్లో, ప్రాంతాల్లో ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చబడి ఉంటాయి. కారులో ఉండే వారినే కాదు, రోడ్డుపై వెళ్తున్న పాదచారులను ఢీకొట్టినట్లయితే, వారిని కాపాండేందుకు కూడా ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి.

ఫ్రంటల్ ఎయిర్‌బ్యాగ్

ఫ్రంటల్ ఎయిర్‌బ్యాగ్

1987కి చెందిన పోర్షే 944 టర్బో కారులో ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి సారిగా డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ సేఫ్టీ కోసం డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్‌ను అమర్చారు. డ్రైవర్ సేఫ్టీ కోసం స్టీరింగ్ వీల్‌లోను, ఫ్రంట్ ప్యాసింజర్ సేఫ్టీ కోసం డ్యాష్‌బోర్డులోను ఎయిర్‌బ్యాగ్‌లను ఫిక్స్ చేస్తారు.

సైడ్ ఎయిర్‌బ్యాగ్ - డ్రైవర్

సైడ్ ఎయిర్‌బ్యాగ్ - డ్రైవర్

ఎదురుగా వచ్చే ప్రమాదాల నుంచే కాకుండా, పక్క నుంచి వచ్చే ప్రమాదాలను తప్పించుకునేందుకు కూడా ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి. కారు పక్కల నుంచి ప్రమాదం జరిగితే ఇవి విచ్చుకొని, ప్రయాణికులను రక్షణగా నిలుస్తాయి. సైడ్ ఎయిర్‌బ్యాగ్స్‌లో రెండు రకాలున్నాయి. ఇందులో ఒకటి సీట్‌లో అమర్చబడి ఉండే సైడ్ టోర్సో ఎయిర్‌బ్యాగ్. ఇది డ్రైవర్ మరియు డోర్‌కి మధ్యలో విచ్చుకుంటుంది.

సైడ్ ఎయిర్‌బ్యాగ్స్ - ప్యాసింజర్స్

సైడ్ ఎయిర్‌బ్యాగ్స్ - ప్యాసింజర్స్

సైడ్ ఎయిర్‌బ్యాగ్స్‌లో రెండవ రకం - కర్టెన్ ఎయిర్‌బ్యాగ్. పేరుకు తగినట్లుగానే ఈ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్ కారు లోపల అద్దాల చుట్టూ ఉంటుంది. కారు పైభాగంలో వీటిని అమర్చుతారు. ప్రమాదం జరిగినప్పుడు ఇవి విచ్చుకొని కారు అద్దాలు పగిలి, ఆ ముక్కలు గుచ్చుకోకుండా ఉండేందుకు సహకరిస్తాయి. వెనుక సీట్లోని ప్యాసింజర్లకు కూడా ఇవి రక్షణగా నిలుస్తాయి.

క్నీ ఎయిర్‌బ్యాగ్

క్నీ ఎయిర్‌బ్యాగ్

ప్రమాద సమయంలో డ్రైవర్ మోకాలికి రక్షణగా నిలిచేందుకు క్నీ ఎయిర్‌బ్యాగ్ సహకరిస్తుంది. క్నీ ఎయిర్‌బ్యాగ్‌ను తొలిసారిగా 1996 కియా స్పోర్టేజ్ వాహనంలో ఉపయోగించారు, అప్పటి నుంచి ఇది స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్‌గా మారిపోయింది. ఇది సాధారణంగా స్టీరింగ్ వీల్ క్రింది భాగంలో ఉంటుంది. ప్రమాద సమయంలో క్నీ ఎయిర్‌బ్యాగ్స్ పనితీరు మెరుగ్గా ఉండటంతో 2000 సంవత్సరం నుంచి వీటి వినియోగం మరింత ఎక్కువైంది.

రియర్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్

రియర్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్

వెనుక సీటులో కూర్చునే ప్రయాణీకుల సేఫ్టీ కోసం ఈ రియర్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్‌ను పరిచయం చేశారు. ఇవి వెనుక వైపు నుంచి జరిగే ప్రమాదాల నుంచి ప్రయాణికులకు రక్షణగా నిలుస్తాయి. వీటిని తొలిసారిగా 2008లో టొయోటా ఐక్యూ కారులో ఉపయోగించారు.

