మీ కార్ మైలేజీని లెక్కించడం ఎలా?

By Ravi

మనదేశంలో కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు ప్రాధాన్యతను ఇచ్చే కొన్ని అంశాల్లో మైలేజ్ అత్యంత ప్రధానమైనది. తాము కొనుగోలు చేసే కారు కొత్తదైనా లేదా పాతదైనా సరే మైలేజ్ విషయంలో వారు ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. వాస్తవానికి, కారు రన్నింగ్ కాస్ట్‌ను తగ్గించుకోవాలంటే ఎక్కువ మైలేజీనిచ్చే కార్లనే కొనుగోలు చేయటం మంచిది.

నిజానికి కార్ కంపెనీలు సర్టిఫై చేసే మైలేజ్ గణాంకాలు చాలా సందర్భాల్లో పేపరు మాత్రమే పరిమితమై ఉంటాయి. రియల్ వరల్డ్ డ్రైవింగ్ కండిషన్స్‌లో, కంపెనీలు పేర్కొన్నట్లుగా ఖచ్చితమైన మైలేజీని పొందటం సాధ్యం కాదు. అలాగే, మరికొన్ని సందర్భాల్లో కంపెనీ పేర్కొన్న మైలేజీ కన్నా ఎక్కువ మైలేజీ వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి.

సందర్భం ఏదేతైనేం, ఇక్కడ మైలేజ్ అనేది ముఖ్యం. కార్ మైలేజ్ మనం నడిపే తీరు, రోడ్డు, లోడ్, టైర్ ప్రెజర్ ఇలా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మరి మీరు నడిపే కారు ఖచ్చితంగా ఎంత మైలేజీనిస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలంటే, అందుకో ఓ చిన్న క్యాలుక్యులేషన్ ఉంది. అదేంటో, మీ కారు మైలేజీని ఎలా తెలుసుకోవాలో ఈ కథనంలో పరిశీలించండి..!

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

మీ కార్ మైలేజీని లెక్కించడం ఎలా?

తర్వాతి స్లైడ్‌లలో మీ కారు మైలేజీని ఎలా లెక్కించాలో తెలుసుకోండి.

ఫుల్ ట్యాంక్

ఫుల్ ట్యాంక్

ముందుగా మీ కారును ఫుల్ ట్యాంక్ చేయించండి. ఫ్యూయెల్ లిడ్ (మూత) పై వరకూ వచ్చేలా పూర్తిగా ఇంధనాన్ని నింపండి.

ఓడోమీటర్ రీడింగ్

ఓడోమీటర్ రీడింగ్

కారులో ఇంధనం ఫుల్ చేయించిన తర్వాత, ఇంజన్‌ను స్టార్ట్ చేయడానికి ముందు ఓడోమీటర్ రీడింగ్‌‌ను నమోదు చేసుకోండి, ఒకవేళ మీ కారులో ట్రిప్ మీటర్ ఉన్నట్లయితే దాన్ని సున్నా (జీరో)కు సెట్ చేసుకోండి.

ఎప్పటిలానే డ్రైవ్ చేయండి

ఎప్పటిలానే డ్రైవ్ చేయండి

మీరు ఎల్లప్పుడూ కారు నడిపే విధంగానే డ్రైవ్ చేయండి. డ్రైవింగ్ విధానంలో మార్పు వస్తే, మైలేజ్‌లో మార్పు కూడా తలెత్తే అవకాశం ఉంది. ర్యాష్ డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్‌ను వీలైనంత వరకూ అవైడ్ చేయాలి.

