ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్‌తో రోడ్డు ప్రమాదాలు జరగవు.. కానీ పూర్తి స్థాయిలో ఎందుకు అమలు చేయడం లేదు??

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆటో మొబైల్ రంగంలో విస్తృతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందులో ముఖ్యంగా వాహనదారులు, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆటో మేకర్లు వాహనాలను అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా కార్లలో అధునాతన ఫీచర్లను ప్రవేశపడుతున్నారు. వీటి ద్వారా రోడ్డు ప్రమాదాల్లో ప్రయాణికులు సురక్షితంగా బయటపడుతున్నారు.

ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ప్రతి రంగంలోనూ AI ఉనికి కనబడుతోంది. దానిని బేస్ చేసుకుని పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు వేగవంతం అవుతున్నాయి. మరి.. ఆటో మొబైల్ రంగంలో కృత్రిమ మేధ సరైనదేనా.? ఈ రంగంలో దాని భవిష్యత్తు ఏంటో ఇప్పుడు చూద్దాం.

AI-In-Auto-Mobile-Industry

దేశంలో AI టెక్నాలజీ ప్రతి రంగంలో కీలక పాత్ర పోషించడంతో ఆయా రంగాల్లో పురోగతికి దారితీసింది. అందులో ముఖ్యంగా గణనీయమైన పురోగతిని చూసిన సెక్టార్ ఏదైనా ఉందా అంటే.. అది ఆటోమొబైల్ రంగం. ముఖ్యంగా కార్లలో ఏఐ రాక ఈ మధ్య కాలంలో అనూహ్యంగా పెరిగిపోయింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని కార్లలో అమలు చేయడం ద్వారా ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గింది. AI టెక్నాలజీ కలిగి కార్లలో పాదచారులను గుర్తించడం, రాపిడి, వార్నింగ్ సిస్టమ్ మరియు ఆటోమేటెడ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి అధునాతన లక్షణాలను కలిగి ఉండటం ద్వారా ప్రమాదాలు తగ్గుతున్నాయి.

AI-In-Auto-Mobile-Industry

ప్రమాదాలను నివారించడంలో AI కీలక పాత్ర పోషించడంతో ప్రభుత్వం మరియు అనేక మంది ఆటోమొబైల్ పరిశోధకులు AI కార్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. అధిక జనాభా కలిగిన భారత్ వంటి దేశాల్లో రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకుని AI టెక్నాలజీ ఉన్న కార్లను కొనుగోలు చేయాలని కస్టమర్లకు సిఫార్సు చేస్తున్నారు.

ప్రమాదాల సంఖ్య తగ్గడం, ఇంకా రహదారి భద్రతా చర్యల విషయంలో AI దేశీయ రహదారులపై సానుకూల ప్రభావాన్ని చూపింది. AI ఆధారిత కార్లు రోడ్లపైకి రావడంతో AI టెక్నాలజీ అభివృద్ధి చెందడమే కాకుండా ఆటో మొబైల్ రంగంలో ఇది క్రమేణా విస్తరించింది. దీన్ని బట్టి ప్రయాణికులకు ఏఐ టెక్నాలజీ సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

AI-In-Auto-Mobile-Industry

అయితే AI టెక్నాలజీ ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కార్లలో దీన్ని అమలు చేయడంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. కార్లలో AI టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి అయ్యే ఖర్చు ఎక్కువ. ఇంకా చాలా మందిలో దీనిపై అవగాహన లేకపోవడం, ఇంకా ఈ టెక్నాలజీని అమలు చేయడానికి వాహనాల మౌలిక సదుపాయాల్లో అవసరమైన మార్పులు చేయవలసి రావడం వంటివి.. కొన్ని అడ్డంకులుగా ఉన్నాయి.

ఈ అడ్డంకులను పక్కనపెడితే దేశంలో రహదారి భద్రతను విప్లవాత్మకంగా మార్చడంలో AI టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తుందనే చెప్పవచ్చు. AI కార్లు సమీప భవిష్యత్తులో ఒక అవసరంగా మారడానికి ప్రమాదాల సంఖ్య తగ్గింపు మరియు మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ ఉదాహరణలుగా సరిపోతుంది. ఇందులో అవరోధాలు ఉన్నప్పటికీ, అవి అధిగమించలేనివి అయితే కావనే చెప్పాలి.

AI-In-Auto-Mobile-Industry

AI టెక్నాలజీ సంబంధిత సవాళ్లను అధిగమించగల సామర్థ్యాన్ని కలిగి ఉందనడంలో సందేహం లేదు. AI సాంకేతికత రోడ్లపై ప్రయాణికులతో పాటు వాహనాల భద్రతను పెంచడమే కాకుండా నిర్దిష్ట సవాళ్లను పరిష్కరిస్తుంది. దీని ద్వారా ఆటోమొబైల్ పరిశ్రమలో విస్తృతమైన మార్పులు చూడవచ్చు. అవరోధాల గురించి ఆలోచిస్తే ఏదీ సాధించలేమన్నది వాస్తవం.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, September 7, 2023, 14:59 [IST]
English summary
Artificial intelligence future and importance in indian auto mobile industry
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+