చలికాలంలో కారు ఏసీ ఆఫ్‌ చేస్తున్నారా? జరిగే నష్టాలు ఇవే!

దేశంలో చలికాలం ఆరంభం అయ్యింది. దీంతో మంచు రోడ్లపై ప్రభావం కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. చాలా చోట్ల ఇప్పటికే మంచు ప్రభావంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. శీతాకాలంలో వెహికిల్‌ మెయింటైనెన్స్‌ కూడా చాలా కీలకంగా ఉంటుంది. చలికాలంలో వాహనాల సమస్యలను ముందే పరిష్కరించడం ద్వారా ప్రమాదాల నివారించవచ్చు. లేకుంటే వాహనం ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్‌ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ శీతాకాలంలో మీరు మీ కారులో కొన్ని మెయింటెనెన్స్ పనులు చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలు ఈ కథనంలో మీకోసం..

చలికాలంలో ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ నిర్వహణ చాలా ముఖ్యం. శీతాకాలంలో చాలా మంది ఏసీని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇది దీర్ఘకాలంలో పలు సమస్యలకు దారితీస్తుంది. ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు, ఏసీని చాలా నెలలు ఉపయోగించకుండా వదిలేయడం వంటివి చేస్తూ ఉంటారు. ఎక్కువ రోజులు ఇలానే కొనసాగించడం వల్ల తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. దీనివల్ల ఏసీ సిస్టమ్‌ని పూర్తిగా మార్చాల్సిన పరిస్థితి నెలకొంటుంది.

Car AC Repair in Winter

కాబట్టి శీతాకాలంలో మీ కారు ఏసీని మంచి స్థితిలో ఉండేలా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇందుకోస ఏసీని ఎప్పటికప్పుడు ఆన్ చేయండి. ఇది నష్టాన్ని నివారించడానికి సహాయపడుతుంది. మీరు ఏసీని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ఏసీలోని భాగాల్లో జిడ్డు ఏర్పడకుండా, ఇతర ప్రాంతాలు ఎండిపోకుండా చేస్తాయి. కావున కారు ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థను క్రమం తప్పకుండా వాడాలి.

శీతాకాలంలో ఎప్పటికప్పుడు ఏసీని ఉపయోగించడం ద్వారా రెగ్యూలర్‌గా దాని పనితీరుని అంచనా వేయడానికి సహాయపడుతుంది. ఏవైనా సమస్యలు ఉన్నాకానీ కస్టమర్లకు వెంటనే తెలియజేస్తుంది. దీంతో మీరు సకాలంలో రిపేర్‌ చేయించి డబ్బుని ఆదా చేసుకోవచ్చు. ఏసీని ఆన్ చేయడం వల్ల కూలెంట్ ఆయిల్ కారులోని ప్రతీ భాగంలోకి ప్రసరించడానికి సహాయపడుతుంది. ఈ సైకిల్‌ చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది కంప్రెసర్‌ని మంచి స్థితిలో ఉంచుతుంది.

Car AC Repair

అలాగే లీక్‌లను సైతం నివారిస్తుంది. దీనిని మీరు విస్మరిస్తే వేసవి వచ్చిందంటే మీకు భారీ ఖర్చులకు దారితీస్తుంది. చల్లని వాతావరణంలో ఎప్పటికప్పుడు మీ కారు ఏసీని ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది ఏసీ సిస్టమ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా.. బయటి ఉష్ణోగ్రత మళ్లీ పెరిగినప్పుడు సౌకర్యవంతమైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది. ఏసీ ఆన్ చేయడం వల్ల ఏసీ సిస్టమ్‌లో ఫంగస్, బ్యాక్టీరియా ఏర్పడకుండా నిరోధించవచ్చు.

ఏసీని ఎక్కువ రోజులు ఆన్ చేయకుంటే ఫంగస్‌, బ్యాక్టీరియా ఏర్పడి చెడు వాసన వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కారులోని ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల దీర్ఘకాలంలో మీ సమయం, డబ్బు ఆదా అవుతాయి. ఇప్పుడు దీనిని మీరు లైట్‌ తీసుకుంటే ఊహించని ఖర్చులు వచ్చి పడే అవకాశం ఉంటుంది. దీంతో సంవత్సరం పొడవునా ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌ రిపేర్‌కి డబ్బు చెల్లించాల్సి వస్తుంది.

మీ కారు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అన్ని సీజన్‌లో ఒకే విధంగా పనిచేసేలా చూసుకోవాలి. దీనివల్ల భవిష్యత్తులో సమస్యలను నివారించడంతో పాటుగా మీ డ్రైవింగ్ అనుభవం కూడా మెరుగుపడుతుంది. వివిధ రకాల టెక్నాలజీతో ఆటోమొబైల్ రంగం వృద్ధి చెందుతోంది. రాబోయే కార్లలోని స్మార్ట్ టెక్నాలజీని అర్థం చేసుకుని కార్లను ఎంచుకోవాలి. అలా చేయడం వల్ల మీ సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, November 21, 2024, 18:10 [IST]
English summary
Car air conditioning system maintenance importance in winter
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+