హోలీ రోజు కార్లు బైక్స్ ఉన్న వాళ్లు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. లేదంటే రంగు పడుద్ది.. ఆ తర్వాత తడిసిపోద్ది
భారతీయ ప్రజలు పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సంస్కృతి, సంప్రదాయాలకు విలువ నివ్వడంలో దేశ ప్రజల తర్వాతే ఎవరైనా. దేశంలో పెద్ద ఎత్తున జరుపుకునే పండుగలలో హోలీ కూడా ఒకటి. చిన్నాపెద్దా, ఆడ మగ అని తేడా లేకుండా అందరూ కూడా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరంగా జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 14న శుక్రవారం నాడు హోలీ వచ్చింది. ఇప్పటికే హోలీ పండుగ సంబరాలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. ఇదిలా ఉంటే ఈ సమయంలో వాహనాలపై రంగులు పడుతాయి. కార్స్, బైక్స్‌లపై రంగుల పొడి పడటం వల్ల అవి చెడిపోయే అవకాశం ఉంది. వాహనాదారులకు ఇది ఒక పెద్ద సమస్యగా ఉంటుంది. అందుకే కార్స్, బైక్స్‌ను కలిగి ఉన్న ప్రతిఒక్కరూ కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వలన తమ వాహనాలను రంగుల నుంచి కాపాడుకోవచ్చు. మరి అవెంటో ఒకసారి కింది కథనంలో తెలుసుకోండి.
వాహనాన్ని సురక్షితమైన ప్రాంతంలో పార్క్ చేయాలి: ఇటీవల కాలంలో వ్యక్తిగత వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రతి ఇంటికి పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలం ఉండకపోవచ్చు. కొందరి వద్ద అయితే ఒకటి కంటే కార్స్ ఉండటం వలన పార్కింగ్ సమస్య వస్తుంది. దీంతో ఇంటి ముందు రోడ్డు పక్కనే వాటిని పార్కింగ్ చేస్తుంటారు. దీంతో రంగుల పొడి వాటిపై పడతాయి, కాబట్టి ఈ టైం లో వాటిపై జాగ్రత్త వహించాలి.

ఇంట్లో లేదా బయట పార్క్ చేసిన కూడా తప్పనిసరిగా వాటిపై కవర్ కప్పడం చేయాలి. ఏ చిన్న గ్యాప్ లేకుండా పూర్తిగా కవర్‌తో కప్పివేయడం వలన రంగులు అనేవి వాహనాల లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కవర్లు కూడా నాణ్యమైన వాటిని వాడటం ఉత్తమం. క్వాలిటీ లేని వాటిని ఉపయోగించడం వలన రంగుల గాఢత కార్లకు అతుక్కుని కారు పెయింట్ డామేజ్ అయ్యే అవకాశం ఉంది.
హోలీ టైంలో టూవీలర్ వాడండి: ఈ టైంలో బయటకు ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే, కారుకు బదులుగా బైక్ లేదా స్కూటర్ ఉపయోగించడం ఉత్తమం. ముఖ్యంగా స్కూటర్ ఉంటే గనుక దాన్ని వాడటం ఇంకా మంచిది. కారు అయితే వాటిపై పూత తొందరగా డామేజ్ అయ్యే అవకాశం ఉంది. రోడ్లపై చాలా మంది రంగలు చల్లుతారు, కాబట్టి ఆ జనాల్లో స్కూటర్ అయితే ఈజీగా డ్రైవ్ చేయవచ్చు.

కారు విండోస్‌ను ఎప్పుడు మూసి ఉంచాలి: ముఖ్యంగా మీ కారును పార్క్ చేసినప్పుడు అలాగే, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కచ్చితంగా విండోస్‌లను మూసి ఉంచడం మాత్రం మర్చిపోవద్దు. దీని వలన బయట కలర్స్ కారు లోపలికి రాకుండా చేయవచ్చు. అలాగే రంగులతో నిండిన గాలిని అడ్డుకోవచ్చు. కారు కవర్ లేని వారు మాత్రం ఈ విషయాన్ని తప్పనిసరిగా పాటించాలి.
డాష్‌బోర్డ్ విషయంలో జాగ్రత్త: ఇంటీరియర్‌లో డాష్‌బోర్డ్ కీలకమైంది. హోలీ పండుగ సంబరాల్లో రంగుల నుంచి లోపలి క్యాబిన్‌కు కూడా కాపాడుకోవాలి. డాష్‌బోర్డ్‌ను పూర్తిగా కప్పి ఉంచడం వీలుకాదు కాబట్టి దాని ప్లాస్టిక్ ప్యానెల్‌లకు ఆయిల్ ఫిల్మ్‌ను లేదంటి మంచి నాణ్యత కలిగిన వ్యాక్స్‌ను పూయాలి. సీటు విషయంలో కూడా జాగ్రత్త అవసరం. లెదర్ సీట్లు అయితే వాటిని గుడ్డతో కప్పడానికి బదులుగా లెదర్ ప్రొటెక్టర్‌ను వాడవచ్చు.
పండుగ తర్వాత కడగడం: హోలీ పండుగ ముగిసిన తర్వాత వాహనదారులు తప్పనిసరిగా నీటితో వాటిని కడగడం మాత్రం మర్చిపోవద్దు. దీని కోసం గృహోపకరణ పౌడర్లు కాకుండా మార్కెట్లో కారు లేదా టూవీలర్స్‌ను క్లీనింగ్ చేయడానికి మంచి నాణ్యత కలిగిన పౌడర్లు, లిక్విడ్ లాంటివి చాలా అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని కొనుగోలు చేసి పండగ తర్వాత వెంటనే వాహనాన్ని పూర్తిగా కడగాలి. లేదంటే వాషింగ్ షాప్‌లో అయిన శుభ్రం చేయించాలి.


Click it and Unblock the Notifications