పెడస్ట్రెయిన్ ఎయిర్‌బ్యాగ్

పెడస్ట్రెయిన్ ఎయిర్‌బ్యాగ్

కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఎదురుగా, సదరు కారు ఎదురుగా వచ్చే పాదచారులను ఢీకొన్నట్లయితే, వారు కారుపై పడి ప్రమాద తీవ్రత పెరగకుండా ఉండేందుకు డిజైన్ చేశారు. పెడస్ట్రెయిన్ ఎయిర్‌బ్యాగ్‌ను తొలిసారిగా వోల్వో తమ వి40 కారులో ఉపయోగించింది.

మోటార్‌సైకిల్ ఎయిర్‌బ్యాగ్

మోటార్‌సైకిల్ ఎయిర్‌బ్యాగ్

ఎయిర్‌బ్యాగ్‌లు కేవలం కార్లకే పరిమితం కాదు, మోటార్‌సైకిళ్లలో కూడా వీటిని వినియోగిస్తారు. జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా తొలిసారిగా తమ గోల్డ్‌వింగ్ మోటార్‌సైకిల్‌లో ఈ ఫీచర్‌ని పరిచయం చేసింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు బైక్ ముందున్న సెన్సార్లు గుర్తించి, ఎయిర్‌బ్యాగ్‌ను యాక్టివేట్ చేస్తాయి.

ఎయిర్‌బ్యాగ్ జాకెట్

ఎయిర్‌బ్యాగ్ జాకెట్

మోటార్‌సైకిల్‌కే కాదు, దానిని నడిపే వారు కూడా ఎయిర్‌బ్యాగ్‌ని జాకెట్ రూపంలో ధరించవచ్చు. మోటోజిపి రైడర్లు ధరించే రైడింగ్ సూట్స్‌లో ఎయిర్‌బ్యాగ్ ఉంటుంది. ఈ సూట్లలో ఉండే చిన్న సెన్సార్లు, ప్రమాదాన్ని గుర్తించి ఎయిర్‌‍బ్యాగ్‌ను యాక్టివేట్ చేస్తాయి.

ఎయిర్‌బ్యాగ్ మేకర్స్

ఎయిర్‌బ్యాగ్ మేకర్స్

ఎయిర్‌బ్యాగ్‌ల తయారీలో ప్రపంచంలో కెల్లా అగ్రగామి కంపెనీల్లో అటోలివ్, డయాసెల్, టకాటా, టిఆర్‌డబ్ల్యూ కంపెనీలు ప్రధానమైనవి.

టకాటా అనేక కార్ మేకర్లు సప్లయ్ చేసిన ఎయిర్‌బ్యాగ్‌లలో సమస్యలు ఉన్నాయని ఇటీవలి కాలంలో హెడ్‌లైన్స్‌కు ఎక్కిన సంగతి తెలిసినదే.

ఎయిర్‌బ్యాగ్ ఎలా పనిచేస్తుంది

ఎయిర్‌బ్యాగ్ ఎలా పనిచేస్తుంది

వాహనంలోని ఎయిర్‌బ్యాగ్ సెన్సార్లను ఓ సెంట్రల్ ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్ పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఎయిర్‌బ్యాగ్స్ బయటకు కనిపించవు. ఇవి స్టీరింగ్, డ్యాష్‌బోర్డ్ వంటి ప్రదేశాల్లో ప్లాస్టిక్ భాగాల క్రింద ఉంటాయి. సెన్సార్లు యాక్సిడెంట్లను గుర్తించినప్పుడు ఎయిర్‌బ్యాగ్ ప్లాస్టిక్ భాగాన్ని వదిలించుకొని, రెప్పపాటు కన్నా 4 రెట్లు తక్కువ సమయంలో విచ్చుకుంటుంది.

ఎయిర్‌బ్యాగ్ వలన గాయాలు

ఎయిర్‌బ్యాగ్ వలన గాయాలు

అనేక సందర్భాల్లో ఎయిర్‌బ్యాగ్ వలన ప్రాణాలు దక్కినప్పటికీ, కొన్ని సందర్భాల్లో మాత్రం ఎయిర్‌బ్యాగ్ వలన డ్రైవర్లు, ప్రయాణీకులు గాయాల పాలైన సందర్భాలున్నాయి. సీట్ బెల్ట్ ధరించనప్పుడు ప్రమాదం జరిగినా, లేదా సరైన రైడింగ్ పొజిషన్‌లో లేకపోయినా ఎయిర్‌బ్యాగ్ విచ్చుకోవటం వలన గాయాలయ్యే ప్రమాదం ఉంది.