హాఫ్ ట్యాంక్ టూ ఫుల్ ట్యాంక్

హాఫ్ ట్యాంక్ టూ ఫుల్ ట్యాంక్

ఫుల్ ట్యాంక్ చేయించిన తర్వాత కారును కొంత దూరం నడిపిన పిమ్మట, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లోని ఫ్యూయెల్ గేజ్ కారులో ఇంధనం సగం ట్యాంక్ లేదా కాలుభాగం ఉన్నట్లు సూచించినప్పుడు మరోసారి ట్యాంక్‌ను ఇంధనంతో పూర్తిగా ఫుల్ చేయించండి (ఇదివరకు ట్యాంక్ ఫుల్ చేయించిన పెట్రోల్ బంకులోనే ఇంధనం కొనుగోలు చేయడం ఉత్తమం).

ఎన్ని లీటర్లు పట్టిందో నోట్ చేసుకోండి.

ఎన్ని లీటర్లు పట్టిందో నోట్ చేసుకోండి.

ఇలా రెండవ సారి ఫుల్ ట్యాంక్ చేయించటానికి ఎన్ని లీటర్ల ఇంధనం పట్టిందో నోట్ చేసుకోండి.

ఓడోమీటర్ రీడింగ్

ఓడోమీటర్ రీడింగ్

రెండవ సారి ఫుల్ ట్యాంక్ చేయించిన తర్వాత ఇంజన్ స్టార్ట్ చేయటానికి ముందుగా, మరోసారి ఓడోమీటర్ రీడింగ్‌ను నమోదు చేసుకోండి.

ఓడోమీటర్ రీడింగ్‌ల వ్యత్యాసం

ఓడోమీటర్ రీడింగ్‌ల వ్యత్యాసం

మొదటి మరియు రెండవ సారి నమోదు చేసుకున్న ఓడోమీటర్ రీడింగ్‌ల వ్యత్యాసాన్ని, రెండవ సారి ఇంధనం భర్తీ చేయడానికి పట్టిన పరిమాణం (లీటర్లు)తో భాగిస్తే వచ్చే సగటే కారు యొక్క మైలేజ్ అవుతుంది.

(తర్వాతి స్లైడ్‌లో ఉదాహరణను పరిశీలించండి)

ఉదాహరణ

ఉదాహరణ

ఉదాహరణకు మొదటిసారి ట్యాంక్ ఫుల్ చేయించినప్పుడు ఓడోమీటర్ రీడింగ్ 1000 కి.మీ. వద్ద ఉంది అనుకుందాం. రెండోసారి ట్యాంక్ ఫుల్ చేయించినప్పుడు ఓడోమీటర్ రీడింగ్ 1300 కి.మీ. వద్దకు చేరుకుని ఉండి, ట్యాంక్‌లో ఖాలీ స్థలాన్ని భర్తీ చేయడానికి 15 లీటర్ల ఇంధనం పట్టినట్లయితే, మీ కారు మైలేజీ ప్రతి లీటరుకు 20 కి.మీ అవుతుంది.

ఎలా అంటే, తొలి రీడింగ్ నుండి తుది రీడింగ్‌ను తీసివేస్తే ప్రయాణించిన మొత్తం దూరం వస్తుంది (1000km - 1300km = 300km). ఈ దూరం ప్రయాణించడానికి అయిన ఇంధన పరిమాణం మరియు రెండోసారి ట్యాంక్‌లోని ఖాలీ స్థలాన్ని నింపడానికి పట్టే ఇంధన పరిమాణం రెండూ కూడా సమానంగా ఉంటుంది. ప్రయాణించిన దూరాన్ని ఖర్చైన ఇంధనంతో భాగిస్తే మైలేజీ వస్తుంది.

ఇక్కడ ప్రయాణించిన దూరం 300 కి.మీ. మరియు ఖర్చైన ఇంధనం 15 లీటర్లు. 300 కి.మీ. లను 15 లీటర్లతో భాగిస్తే వచ్చే ఫలితం 20 కి.మీ. అంటే మీ కారు ఇచ్చే మైలేజ్ లీటరుకు 20 కిలోమీటర్లన్నమాట.

Most Read Articles

English summary
Mileage is one of the most important factor that car buyers considering while buying new or used cars. Here is the tips to calculate your car's mileage.
Story first published: Monday, November 3, 2014, 12:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X