ఆటోమేటిక్ కారు మరియు మ్యాన్యువల్ కారు: వీటిలో ఏది బెస్ట్ ?

మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభించే రెండు రకాల కార్లకు అనుకూల మరియు ప్రతికూల అంశాలు ఉన్నాయి.

By Anil

ఇండియాలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కార్లను ఎంచుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కార్లు ఇప్పటికీ మార్కెట్‌ని శాసిస్తున్నాయి. విపణిలో ఇటు ఆటోమేటిక్, అటు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కార్లకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభించే రెండు రకాల కార్లకు అనుకూల మరియు ప్రతికూల అంశాలు ఉన్నాయి. వీటి ద్వారా నేటి కథనంలో ఏ ట్రాన్స్‌‌మిషన్ ఉన్న కారులో ఎలాంటి నష్టాలు ఉన్నాయో, ఎలాంటి లాభాలు ఉన్నాయో చూద్దాం రండి...
ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వాహనాలు:

ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ గేర్‌బాక్స్

సిటీ ట్రాఫిక్‌లో ఏఎమ్‌టి కార్లను సులభంగా నడపవచ్చు

మీరు ప్రతిరోజు నగరంలో కారును నడుపుతున్నట్లయితే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల కార్లు ఎంతో ఉత్తమం. సిగ్నల్స్ వద్ద మరియు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయినప్పుడు నెమ్మదిగా ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో మ్యాన్యులల్ ట్రాన్స్‌మిషన్ కార్లలో ప్రతిసారీ గేర్లను మార్చాల్సి ఉంటుంది.

Recommended Video

Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ గేర్‌బాక్స్

కానీ, ఆటోమేటిక్ కార్లు మాత్రం వేగాన్ని బట్టి గేర్లను దానంతట అదే మార్చుకుంటూ ఉంటుంది. ట్రాఫిక్‌లో ఏఎమ్‌టి కారును డ్రైవ్‌ చేస్తున్నపుడు యాక్సిలరేటర్ మరియు బ్రేక్ పెడల్స్ ఆపరేట్ చేస్తే చాలు. ఇప్పుడున్న ఆటోమేటిక్ కార్లలో క్రీప్ ఫంక్షన్ కలదు. క్రీప్ ఫంక్షన్ అనగా: బ్రేక్ పెడల్ కొద్ది కొద్దిగా వదిలేకొద్దీ కారు నెమ్మదిగా ముందుకు కదులుతుంది.

ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ గేర్‌బాక్స్

డ్రైవింగ్ నేర్చుకోవడానికి అధిక సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదు

మ్యాన్యువల్ గేర్‌బాక్స్ గల కార్ల కంటే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల కార్ల ద్వారా డ్రైవింగ్ తేలికగా, సులభంగా నేర్చుకోవచ్చు. సాధారణంగా ఎక్కువ మంది మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల కార్ల ద్వారా డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉంటారు. వీరు ఎదుర్కునే ప్రధాన సమస్య ఒకే సారి మూడు పెడల్స్ ఆపరేట్ చేయడం, గేర్ రాడ్ మరియు స్టీరింగ్ మీద ధ్యాస ఉంచడం. డ్రైవింగ్ నేర్చుకునే వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.

ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ గేర్‌బాక్స్

అయితే ఏఎమ్‌టి కారు ద్వారా డ్రైవింగ్ నేర్చుకున్నట్లుయితే, ప్రారంభంలో స్టీరింగ్ పట్టుకునే వారు తొలుత రోడ్డు మీద అధిక శ్రద్ద చూపుతారు, తరువాత యాక్సిలరేటర్ మరియు బ్రేక్ పెడల్స్ మాత్రమే ఉండటం, మరియు గేర్లను మార్చాల్సిన అవసరం లేకపోవడంతో చాలా సులభంగా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు.

ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ గేర్‌బాక్స్

వాలు మరియు ఎగుడుదిగుడు తలాల్లో డ్రైవింగ్

ఎగుడుదిగుడు రోడ్ల గల ప్రాంతంలో మీరు నివశిస్తున్నట్లయితే ఆటోమేటిక్ కార్లు అందుకు బాగా సెట్ అవుతాయి. ఏటవాలు ఎత్తు రోడ్ల మీద ప్రయాణిస్తున్నపుడు కార్ల వెనక్కి జారడాన్ని నివారించడానికి ఆటోమేటిక్ కార్లలో హిల్-హోల్డ్ వంటి ఫీచర్ ఉంది. అయితే, గుర్తుంచుకోండి మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వాహనాలలో ఇలాంటి ఫీచర్ చాలా అరుదుగా ఉంటుంది మరియు ఈ తరహా రోడ్ల మీద మ్యాన్యువల్ వాహనాలను నడపడానికి ఎంతో నెపుణ్యం అవసరం.

ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ గేర్‌బాక్స్

కొండ ప్రాంతాల్లో, ఎత్తైన ప్రాంతాల్లో నివసించే వారికి ఏఎమ్‌టి వాహనాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి, మెట్ట రోడ్ల మీదే కాదు, వాలు తలం ఉన్న రోడ్ల మీద కూడా ఏఎమ్‌టి కార్లు ఎంతో బెస్ట్. అయితే వేగాన్ని అదుపులో ఉంచుకోవడానికి తరచూ బ్రేకులను అప్లే చేయాల్సి ఉంటుంది. వాలు తలం మీద వాహనాన్ని నిలపడానికి మ్యాన్యువల్ వాహనాల తరహాలో హ్యాండ్‌బ్రేక్‌ను తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది.

ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ గేర్‌బాక్స్

త్వరితంగా స్పందించే తత్వం

గ్రీన్ సిగ్నల్స్ వద్ద వాహనాలు చాలా వేగంగా స్పందించాల్సి ఉంటుంది. సిగ్నల్స్ వద్ద మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వాహనాలను త్వరగా నడపాలి అంటే క్లచ్ నెమ్మదిగా వదులు చేసి, యాక్సిలరేట్ రైస్ చేయాలి. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది విఫలమవుతుంటారు.

ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ గేర్‌బాక్స్

క్లచ్ ప్రెస్ చేయడం మరియు వదులు చేయడమ మరియు గేర్లను మార్చడమే మ్యాన్యువల్ వాహనాలలో ప్రధానమైన సమస్య. ఆటోమేటిక్ వాహనాలలో ఈ రెండు ఇబ్బందులు ఉండవు, సిగ్నల్స్ వద్ద గ్రీన్ లైట్ కనబడతే బ్రేక్ వదిలేసి యాక్సిలరేట్ చేసే ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వెహికల్ ముందుకు కదులుతుంది.

ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ గేర్‌బాక్స్

అదుర్లు, కుదుపులు లేని సౌకర్యవంతమైన ప్రయాణం

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వెహికల్‌లో ప్రయాణిస్తున్నపుడు మనకు తెలియకుండానే గేర్లు మారిపోతాయి. గేర్లు మారుతున్న సంగతి మనకు అస్సలు తెలియదు. సివిటి, డిసిటి మరియు టార్క్ కన్వర్టర్స్ వంటివి ఉండటం ద్వారా గేర్లు చాలా స్మూత్‌గా మారిపోతాయి.

ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ గేర్‌బాక్స్

కానీ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో గేర్లను మార్చిన ప్రతిసారి వాహనం మొత్తం ఒకరకమైన కుదుపునకు గురవుతుంది. బస్సుల్లో ప్రయాణిస్తున్నపుడు గేర్లు మార్చే సమయంలో ఈ అనుభవాన్ని గమనించగలం. మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో కుదుపులు లేకుండా గేర్లను వేయాలంటే ఎంతో అనుభవం అవసరం.

మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వాహనాలు:

ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ గేర్‌బాక్స్

మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వాహనాల ధర తక్కువ

మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వాహనాల ధర తక్కువగా ఉంటుంది. వీటిని రిపేరి మరియు మెయింటెన్స్ చేయడం సులభం. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కార్లతో పోల్చితే రెగ్యులర్ ఆయిల్ మార్చడం అయ్యే ఖర్చు మ్యాన్యువల్ కార్లలో చాలా తక్కువ. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లో ఎక్కువ విఢిభాగాలు ఉంటాయి, దీనితో పోల్చితే మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అత్యంత ధృడమైనది.

ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ గేర్‌బాక్స్

అత్యుత్తమ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారి కోసం...

మ్యాన్యువల్ వాహనాలలో గేర్‌బాక్స్ మరియు క్లచ్ రెండూ ఒకదానికొకటి సంభందం లేకుండా విభిన్నంగా ఉంటాయి. గేర్‌మార్చాల్సిన ప్రతిసారీ డ్రైవర్ క్లచ్ పెడల్ ప్రెస్ చేయాల్సిందే. గేర్లను మార్చమే ప్రతిసారీ క్లచ్ ఆపరేట్ చేయడం ద్వారా డ్రైవర్లు ఒకవిధమైన డ్రైవింగ్ అనుభూతికి లోనవుతారు. ఇలాంటి వారు అధికంగా మ్యాన్యువల్ వాహనాలను నడపడానికి ఇష్టపడతారు. ఆటోమేటిక్ కార్లలో అలా అనుభూతి కలగడం దాదాపు అసాధ్యం.

ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ గేర్‌బాక్స్

చౌకబారు ధరలో వెహికల్ ఎంచుకునే వారికి...

ఆటోమేటిక్ వాహనాలతో పోల్చితే మ్యాన్యువల్ వాహనాల ధరలు తక్కువగానే ఉంటాయి మరియు నిర్వహణ కూడా తక్కువే. బడ్జెట్ ధరలో కారును ఎంచుకోవాలనుకునే వారికి మ్యాన్యువల్ కార్లు ఎంతో ఉత్తమమైనవి.

ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ గేర్‌బాక్స్

ఉత్తమ మైలేజ్

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల కార్లలో మ్యాన్యువల్‌తో పోల్చితే ఎక్కువ విడిభాగాలు కదలికలో ఉంటాయి, దీని ద్వారా పవర్ లాస్ అధికంగా ఉంటుంది. దీంతో చక్రాలకు చేరవలసిన పవర్‌లో కొంత మేర గేర్‌బాక్స్ వద్దే నష్టమవుతుంది. మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌లో తక్కువ విడిపరికరాలు ఉండటంతో పవర్ మొత్తం సంపూర్ణంగా చక్రాలకు చేరుతుంది. కాబట్టి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వాహనాలతో పోల్చుకుంటే మ్యాన్యువల్ వాహనాల మైలేజ్ అధికం.

ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ గేర్‌బాక్స్

రిపేరి చాలా సులభం

ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు చాలా క్లిష్టంగా ఉంటాయి. గేర్లు దానంతటం అదే మార్చుకోవాల్సి ఉంటుంది. అందుకోసం మైక్రో చిప్స్, హైడ్రాలిక్ వ్యవస్థలు మరియు సెన్సార్లను అధిక సంఖ్యలో వినియోగిస్తారు. కాబట్టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రిపేరి చేయడం చాలా మంది మెకానిక్‌లకు కష్టం.

ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ గేర్‌బాక్స్

మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ వ్యవస్థ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఎన్నో ఏళ్ల నుండి మ్యాన్యువల్ వెహికల్స్ అందుబాటులో ఉండటం ద్వారా దాదాపు ప్రతి మెకానిక్ కూడా మ్యాన్యువల్ గేర్‌బాక్స్ గురించి కనీస పరిజ్ఞానం ఉంది. దీంతో మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ల రిపేరి చాలా సులభంగా, వేగంగా ఉంటుంది.

ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ గేర్‌బాక్స్

మా ఈ కథనంపై మీ వ్యాఖ్యలు క్రింది కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి. ఆటోమొబైల్స్‌కు చెందిన మరిన్ని కొత్త వాహనాల విడుదల, చిట్కాలు, రివ్యూలు కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి. అన్ని నగరాలలో మీకు నచ్చిన కార్ల ధరలు మరియు ఇంధన ధరలు తెలుసుకోండి

Most Read Articles

English summary
Read In Telugu: Automatic vs Manual Gearbox Which Works Better
Story first published: Thursday, August 17, 2017, 15:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X