మీ బైక్ మంచి మైలేజ్ ఇవ్వాలంటే చేయాల్సినవి మరియు చేయకూడనివి

By Anil

కొత్త బైకు కొనే ప్రతి భారతీయుడు డీలర్‌కు సందించే ప్రశ్న, ఈ బైక్ మైలేజ్ ఎంత ? నిజమే, ఇండియన్ టూ వీలర్ మార్కెట్లోకి ఇప్పటికీ మైలేజ్ ఆధారంగానే అధిక బైకులు అమ్ముడుపోతున్నాయి. కాబట్టి ప్రతి టూ వీలర్ తయారీ సంస్థకు మైలేజ్ అనే అంశం అతి ముఖ్యమైనది. విపణిలోకి విడుదలవుతున్న బైకుల్లో మైలేజ్‌కు అధిక ప్రాధ్యనతనిస్తూ వచ్చినవే అధికం.

బైక్ మైలేజ్ పెంచుకునేందుకు సింపుల్ టిప్స్

ఇవన్నీ తయారీదారుడి కష్టాలు.... బైకు కొన్న తరువాత దాని మైలేజ్ మన మీద ఆధారపడి ఉంటుంది. బైకు నడిపే తీరు, గేర్లు మార్చే టైమింగ్ మరియు ఇంజన్ పట్ల అవగాహన ఆధారంగా ఒక్కో బైకు ఒక్కో విధమైన మైలేజ్‌నిస్తుంది. మైలేజ్ పెంచుకునేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. డ్రైవ్‌స్పార్క్ తెలుగు నేడు పాఠకుల కోసం బైకు నడుపుతున్నపుడు అధిక మైలేజ్ కోసం చేయాల్సిన మరియు చేయకూడని పనులు గురించిన వివరాలు నేటి కథనంలో అందిస్తోంది.

అధిక మైలేజ్ కోసం ఇవి చేయండి...

Recommended Video - Watch Now!
Honda Cliq Review In Telugu - DriveSpark తెలుగు
బైక్ మైలేజ్ పెంచుకునేందుకు సింపుల్ టిప్స్

స్థిరమైన వేగంతో నడపడం

ఏవరైనా సరే స్థిరమైన వేగంతో నడపవచ్చు. ఇలా నడపడం ద్వారా ఇంజన్‌కు సమంగా ఇంధన అందుతుంది. తద్వారా ఫ్యూయల్ లాస్ జరగకుండా ప్రతి చుక్కలోకి వస్తుంది. దీంతో మైలేజ్ పెరుగుతుంది. స్పీడో మీటర్‌లోని స్పీడ్ ముల్లును లేదా ఆర్‌పిఎమ్ ముల్లును అనుసరిస్తూ నిర్ధిష్ట వేగాన్ని మెయింటెన్ చేయండి.

బైక్ మైలేజ్ పెంచుకునేందుకు సింపుల్ టిప్స్

టైర్ల నిర్వహణ

బైకు మైలేజ్ ఇంజన్ మీద ఆధారపడి ఉంటుంది గానీ, టైర్లకు సంభందం ఏమిటి అనే వారు చాలానే ఉన్నారు. కానీ టైర్ల గాలిని సరిగా నిపడం ద్వారా మైలేజ్ పెంచుకోవచ్చు. గాలిని అధికంగా నింపితే టైర్లు అరిగిపోవడం మరియు గాలి తక్కువగా నింపింతే బైక్ మైలేజ్ తగ్గిపోయి టైర్లు డ్యామేజ్ అవుతాయి. కాబట్టి బైక్ కంపెనీలు సూచించిన విధంగా గాలిని నింపండి.

బైక్ మైలేజ్ పెంచుకునేందుకు సింపుల్ టిప్స్

చైన్ టైట్ సరిగ్గా ఉందో లేదో చూడండి

చైన్ నిర్వహణ కూడా బైక్ మైలేజ్ మీద ప్రభావం చూపుతుంది. చైన్ అడ్జెస్ట్‌మెంట్ ద్వారా చైన్‌ను టైట్ లేదా లూజ్ చేసుకోవచ్చు. చైన్ చాలా వదులుగా ఉంటే, ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ లాస్ అవ్వడం జరుగుతుంది.

బైక్ మైలేజ్ పెంచుకునేందుకు సింపుల్ టిప్స్

క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించడం

సమయాభావం వలన చాలా మంది సర్వీసింగ్ చేయించాల్సి వచ్చినా వాయిదా వేస్తుంటారు. సర్వీసింగ్ చేయించకపోయినా బండి నడుస్తుందిలే అనే ధీమా. అయితే క్రమం తప్పకుండా సమయానికి సర్వీసింగ్ చేయడంతోనే మంచి మైలేజ్ సాధ్యమవుతుందని గుర్తుంచుకోండి.

చేయకూడనివి....

బైక్ మైలేజ్ పెంచుకునేందుకు సింపుల్ టిప్స్

రైడింగ్‌లో క్లచ్ లీవర్ ప్రెస్ చేసి ఉండటం...

బైకు డ్రైవ్ చేస్తున్నపుడు క్లచ్ ప్రెస్ చేసి ఉంచకండి. దీంతో కొన్ని ఇంజన్ నుండి వచ్చే పవర్ చక్రాలకు పూర్తిగా అందకుండా క్లచ్ వద్దే వృధా అవుతుంది. గేర్ మార్చాల్సివచ్చినపుడు మరియు సిటి రైడింగ్‌లో తప్పనిసరి అయితేనే క్లచ్ వినియోగించండి.

