భారత్‌లో లభిస్తున్న బెస్ట్ గ్రౌండ్ క్లియెరన్స్ కలిగిన కార్లు
కార్లను కొనుగోలు చేసేటప్పుకు కేవలం ఇంజన్, మైలేజ్, ధర వంటి కొన్ని అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే సరిపోదు. ఇలా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాల్లో గ్రౌండ్ క్లియరెన్స్ (Ground clearance) కూడా ఒకటి.
కార్లను కొనుగోలు చేసేటప్పుకు కేవలం ఇంజన్, మైలేజ్, ధర వంటి కొన్ని అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే సరిపోదు. ఇలా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాల్లో గ్రౌండ్ క్లియరెన్స్ (Ground clearance) కూడా ఒకటి. అసలు గ్రౌండ్ క్లియరెన్స్ అంటే ఏమిటి? దీని వలన కలిగే ప్రయోజనం ఏమిటి? మనదేశ మార్కెట్లో లభ్యమవుతున్న టాప్ 10 గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన కార్లు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!
గ్రౌండ్ క్లియరెన్స్ అంటే.. కారు క్రింది భాగానికి నేలకు మధ్య ఉండే దూరమే(ఖాలీయే) గ్రౌండ్ క్లియరెన్స్. ఈ గ్రౌండ్ క్లియరెన్స్‌ను మనం లెక్కించాల్సిన అవసరం లేదు. తయారీదారులే ఈ కొలతను ముందుగానే నిర్ధారిస్తారు. కారును కొనుగోలు చేసేటప్పుడు కంపెనీ వారు ఇచ్చే ఓనర్స్ మ్యాన్యువల్ లేదా బ్రోచర్‌లో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ వివరాలను తెలుసుకోవచ్చు. దీనిని మిల్లీ మీటర్లు (మి.మీ.) లేదా ఇంచ్ (")లలో లెక్కిస్తారు.
తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన కార్లు వేగంగా వెళ్తున్నప్పుడు సైతం మంచి హ్యాండ్లింగ్‌ను పెర్ఫామెన్స్‌ను కలిగి ఉంటాయి. (అందుకే సూపర్ కార్లన్నీ తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటాయి). అధిక గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన వాహనాలు ఎక్కువగా ఆఫ్ రోడ్ సామర్థ్యాలను కలిగి ఉంటాయి. రోడ్లు సరిగ్గా లేని ప్రాంతాల్లో ఇవి చక్కగా ఉపయోగపడుతాయి.
వాస్తవానికి మన భారతీయ రోడ్లకు ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన వాహనాలు ఎంతో అవసరం. ఎక్కడపడితే అక్కడ అర్థం లేని విధంగా ఎత్తుగా నిర్మించిన స్పీడ్ బ్రేకర్లు, గతుకుల రోడ్లపై అధిక గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన వాహనాలే పనికొస్తాయి. భారత్‌లో లభిస్తున్న టాప్ 10 హై గ్రౌండ్ క్లియరెన్స్, వీల్ బేస్ (చక్రాల మధ్య దూరం) కలిగిన కార్లను ఇప్పుడు పరిశీలిద్దాం రండి.

ఫియట్ పుంటో
గ్రౌండ్ క్లియరెన్స్: 150 మి.మీ.
వీల్ బేస్: 2510 మి.మీ.

మారుతి సుజుకి రిట్జ్
గ్రౌండ్ క్లియరెన్స్: 170 మి.మీ.
వీల్ బేస్: 2360 మి.మీ.

చెవర్లే సెయిల్ యువా
గ్రౌండ్ క్లియరెన్స్: 172 మి.మీ.
వీల్ బేస్: 2465 మి.మీ.

మారుతి సుజుకి స్విఫ్ట్
గ్రౌండ్ క్లియరెన్స్: 170 మి.మీ.
వీల్ బేస్: 2430 మి.మీ.

టొయోటా ఎతియోస్ లివా
గ్రౌండ్ క్లియరెన్స్: 170 మి.మీ.
వీల్ బేస్: 2460 మి.మీ.

ఫియట్ లీనియా
గ్రౌండ్ క్లియరెన్స్: 185 మి.మీ.
వీల్ బేస్: 2603 మి.మీ.

మారుతి సుజుకి ఎస్ఎక్స్4
గ్రౌండ్ క్లియరెన్స్: 180 మి.మీ.
వీల్ బేస్: 2500 మి.మీ.

టొయోటా ఎతియోస్
గ్రౌండ్ క్లియరెన్స్: 170 మి.మీ.
వీల్ బేస్: 2550 మి.మీ.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్
గ్రౌండ్ క్లియరెన్స్: 170 మి.మీ.
వీల్ బేస్: 2430 మి.మీ.


Click it and Unblock the Notifications








