రోజు ఉదయాన్నే బైక్ స్టార్ చేసే ముందు 99% మంది ఈ తప్పులు చేస్తారు.. ఆ పది సెకండ్లు మీకు చాలా కీలకం!
చాలా మంది బైక్ లేదా స్కూటర్ డ్రైవింగ్‌లో మంచి స్కిల్‌ని కలిగి ఉంటారు. ఎక్కువ మంది రైడర్స్‌కి బైక్ లేదా స్కూటర్‌లకు సంబంధించిన అన్ని డ్రైవింగ్ మెథడ్స్ తెలిసినప్పటికీ.. చాలా మంది కొన్ని విషయాలపై అవగాహన ఉండదు. ఎందుకంటే బైక్‌లలో చాలా మెకానికల్ విడిభాగాలు ఉంటాయి. అవి మంచి కండిషన్‌లో ఉన్నప్పుడు మాత్రమే వాహనం మంచిగా ఫర్‌ఫార్మ్ చేస్తుంది. అయితే మనలో చాలా మంది డ్రైవర్లు చేసే సాధారణ తప్పు ఉదయాన్నే బైక్ స్టార్ట్ చేసిన వెంటనే గేర్ ఆన్ చేయడం. ఇలా చేయడం వల్ల ఇంజిన్, క్లచ్ ప్లేట్ లైఫ్‌స్టైల్ త్వరగా తగ్గిపోతుంది. వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.
చాలా మంది డ్రైవర్లు ఉదయం బైక్ స్టార్ట్ చేయగానే క్షణాల్లో గేర్లు వేస్తుంటారు. ఇది మీకు సాధారణమైనదిగా అనిపించినప్పటికీ లాగ్ టర్మ్‌లో ఇంజిన్ లైఫ్‌స్టైల్‌ని భారీగా ప్రభావితం చేస్తుంది. బైక్‌లను స్టార్ట్ చేసిన వెంటనే గేర్లను మార్చడం వల్ల ఇంజిన్ దెబ్బతింటుంది. దీని నష్టం వెంటనే కనిపించకపోవచ్చు, కానీ కాలక్రమేణా, సమస్యలు తలెత్తడం ప్రారంభిస్తాయి.

కాబట్టి మీరు బైక్‌ని ఆన్ చేసిన తర్వాత కొన్ని సెకన్ల పాటు ఇంజిన్‌ని స్థిరంగా ఉంచాలి. అలా అని మీరు 2-3 నిమిషాలు వేచి ఉండాల్సిన అవసరం లేదు. 10 సెకన్ల పాటు రేసింగ్ లేదా ఇంజిన్ సప్లై చైన్ కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడున్న బీఎస్-6 బైక్స్ ఆటోమేటిక్‌గా ఇంజిన్ 10 సెకన్స్ పాటు ఇంజిన్ మండుతుంది. దీనివల్ల ఇంజిన్‌తో పాటు ఇతర పార్ట్స్ యాక్టివేట్ అవుతాయి.
మీరు రైడింగ్‌ని ఆరంభించే ముందు కాసేపు అలానే ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బైక్‌ని చాలాసేపు ఒకేచోట నిలిపి ఉంచడం వల్ల ఇంజిన్‌లోని ఆయిల్ ఇంజిన్ లోపల ఒకే ప్రదేశంలో స్థిరపడుతుంది. ఇది బైక్ స్పార్క్‌ని తగ్గిస్తుంది. మీరు వెంటనే స్టార్ట్ చేసి డ్రైవ్ చేయడం వల్ల పార్ట్స్ త్వరగా అరిగిపోతాయి. అలాగే బైక్‌ని ఎక్కువ సేపు ఆఫ్‌లో ఉంచడం వల్ల ఇంజిన్ భాగాల మధ్య లూబ్రికేషన్ పెరుగుతుంది.

చల్లని వాతావరణంలో ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. తక్కువ ఉష్ణోగ్రత వల్ల ఇంజిన్ ఆయిల్ చిక్కగా మారుతుంది. ప్రారంభించిన తరువాత బైక్‌ని వెచ్చగా ఉంచడం సరైన స్పార్క్‌ని నిర్వహించడానికి సహాయపడుతుంది. కావున మీరు మీ మోటార్ సైకిల్‌ని ఆన్ చేసిన వెంటనే 10 సెకన్లు వేచి ఉండండి. అలాగే కాసేపు 20-30 కిలోమీటర్ల వేగంతో మాత్రమే డ్రైవ్ చేయండి, ఆపై క్రమంగా వేగాన్ని పెంచండి.
ఈ చిన్నపాటు టిప్స్‌ని అనుసరించడం మీ బైక్ యొక్క పనితీరును మెరుగుపరచడానికి, దాని లైఫ్‌స్టైల్‌ని గణనీయంగా పొడిగించడానికి సహాయపడుతుంది. వెంటనే గేర్ మార్చడం వల్ల ఇతర విడిభాగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇంజిన్ ఎక్కువ కాలం స్టాండర్డ్‌గా పనిచేసేందుకు ఈ పద్ధతులను అవసంబించాలని ఆటోమొబైల్ నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ దీర్ఘకాలిక సమస్యలను నివారించడమే కాకుండా.. మీ ప్రయాణాన్ని సజావుగా సాగేలా చేస్తుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