బైక్ మైలేజ్ పెంచుకునేందుకు సింపుల్ టిప్స్

తక్కువ గేర్‌లో ఎక్కువ దూరం డ్రైవ్ చేయడం

తక్కువ గేర్‌లో ఉన్నపుడు పెట్రోల్ అధికంగా ఖర్చవుతుంది. ఎక్కువ గేర్‌లో ఉన్నపుడు పెట్రోల్ వినియోగం తక్కువగా ఉంటుంది. కాబట్టి తొలి రెండు గేర్లలో బైకును ఎక్కువ దూరం పాటు నడపడాన్ని మానుకోండి. ఇందుకోసం మొదటి మూడు గేర్లు త్వరత్వరగా మార్చేసిన తరువాత టాప్ గేర్‌లోకి వెళ్లి నిర్ధిష్ట వేగాన్ని అనుసరించండి.

బైక్ మైలేజ్ పెంచుకునేందుకు సింపుల్ టిప్స్

ఎండలో బైక్ పార్క్ చేయడం

వేసవి కాలంలో ఎండలో బైక్ పార్క్ చేయడం ద్వారా పెట్రోల్ ఆవిరైపోతుంది. దీంతో ట్యాంకులో నింపిన పెట్రోల్‌కు తగ్గ మైలేజ్ రావడం కష్టమవుతుంది. కాబట్టి సెల్లార్లు మరియు నీడపాటున పార్క్ చేయండి.

బైక్ లేదా కారు పార్కింగ్ కోసం చెట్టు నీడ ఎంతైనా అవసరం, కాబట్టి ఓ చెట్టును నాటి దాని సంరక్షణ బాధ్యతలు తీసుకుని, ఆ చెట్టును పెంచి పెద్ద చేయండి.

బైక్ మైలేజ్ పెంచుకునేందుకు సింపుల్ టిప్స్

పదే పదే బ్రేక్ పెడల్ ప్రెస్ చేయడం

టాప్ గేర్‌లో ఉన్నపుడు కూడా చాలా మంది బ్రేక్ పెడల్‌ను ప్రెస్ చేసి ఉంచి నడుపుతూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా బైక్ వేగం తగ్గిపోవడం కాకుండా, ఇంజన్ పవర్ వృధా అవుతుంది. దీంతో మైలేజ్ తగ్గిపోతుంది.

బైక్ మైలేజ్ పెంచుకునేందుకు సింపుల్ టిప్స్

అనవసరపు యాక్సిలరేషన్(రైస్)

సిటీ రైడింగ్ చేస్తున్నపుడు ఇంజన్ ఐడ్లింగ్‌లో ఉన్నపుడు కూడా అనవసరంగా యాక్సిలరేట్ చేస్తుంటారు. ఇలా చేయడం మానేస్తే, ఆ పెట్రోల్‌తో కనీసం కొన్ని కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. సిగ్నల్స్ వద్ద 30 సెకండ్ల కన్నా ఎక్కువసేపు వేచి ఉండావల్సి వస్తే ఇంజన్ ఆఫ్ చేయడం ఎంతో ఉత్తమం.

బైక్ మైలేజ్ పెంచుకునేందుకు సింపుల్ టిప్స్

ఎయిర్ ఫిల్టర్‌ను మూసేయకండి

ఇంజన్‌లోకి పెట్రోల్ మరియు గాలి మిశ్రమం కార్బోరేటర్ ద్వారా నిరంతరం వెళుతూ ఉంటుంది. పరిశుభ్రమైన గాలి ఉంటేనే బైకు మంచి మైలేజ్ ఇస్తుంది. ఇందుకోసం ప్రతి బైకులో ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్ ఉన్న ప్రదేశాన్ని మూసేవేయకండి మరియు దుమ్ముతో నిండి ఉన్న ఎయిర్ ఫిల్టర్‌ను క్లీన్ చేస్తూ ఉండండి.

బైక్ మైలేజ్ పెంచుకునేందుకు సింపుల్ టిప్స్

ఇంజన్ మీదకు గాలి ప్రసరణను అడ్డుకుంటున్నారా...?

ఇంజన్‌లో పెట్రోల్ నిరంతరం మండుతూ ఉండటం ద్వారా ఇంజన్ అధిక వేడిని కలిగి ఉంటుంది. ఈ వేడిని తగ్గించడానికి బైకుల తయారీ సంస్థలు ప్రత్యేకంగా గాలి ఇంజన్ మీదకు వీచే విధంగా బైకును డిజైన్ చేస్తారు. అయితే చాలా మంది బైక్ ప్రేమికులు తమ బైకులకు మోడిఫికేషన్స్ చేయించుకునే క్రమంలో ఇంజన్ మొత్తాన్ని కప్పేస్తారు. దీంతో ఇంజన్ వేడి అధికమయ్యి ఆశించిన మైలేజ్ రాదు.

బైక్ మైలేజ్ పెంచుకునేందుకు సింపుల్ టిప్స్

ఇంధన సామర్థ్యపు పరీక్ష (మైలేజ్ టెస్ట్)

కొన్ని గుర్తింపు పొందిన మెకానిక్ సెంటర్లు ఇంజన్‌కు మైలేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్టులో బైకు మైలేజ్ వివరాలు మరియు మైలేజ్ రాకపోవడానికి గల కారణాలు తెలుసుకోవచ్చు. వాటికి అనుగుణంగా ఇంజన్ ట్యూనింగ్ చేయడంతో అధిక మైలేజ్ పొందవచ్చు.

(గమనిక: కొత్త బైకు కొన్న వారు మైలేజ్ గురించిన సలహాలు మరియు సూచనల కోసం డీలర్‌ను సంప్రదించగలరు.)

Most Read Articles

English summary
Read In Telugu: Tips To Increase Bike Mileage
Story first published: Wednesday, August 30, 2017, 13:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X