మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీకి తప్పనిసరిగా ఉండాల్సిన యాడ్-ఆన్స్

By Ravi

వాహనంలో వెళ్తున్నప్పుడు అందరం సురక్షితంగా వెళ్లాలనే ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తాం. అయితే, కొన్ని అనివార్య సందర్భాల్లో ప్రమాదం అనేది ఎప్పుడు ఎలా సంభవిస్తుందో ఎవ్వరం కూడా ఊహించలేము. మనం జాగ్రత్తగా ఉన్నప్పటికీ, పక్కవారి నిర్లక్ష్యం వల్లనో లేక వారి టైమ్ బాగోలేకనో జరిగే ప్రమాదాలకు మనం కూడా నష్టపోవాల్సి వస్తుంటుంది.

ఇలాంటి ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో మరమ్మతు ఖర్చులు తలకు మించిన భారంగా మారుతుంటాయి. అయితే, ఈ ఇబ్బందికర పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు ఓ చక్కటి మార్గం ఉంది. వాహన బీమా యాడ్-ఆన్ కవరేజ్ పాలసీలు.

వాస్తవానికి, కారు కొనుగోలు చేసిన తర్వాత చట్టప్రకారం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇందులో కవరేజ్ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ ఒక్క పాలసీ అన్ని రకాల బీమా రక్షణను అందించలేదు. అందుకే ఇప్పుడు బీమా కంపెనీలు ‘యాడ్-ఆన్' పేరుతో వివిధ రైడర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ప్రధాన పాలసీకి మరికొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా వీటిని పొందవచ్చు. మరి ఈ యాడ్-ఆన్ కవరేజ్ పాలసీల వివరాలు, వీటి వలన కలిగే ప్రయోజనాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

ఇంజన్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్ కవరేజ్

ఇంజన్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్ కవరేజ్

ఇది చాలా మంచి యాడ్-ఆన్ ప్యాకేజ్. వర్షాకాలంలో మీ కారు ఇంజన్‌లోకి నీరు చేరి పాడైపోతే దాని రిపేరుకుకు అయ్యే ఖర్చును కంపెనీ భరిస్తుంది. వర్షాకాలంలో నీటి ప్రవాహం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఉండే వారికి ఈ కవరేజ్ చక్కగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి లోతట్టు ప్రాంతాల్లో భారీ వరదలు ఇళ్ల పక్కన పార్కింగ్ చేసిన కార్లను కూడా ముంచెత్తుతాయి. అలాగే రోడ్డుపై వెళ్తున్నప్పుడు వాహనం నీటిలో ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది.

ఇంజన్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్ కవరేజ్

ఇంజన్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్ కవరేజ్

కారులో నీటిలో ఉన్నప్పుడు స్టార్ట్ చేయటానికి పదే పదే ప్రయత్నించినట్లయితే, వల్ల ఇంజన్‌లోని కొన్ని విడిభాగాలు దెబ్బ తింటాయి. ఒక్కోసారి మొత్తం ఎలక్ట్రిక్ సర్క్యూట్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితిని హైడ్రోస్టాటిక్ లాక్ అని అంటారు. ఇలాంటప్పుడు ఇంజన్ రిపేరుకు అయ్యే ఖర్చు భారీగానే ఉంటుంది. సాధారణ వాహన బీమా ఇలాంటి విపత్తుకు కవరేజ్ కల్పించదు. ఇంజన్, ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్ కవరేజ్ తీసుకున్నట్లయితే ఈ నష్టాలన్నింటికీ పరిహారం లభిస్తుంది.

జీరో డిప్రిసియేషన్

జీరో డిప్రిసియేషన్

సాధారణంగా బీమా కంపెనీలు ప్రతి వాహనంపై ప్రతి ఏటా కొంత విలువను తగ్గిస్తూ ఉంటాయి. ఇలా ఏళ్ళు గడిచే కొద్ది వాహనం ఖరీదుకన్నా తక్కువ మొత్తానికి మాత్రమే కవరేజ్ లభిస్తుంది. అయితే, జీరో డిప్రిసియేషన్ యాడ్ ఆన్ కవరేజ్‌ను తీసుకున్నట్లయితే ఆ తగ్గింపు లేకుండా నష్టానికి పూర్తిగా పరిహారం లభిస్తుంది. ఏదైనా ప్రమాదంలో నష్టపోయిన వాహన విడిభాగాల మరమ్మత్తు/మార్పుకు అయ్యే ఖర్చును పూర్తిగా బీమా కంపెనీయే చెల్లిస్తుంది.

