ఎక్స్‌టెండెడ్ వారంటీని కొనుక్కుంటే రిపేర్లపై డబ్బు ఆదా!

కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు, సదరు కారుపై తయారీదారులు కేవలం పరిమితంగానే వారంటీని అందిస్తారు. సాధారణంగా ఇది రెండు సంవత్సరాలు లేదా 40,000 కిలో మీటర్ల వరకూ ఉంటుంది. ఆ తర్వాత కారు సర్వీసింగ్‌కు, మెయింటినెన్స్‌కు మరియు కారులో తలెత్తే సాంకేతిక సమస్యలన్నింటికీ కొనుగోలుదారులు ఎక్కువ మొత్తంలో తమ చేతి డబ్బులు చెల్లించాల్సి వస్తుంది.

కొత్త కారును విక్రయించేటప్పుడే, అదనపు వారంటీని (ఎక్స్‌టెండెడ్ వారంటీ) కొనుగోలు చేస్తే కలిగే ప్రయోజనాల గురించి డీలర్లు ముందుగానే తెలియజేయటం జరుగుతుంది. అయితే, చాలా మంది ఎక్స్‌టెండెడ్ వారంటీని కొనుగోలు చేయటానికి సముఖత వ్యక్తం చేయరు. కానీ, ఇలా ఎక్స్‌టెండెడ్ వారంటీ కొనుగోలు చేయటం వలన, కంపెనీ ఇచ్చే ఉచిత వారంటీ ముగిసిన తర్వాత కారులో ఎవైనా ఖరీదైన రిపేర్లు చేయించాల్సి వచ్చినప్పుడు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఎక్స్‌టెండెడ్ వారంటీని కారు కొన్న తర్వాత మూడవ, నాల్గవ సంవత్సరాలకు లేదా 80,000 కిలో మీటర్ల వరకూ ఇవ్వటం జరుగుతుంది. కొనుగోలుదారులు కావాలనుకుంటే ఈ ఎక్స్‌టెండెడ్ వారంటీని మూడవ సంవత్సరానికి మాత్రమే (లేదా 60,000 కి.మీ.) ఎంచుకోవచ్చు.

ఈ అదనపు వారంటీలో మెకానికల్, ఎలక్ట్రికల్ సమస్యలు, ఇంజన్‌కు సంబంధించిన సమస్యలు, తయారీ లోపాలు, లేబర్ ఖర్చులు వంటివి కవర్ అవుతాయి. ఈ ఎక్స్‌టెండెడ్ వారంటీ ఉంటే, మీరు కారును కొనుగోలు చేసిన డీలర్‌తో సంబంధం లేకుండా, సదరు కారు బ్రాండ్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ఏ అధీకృత సర్వీస్ సెంటర్‌లోనైనా మీ కారును సర్వీస్ చేయించుకోవచ్చు.

వాస్తవానికి కారును కొనుగోలు చేసిన తక్షణమే లేదా కొనుగోలు చేసిన 60 రోజుల లోపుగా అదనపు వారంటీని కొనుగోలు చేసినట్లయితే, అది తక్కువ ధరకే లభిస్తుంది. అలా కాకుండా కారును కొనుగోలు చేసిన తర్వాత 60 నుండి 365 రోజుల్లోపు ఎప్పుడు ఎక్స్‌టెండెడ్ వారంటీని కొనుగోలు చేసినా వినియోగదారుడు కాస్తంత ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, కారుతో పాటుగానే ఎక్స్‌టెండెడ్ వారంటీని కొనుగోలు చేసినట్లయితే, రిపేరు ఖర్చులు తగ్గించుకోవటమే కాకుండా టన్షెన్ లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. మీరేమంటారు..?

More from DriveSpark

Article Published On: Friday, May 4, 2012, 19:27 [IST]
English summary
Buying an extended warranty along with the new car gives more benefits to the customers. It covers mechanical and electrical issues, engine related problems, any other manufacturing defect and labour charges.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+