మీ వాహనానికి భీమా చేయిస్తున్నారా... ఒక్కనిమిషం ఆగండి..!!

అంతే కాకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బీమా కంపెనీలు తాము ఎక్కువ మొత్తంలో బీమా అందిస్తామని వినియోగదారుల నుంచి సొమ్ము ముట్టిన వెంటనే బోర్డు తిప్పేస్తున్నాయి. దీంతో ఇన్సూరెన్స్ అంటేనే వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల మధ్య తక్కువ మొత్తంతో వాహనాలకు మంచి బీమా సౌకర్యం కల్పించాలంటే ఏంచేయాలి..? ఇలా ఆలోచించే వారికోసమే వాహన బీమాలకు సంబంధించిన కొన్ని చిట్కాలు...
1. ముందుగా మార్కెట్లో ఏయే బీమా కంపెనీలు ఉన్నాయి, వారు అందిస్తున్న ధరలు ఏ విధంగా ఉన్నాయో సరిపోల్చుకోవాలి. ఎందుకంటే ఒక్కో బీమా కంపెనీ ఒక్కో విధమైన వడ్డీ రేట్ల, కవరేజీలను అందిస్తుంది. ఇలా సరిపోల్చుకోవడం వల్ల మీ కారుకు సరసమైన ధరలకే అత్యుత్తమమైన ఇన్సూరెన్స్‌ను పొందవచ్చు.
2. ఎల్లప్పుడూ నమ్మదగిన బీమా కంపెనీల ద్వారా మాత్రమే పాలసీలను కొనుగోలు చేయడం మంచిది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బీమా సంస్థల నుంచి కొనుగోలు చేస్తే మరీ మంచిది.
3. బీమా కంపెనీలు మంచి కవరేజ్‌ను అందిస్తున్నప్పుడు పాలసీ వెల కొంచెం అధికమైనా కొనుగోలు చేయడానికి మాత్రం వెనకడుగు వేయకండి, ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది.
4. ఒకవేళ మీ పాత కారుకు బీమా గడువు ముగిసిపోయి.. కొత్తగా బీమా చేయించాలనుకున్నప్పుడు దొంగతనం మరియు ఢీకొనడం (థెఫ్ట్, యాక్సిడెంట్) బీమా చేయించడం కన్నా జనరల్ ఇన్సూరెన్స్ చేయించడం మంచిది. ఇలా చేయడం వలన బీమా ప్రీమియం తగ్గుతుంది.
5. ఇతర బీమా కంపెనీలు కార్ ఇన్సూరెన్స్‌పై గొప్ప తగ్గింపులు ప్రకటించినా.. వెంటనే ఆ పాలసీను తీసుకోవడానికి సిద్ధపడకుండా.. సదరు బీమా కంపెనీలు అందిస్తున్న కవరేజీని ఒక్కసారి సరిపోల్చుకోండి. ప్రస్తుతం మీరు తీసుకున్న పాలసీకన్నా అది మెరుగైనదనిపిస్తే మాత్రమే సదరు పాలసీకు మారటం ఉత్తమం.
6. ఒకేసారి రెండు, మూడు ఇన్సూరెన్స్‌లను కలిపి తీసుకోవడం కూడా మంచిదే. ఉదాహరణకు ఒక బీమా కంపెనీ నుంచి గృహ, జీవిత, వాహన బీమాలను ఒకే సమయంలో తీసుకున్నట్లుయితే సదరు బీమా కంపెనీలు రాయితీలను ఇచ్చే ఆస్కారం ఉంది.
7. చివరిగా మీ కారులో ఇన్‌స్టాల్ చేయబడిన అన్ని సురక్షక సదుపాయాలను (సేఫ్టీ ఫీచర్స్) బీమా పత్రంలో పేర్కొనడం మంచిది. ఇలా చేయడం వల్ల బీమా ప్రీమియంలో తగ్గింపులు లభించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








