పిల్లల్నీ కారు ఫ్రంట్‌ సీట్లలో కూర్చోబెట్టవద్దు.. కేరళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రెండేళ్ల పాప!

కొద్ది రోజుల క్రితం కేరళలోని మలప్పురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ట్రక్కుని ఢీ కొట్టడంతో తల్లి ఒడిలో కూర్చున్న రెండేళ్ల చిన్నారి అక్కడికక్కడే మరణించింది. కొట్టకల్‌-పడపరంబు రోడ్డులో జరిగిన ఈ ప్రమాదంలో చిన్నారి మరణానికి కారణం ఎయిర్‌బ్యాగ్‌ అని తేలింది. ప్రమాద సమయంలో చిన్నారి ముఖం చుట్టూ ఎయిర్‌బ్యాగ్‌ చుట్టుకోవడం వల్ల ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయింది. పిల్లలను బైక్స్‌పై ముఖ్యంగా కార్లపై తీసుకెళ్లేటప్పుడు కొన్ని సేఫ్టీ విషయాలను పాటించాలి. కేరళ మోటార్‌ వెహికిల్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ ప్రమాదాన్ని సీరియస్‌గా తీసుకుంది. రానున్న రోజుల్లో పిల్లల్నీ ముందు సీట్లలో కూర్చోబెడితే భారీ జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

కార్లలో సేఫ్టీ కోసం ఎయిర్‌బ్యాగ్స్‌, సీట్ బెల్ట్స్‌ అనేవి కేవలం పెద్దలకు మాత్రమే సేఫ్టీని అందిస్తాయని గుర్తుంచుకోవాలి. రోడ్డు ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగ్, సీట్ బెల్ట్స్ వాడకం చాలా కీలకంగా ఉంటాయి. కావున సీట్‌ బెల్ట్‌ని కచ్చితంగా ధరించాలి. అలాగే డ్రైవింగ్‌ చేసేటప్పుడు సినిమాలు చూడటం, కారు నడిపే వారి ఏక్రగతను దెబ్బతీయడం వంటివి చేయవద్దు.

Babies under 4 years Sitting Car Front Seats Unsafe

ముఖ్యంగా ముందు సీట్లలో పిల్లలతో కూర్చోవడం చేయవద్దు. దీనివల్ల కారు ఢీకొన్నప్పుడు ఎయిర్‌బ్యాగ్‌ వేగం (దాదాపు 900 కిలోల) పవర్‌తో రెప్పపాటుతో బయటకు వస్తాయి. ఈ ఆకస్మిక పరిస్థితిని పిల్లలు తట్టుకోలేరు. ఇది వారికి ప్రాణాంతకం కూడా కావచ్చు. అందువల్ల 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలురు, బాలికలను కారు ముందు సీటులో కూర్చోబెట్టకూడదు.

ఏ కారులోనైనా వెనుక సీట్ల వరుస అత్యంత సురక్షితమైనది. వెనుక సీట్లలో 8 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సీటు బెల్టులు సరిగ్గా సరిపోవు. కొంతమంది అబ్బాయిలు మరియు అమ్మాయిలు 12 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కూడా బెల్ట్స్‌ కంఫర్ట్‌గా ఉండవు. కాబట్టి అలాంటి పిల్లలను స్పెషల్ చైల్డ్ సీట్లలో కూర్చోబెట్టడం మంచిది. కారు మోడల్, సీట్ సైజును బట్టి బేబీ సీట్లు మార్కెట్‌లో దొరుకుతాయి.

Babies under 4 years Sitting Car Front Seats Unsafe

మీరు కారుని కొనుగోలు చేసే సమయంలోనూ వీటిని అమర్చవచ్చు. అవసరం లేనప్పుడు వాటిని తొలగించడం కూడా సులభం. ముందు సీట్లలోనూ బేబీ సీట్‌ బెల్టింగ్‌ని సెట్‌ చేస్తారు. అది ప్రమాదానికి దారి తీస్తుంది. పిల్లలు కూర్చోవడానికి వెనుక వరుస సీట్లను మాత్రమే ఉపయోగించండి. బేబీ సీట్‌లో బిడ్డను ఉంచిన తర్వాత వారికి సీట్ బెల్ట్ సరిగ్గా సరిపోతుంది. కొంతమంది బిడ్డను ఒడిలో పెట్టుకుని సీట్ బెల్ట్ ధరిస్తారు.

అలా చేయడం కూడా ప్రమాదం జరిగితే ప్రాణాంతకం కావచ్చు. కొందరు ఇద్దరు పిల్లలను ఒకే సీటులో కూర్చోబెట్టి సీటు బెల్టలను బిగిస్తారు. ఇక మరికొందరు అత్యూత్సాహంతో పిల్లలను ఒడిలో పెట్టుకుని కారు నడపుతుంటారు. కావున ఇకపై ఇలాంటి చేయడం మానుకోవాలి. పిల్లల్నీ వెనక కూర్చోబెట్టడం ఉత్తమం. కాబట్టి దయచేసి అలాంటివి అనుసరించవద్దు.

Babies under 4 years Sitting Car Front Seats Unsafe

ఇక ద్విచక్ర వాహన రైడింగ్ విషయానికొస్తే నాలుగేళ్లు పైబడిన పిల్లలు బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. 4 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలను ప్రయాణీకులుగా పరిగణిస్తారు. కాబట్టి 4 ఏళ్లు పైబడిన పిల్లలతో పాటు ద్విచక్రవాహనంపై మరో ప్రయాణికుడిని తీసుకెళ్లేటప్పుడు హెల్మెట్‌ కచ్చితంగా ధరించాలి. టూవీలర్‌పై కేవలం 2 ప్రయాణీకులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఎక్కువ మంది ప్రయాణించడం ప్రమాదాలకు దారి తీయవచ్చు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, October 7, 2024, 19:05 [IST]
English summary
Babies under 4 years sitting on car front seats unsafe check safety precautions
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+