జీరో డిప్రిసియేషన్ ఎప్పుడు తీసుకోవాలి

జీరో డిప్రిసియేషన్ ఎప్పుడు తీసుకోవాలి

వాస్తవానికి ఈ యాడ్ ఆన్‌ను కారు కొనుగోలు చేసిన మొదటి సంవత్సరంలోనే తీసుకోవడం మంచిదని బీమా రంగ నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు, ప్రమాదంలో కారు బంపర్ దెబ్బ తిందనుకుంటే, దాన్ని మార్చడానికి సుమారు రూ.15,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, సాధారణ బీమా పాలసీలో అందించే పరిహారం ఆ మొత్తంలో సగానికి మించదు. కానీ జీరో డిప్రిసియేషన్ కవరేజ్‌లో మాత్రం కొత్త బంపర్‌ను అమర్చడానికి అయ్యే మొత్తం ఖర్చును బీమా కంపెనీయే చెల్లిస్తుంది.

ఫోన్ ద్వారా సాంకేతిక సహాయం

ఫోన్ ద్వారా సాంకేతిక సహాయం

కార్లలో దూర ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంజన్‌లోని సాంకేతిక సమస్యల వల్ల వాహనం బ్రేక్ డౌన్ అయితే, ఈ యాడ్-ఆన్ చక్కగా సహకరిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలన్నదే నిపుణులు ఫోన్ ద్వారా సూచనలు అందించడం జరుగుతుంది.

క్విక్ అసిస్టెన్స్ ఆన్ రోడ్

క్విక్ అసిస్టెన్స్ ఆన్ రోడ్

ఏదైనా పట్టణం లేదా నగరానికి దూరంలో ప్రమాదం జరిగినా లేదా వాహనం ఆగిపోయినా అక్కడ నుంచి కారును సర్వీస్ సెంటర్‌కు తరలించడానికి (టోయింగ్ వెహికల్) అయ్యే ఖర్చు నుంచి తప్పించుకునేందుకు ఇది సహకరిస్తుంది. క్విక్ అసిస్టెన్స్ ఆన్ రోడ్ రైడర్ తీసుకుంటే కారును తరలించడం, టైర్, బ్యాటరీ, ఇంధనం వ్యయాలు, యజమాని ఇంటికి చేరేందుకు అయ్యే టాక్సీ ఖర్చులు, అక్కడే ఉండాల్సివస్తే లాడ్జి ఖర్చులు అన్నింటికీ కవరేజ్ లభిస్తుంది.

రిటర్న్ ఆన్ ఇన్వాయిస్

రిటర్న్ ఆన్ ఇన్వాయిస్

కొత్త కారును కొనుగోలు చేసిన మొదటి సంవత్సరంలో మాత్రమే ఈ కవరేజ్‌ను ఆఫర్ చేస్తారు. ఆ సంవత్సర కాలంలో కారు పూర్తిగా డ్యామేజ్ అయితే, బీమా కంపెనీ 100 శాతం మొత్తాన్ని ఎలాంటి డిప్రిసియేషన్ (తగ్గింపు) లేకుండా చెల్లించడం జరుగుతుంది.

ఎన్‌సిబి రిటెన్షన్

ఎన్‌సిబి రిటెన్షన్

ఏ బీమా పాలసీలో అయినా క్లెయిమ్ చేయకపోయినట్లతే, ప్రతి సంవత్సరం బోనస్ పాయింట్లు జమ అవుతూ వస్తాయి. ఈ విధంగా జమ అయిన వాటినే 'నో క్లెయిమ్ బోనస్'గా వ్యవహరిస్తారు. వీటి ఆధారంగా ఒకేసారి 50 శాతం వరకు కూడా డిస్కౌంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ గతంలో ఒక్క క్లెయిమ్ చేసినా సరే, ఈ బోనస్ లభించదు. దీనిని నివారించుకోవాలంటే ఎసిబి రిటెన్షన్ కవరేజ్ ఉపయోగపడుతుంది. ఈ ప్రయోజనం పొందితే ఎన్‌సిబి యథాతథంగా ఉంటుంది. ఎప్పుడైనా దాన్ని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

చివరిమాట

చివరిమాట

రెగ్యులర్ పాలసీకి యాడ్-ఆన్ పాలసీలు తీసుకోవటం చాలా ఉపయోగకరం. అయితే, ఇందుకు సాధారణంగా చెల్లించే బీమా ప్రీమియం కన్నా ఎన్నో రెట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. తాము నివసించే ప్రదేశం, వాతావరణం తదితర అంశాలను ఆధారంగా చేసుకొని, తమకు ఎలాంటి యాడ్-ఆన్ కవరేజ్ పాలసీ తీసుకుంటే ఎంత ప్రయోజనం ఉంటుందోనని సరిచూసుకొంటే, అత్యవసర సమయాల్లో మీ జేబు లోనుంచి పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా, డబ్బును ఆదా చేసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, October 28, 2013, 11:54 [IST]
English summary
To avoid the expensive repairs or replacement of the car in case of total damage, it is mandatory to have a comprehensive motor insurance policy which covers third party liability as well as damage to ones own vehicle. Car insurance companies offering a wide range of add-ons these days. Add-ons are options that improve the basic coverage offered by a policy. Here are some add-ons one must include in the policy.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+