ఎయిర్‌బ్యాగ్ లాక్

ఎయిర్‌బ్యాగ్ లాక్

ఒక్కోసారి చాలా చిన్న ప్రమాదాలకు కూడా ఎయిర్‌బ్యాగ్స్ విచ్చుకుంటుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే, ఎయిర్‌బ్యాగ్స్‌ను ఆఫ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు కారులో ఫ్రంట్ ప్యాసింజర్ లేకుండా డ్రైవ్ చేస్తున్నట్లయితే, ఆ ఎయిర్‌బ్యాగ్‌ని మాత్రమే ఆఫ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. కానీ, ఎయిర్‌బ్యాగ్స్‌ని ఎల్లప్పుడూ ఆన్ చేసి డ్రైవ్ చేయటమే ఉత్తమం.

ఎయిర్‌బ్యాగ్ క్యాలుక్యులేషన్

ఎయిర్‌బ్యాగ్ క్యాలుక్యులేషన్

ఎయిర్‌బ్యాగ్ విచ్చుకోవటానికి కూడా ఓ క్యాలుక్యులేషన్ ఉంటుంది. సీటులో నిర్ధిష్ట బరువు, సీటింగ్ పొజిషన్, సీట్ బెల్ట్ ధరించడ్, సీట్ లొకేషన్ వంటి ప్రమాణాలపై ఆధారపడి ఎయిర్‌బ్యాగ్ విచ్చుకుంటుంది. ఉదాహరణకు ఫ్రంట్ ప్యాసింజర్ సీటులో 50 కేజీల బరువున్న వ్యక్తి సీట్ బెల్ట్ ధరించుకొని ఉంటేనే ఎయిర్‌బ్యాగ్ విచ్చుకుంటుందని ప్రోగ్రామ్ చేయబడినట్లయితే, ఆ సీటులో 5 కేజీల బరువునున్న చిన్నారిని సీట్ బెల్ట్ ధరించి కూర్చోబెడితే ఎయిర్‌బ్యాగ్ విచ్చుకునే అవకాశం లేకపోవచ్చు.

ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్

ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్

ఎయిర్‌బ్యాగ్స్‌లో ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్ మరింత మోడ్రన్ టెక్నాలజీతో తయారు చేయబడినది (ప్రస్తుతం దాదాపు అన్ని కార్లలో ఇదే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు). సప్లిమెంటల్ రెస్ట్రైంట్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) ఎయిర్‌బ్యాగ్ విచ్చుకోవటం అనేది సీట్ బెల్ట్‌తో లింక్ అయి ఉంటుంది. ప్రమాద సమయంలో ఇది విచ్చుకున్నప్పుడు సీట్ బెల్టులు ఆటోమేటిక్‌గా టైట్ అవుతాయి. ఆ తర్వాత ఇది విచ్చుకుంటుంది.

ఎయిర్‌బ్యాగ్ ఎక్స్‌పైరీ డేట్

ఎయిర్‌బ్యాగ్ ఎక్స్‌పైరీ డేట్

అన్ని ఆటోమొబైల్ కాంపోనెంట్స్ మాదిరిగానే ఎయిర్‌బ్యాగ్స్‌కి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అయితే, ఇవి ఫిక్స్డ్ పార్ట్ కావటంతో చాలా వరకు కార్ కంపెనీలు ఇది కారు జీవితకాలం పాటు పనిచేస్తూనే ఉంటుందని చెబుతారు. కానీ, దీని విషయంలో సందేహం వెంటనే అధీకృత డీలరు, సర్వీస్ సెంటరును సంప్రదించడం ఉత్తమం.

రిపేరు చేయలేం, రీప్లేస్ చేయాల్సిందే

రిపేరు చేయలేం, రీప్లేస్ చేయాల్సిందే

ఎయిర్‌బ్యాగ్ ఒక్కసారి విచ్చుకున్న తర్వాత వాటిని తిరిగి ఉపయోగించడం కుదరదు. విచ్చుకున్న ఎయిర్‌బ్యాగ్ స్థానంలో కొత్త ఎయిర్‌బ్యాగ్‌ను రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ప్రమాదకర యాక్సిడెంట్ల సందర్భంలో ఇన్సూరెన్స్ కంపెనీలు ఎయిర్‌బ్యాగ్ రీప్లేస్‌మెంట్ చార్జీలను భరించే ఆస్కారం కూడా ఉంటుంది. కార్ మోడల్‌ను బట్టి వీటి రీప్లేస్‌మెంట్ ఖర్చు వేల నుంచి లక్షల్లో ఉంటుంది.

Most Read Articles

English summary
Airbags play a very important role in the modern day safety of passengers in a car. Many know that this is increasingly becoming a standardised safety feature in automobiles throughout the world.Lets take a detailed look at how airbags work in an automobile, how they came about, and more.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X