వీలీ చేసేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే ఇలాగే జరుగుతుంది

బైక్‌పై వీలీ (ఒక్క టైరుపై బైక్ నడపటం) చేయడమంటే కొందరికి (మరీ ముఖ్యంగా ఉడుకు రక్తం ఉరకలేసే కుర్రకారుకి) భలే సరదా. మరికొందికి ఇదొక రకం జీవనాధారం. ఏదేమైనప్పటికీ ఇది అత్యంత ప్రమాదంతో కూడుకున్న స్టంట్. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. వీలీ చేసేటప్పుడు చుట్టు పక్కల పరిసరాలను ముందుగా అంచనా వేసుకుని, ఇటు మీకు అటు సాధారణ ప్రజానీకానికి పూర్తిగా సురక్షితం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వీలీని చేయాలి.

అలాకాకుండా.. సరైన శిక్షణ లేకుండా, ఒక చేతిలో క్లచ్ మరొక చేతిలో యాక్సిలేటర్ ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్లు వీలీ చేస్తే ఇదిగో ఇలా ఫోటోలో చూపినట్లు ముందుకు బొక్కబోర్లా పడి మూతిపళ్లు రాలగోట్టుకోవటం. కాబట్టి సోదరులారా... వీలీ చేయటం మానుకోండి. లేదు వీలీ చేసి తీరాల్సిందేనని మీరు నిర్ణయించుకుంటే కనీసం క్రింద తెలిపిన జాగ్రత్తలైనా పాటించండి. వీలీ చేయటానికి ముందు మిమ్మల్ని ఇష్టపడే వారి గురించి, మీపై ఆధారపడిన వారి గురించి మరొక్కసారి ఆలోచించుకోండి..!!

బైక్‌పై ఎలాంటి స్టంట్‌లు చేయడానికైనా ముందు ఈ వస్తువులు మీతో ఎల్లప్పుడూ ఉండాలి.

1. హెల్మెట్: పూర్తి ముఖాన్ని కవర్ చేసే విధంగా ధృఢమైన, నాణ్యమైన హెల్మెట్‌ను ధరించాలి. హెల్మెట్ బెల్ట్/స్ట్రాప్ పెట్టుకోవటం మర్చిపోకండి.

2. గ్లౌజ్‌లు: గ్లౌజ్‌లు బైక్ హ్యండ్లింగ్‌కు మంచి గ్రిప్‌ను అందించడమే కాకుండా.. ప్రమాదవశాత్తు క్రింద పడినా చేతులకు గాయాలకు కాకుండా రక్షిస్తుంది.

3. రైడింగ్ జాకెట్: ఛాతీ భాగం, మోచేతులను కవర్ చేసే విధంగా మన్నికగల రైడింగ్ జాకెట్లను ధరించి మాత్రమే స్టంట్‌లు చేయాలి.

4. బూట్లు: స్టంట్స్ చేసేటప్పుడు స్టీలో టోస్ (ముందువై ఉక్కు కలిగిన బూట్లు) ఉండే బూట్లను ధరించటం చాలా మంచిది. అత్యవసర సమయాల్లో ఇవి చక్కగా ఉపయోగపడుతాయి.

5. రైడింగ్ ప్యాంట్స్: క్నీ గార్డ్ (మోకాళ్లను రక్షించే కవచం) కలిగి ఉండే రైడింగ్ ప్యాంట్లను ధరించాలి. ప్రమాదాల వల్ల ఏర్పడే చిన్నపాటి గాయాల నుండి ఇది రక్షిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, March 2, 2012, 12:00 [IST]
English summary
Before trying out that Wheelie make sure that you have all your riding gear in order. The must haves for any stunter are Helmet, Gloves, Riding Jacket with kevlar protectors, Boots, Riding Pants.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+