సర్వీసింగ్ తర్వాత బైక్ మైలేజ్ తగ్గిందా? - చిట్కాలు
సాధారణంగా బైక్‌లను సర్వీసింగ్ చేయించిన తర్వాత మైలేజ్ పెరగాలి. కానీ కొన్ని సందర్భాల్లో ఇందుకు భిన్నంగా జరుగుతుంది. ప్రత్యేకించి కొత్త బైక్‌ల విషయంలో ఈ సమస్యను ఎక్కువగా గమనిస్తుంటాం. సర్వీసింగ్‌కు ముందు 60-65 కిలోమీటర్ల వరకు మైలేజీనిచ్చే బైక్ రెండు, మూడు సర్వీసింగ్‌ల తర్వాత 50-55 కిలోమీటర్లకు పడిపోతుటుంది.
మరి ఇలాంటి సందర్భాల్లో మైలేజ్ పెరగాలంటే ఏం చేయాలి? అసలు ఈ సమస్యకు కారణం ఏంటి?
వాస్తవానికి ఈ సమస్య ట్యూనింగ్‌కు సంబంధించినది. మీ డ్రైవింగ్ విధానంలో మార్పుల్లేకుండా ఉంటే, సర్వీసింగ్ తరువాత మైలేజీ తప్పకుండా పెరుగుతుంది. బైక్ ట్యూనింగ్ చేసేనప్పుడు మెయిన్‌జెట్, ఐడ్లింగ్‌లను ఒకటికి రెండు సార్లు సరిచూడాల్సిందిగా మెకానిక్‌కు, సర్వీస్ ఇంజనీర్‌కు చెప్పాలు. సరిగ్గా ట్యూన్ చేస్తే మైలేజ్ పెరుగుతుంది.
మైలేజ్ తగ్గడానికి కారణాలు:
మైలేజ్ తగ్గడానికి చాలానే కారణాలు ఉన్నాయి. బైక్ నడిపే తీరు, బైక్‌పై ప్రయాణించే వ్యక్తుల బరువు, రోడ్లు, గాలి వాటం, కార్బురేటర్ ట్యూనింగ్, ఎయిర్‌ఫిల్టర్, నాణ్యతలేని పెట్రోల్ వంటి అనేక అంశాలు మైలేజ్‌ను ప్రభావితం చేస్తాయి. బైక్ ట్యూనింగ్‌ని బట్టి కూడా మైలేజ్ ఆధారపడి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:



Click it and Unblock the Notifications








