లైవ్‌లో ఆర్టీసీ డ్రైవర్‌కి హార్ట్‌ ఎటాక్.. భయపెడుతున్న వీడియో, సున్నితమైన వారు ఈ వీడియో చూడకండి!

ఇటీవలే కొందరు డ్రైవరన్నలు గుండెపోటుకు గురవతుండటంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్లు, మారిన జీవనశైలితో ఎప్పుడు గుండెపోటు వస్తుందో ఊహించలేక పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మన దేశంలో యువత ఎక్కువగా హార్ట్ ఎటాక్‌కి గురవుతున్నారు. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా మంది హార్ట్ ఎటాక్‌తో క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటనల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తద్వారా భారీ ప్రాణనష్టం జరుగుతోంది. తాజాగా బెంగళూరులో డ్రైవింగ్ చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్‌కి గుండెపోటు వచ్చింది. దీనికి సంబంధించిన వార్త వైరల్‌ అవుతోంది.

బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్ (BMTC)లో 40 ఏళ్లున కిరణ్‌ అనే వ్యక్తి బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. బెంగళూరు టౌన్‌లోని నీలమంగళ-దసనపుర రూట్‌లో బస్సు నడుపుతున్నాడు. రోజువారి విధుల్లో భాగంగా మొన్న (నవంబర్ 6) యథావిధిగా విధులకు హాజరయ్యారు. డ్రైవింగ్‌ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో స్పృహ కోల్పోయి ఓ పక్కకు పడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Bangalore RTC Driver Heart Attack Video

సెడన్‌గా హార్ట్ఎటాక్‌ దీంతో అతను డ్రైవ్‌ చేస్తున్న బైక్‌ ముందు ప్రయాణిస్తున్న మరో బస్సును ఢీకొట్టింది. ఈ సమయంలో బస్సు కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి డ్రైవర్‌ని తప్పించి భారీ ప్రమాదాన్ని నిలువరించాడు. సీటులోకి ఎక్కి వెంటనే బ్రేకులు వేసి బస్సును ఆపడంతో ఘోర ప్రమాదం నుంచి ప్రయాణికులు బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్‌ బస్సులో ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డు అయ్యాయి.

అయితే ఈ ఘటనలో దురదృష్టవశాత్తు హార్ట్‌ఎటాక్‌కి గురైన బస్సు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవర్‌ మృతికి BMTC సంతాపం తెలిపింది. ఈ ఘటనలో చాకచక్యంగా వ్యవహరించిన బస్ కండక్టర్‌ ఓబులేషన్‌ని అభినందిస్తున్నారు. సకాలంలో బస్సును ఆపకపోతే ఘోర ప్రమాదం జరిగేదని అతని చర్యతో అదృష్టవశాత్తూ ప్రయాణికులు అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ షాక్‌కి గురవుతున్నారు.

Bangalore RTC Driver Heart Attack Viral News

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: రోజు మాదిరిగానే డ్యూటీలో ఉన్న డ్రైవర్ గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి సంఘటలను దేశంలో తరచుగా జరుగుతున్నాయి. బస్సులు, ట్రక్కుల డ్రైవర్లకు ఎక్కువగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారు ఎక్కువ సేపు చాలా కిలోమీటర్లు ఒకే చోట కూర్చుని డ్రైవ్‌ చేయాల్సి ఉంటుంది. ఇదే కాకుండా అధిక శ్రమ, ఒత్తిడి కారణంగా అది గుండెపోటుకు దారీ తీసే అవకాశం ఉంటుంది.

కావున మోటార్‌ ఫీల్డ్‌లో ఉండేటప్పుడు కచ్చితంగా సమయ పాలన పాటించడం ఉత్తమం. ఒత్తిడితో డ్రైవింగ్‌ చేయడం రోడ్డు ప్రమాదాలు జరగడంతో పాటు అది దీర్ఘకాలంలో ప్రభావం చూపే ఆస్కారం ఉంటుంది. ఈ ఫీల్డ్‌లో ఉండేవారి ఆహారపు అలవాట్లు అందరి కంటే భిన్నంగా ఉంటాయి. దీనివల్ల అధిక రక్తపోటుతో పాటు, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్ వంటివి పెరుగుతాయి. ఇవి గుండెపోటు దారితీసే అవకాశం ఉంటుంది.

అందువల్ల డ్రైవరన్నలు పనితో పాటు వారి శారీరక, మానసిక స్థితిని అంచనా వేసుకోడవం చాలా ముఖ్యం. ఎందుకంటే గుండెపోటుని ముందుగానే గుర్తించడం కష్టం. కావున ఈ ఫీల్డ్‌లో ఉండేవారు అకస్మాత్తుగా అధిక చెమట, మైకం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, ఊహించని విధంగా అలసట, ఛాతీలో నొప్పి అనిపిస్తే అది మీకు గుండెపోటు రాబోతుందని సంకేతాలుగా భావించాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే రోడ్డు పక్కనే వాహనాన్ని ఆపేయాలి.

వాహనాన్ని సురక్షితంగా పార్క్‌ చేసిన తర్వాత ముందు కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇది మీకు కాస్త ప్రశాంతతను ఇస్తుంది. వీలైతే బట్టలు విప్పేసి బాడీని రిలాక్స్‌గా ఉండేలా చూసుకోండి. వెంటనే వైద్య సహాయం కోసం మీరు ఫోన్‌ ద్వారా ఎమర్జెన్సీ నంబర్‌కి కాల్‌ చేయండి. ఒకవేళ మీ దగ్గర్లో ఎవరైనా ఉంటే మీ పరిస్థితిని వారికి వివరించండి. వీలైనంత వరకు అలసత్వం వహించకుండా తెలివిగా వ్యవహరించడం చాలా ముఖ్యం.

More from DriveSpark

Article Published On: Friday, November 8, 2024, 7:20 [IST]
English summary
Bangalore rtc driver heart attack while driving useful tips for drivers at this situation
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+