కొత్త కారు కొనే ముందు తెలుసుకోవాల్సిన మాస్టర్ టిప్స్! సరైన ఆప్షన్ ఎంచుకోవడానికి సింపుల్ గైడ్!
ప్రస్తుతం కారు కొనడం అనేది అందరి డ్రీమ్ అయిపోయింది. ఒకప్పుడు బైకు ఉంటే చాలు అనుకునే రోజులు పోయి, కారు ఉంటే బాగుండు అనే రోజులు వచ్చాయి. మార్కెట్లో వాహన తయారీదారులు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అందుబాటు ధరలో కొత్త కొత్త డిజైన్లతో అధునాతన ఫీచర్స్‌తో కూడిన కార్లను విడుదల చేస్తున్నారు. కారు కొనడం అంటే సాధారణంగా ఒక పెద్ద డ్రీమ్ నెరవేర్చుకున్నట్టే. ముఖ్యంగా ఫస్ట్ టైమ్ బయ్యర్స్‌కి ఇది మరింత ఎమోషనల్ జర్నీగా ఉంటుంది. కానీ కేవలం కలతో కాకుండా, కొన్ని విషయాలు ముందుగానే ఆలోచిస్తే తరువాత ఇబ్బందులు రాకుండా ఉంటుంది. కారు కొనుగోలు చేయడానికి వెళ్లే ముందు వాటి గురించి ముందస్తు సన్నద్ధం కావడం వలన మీకు నచ్చిన కార్లను సంతోషంగా ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఆ వివరాలు ఈ కథనంలో..
బడ్జెట్ నిర్ణయం: మొదటిగా, మన బడ్జెట్‌ని క్లియర్‌గా నిర్ణయించుకోవాలి. ఎంత బడ్జెట్ ఉందో దానికి అనుగుణంగా ఏ కంపెనీకి చెందిన కారు వస్తుందో, అది అవసరాలకు సరిగ్గా సరిపోతుందా లేదా అని ఒక అవగాహనకు రావాలి. EMI ఎంత భరించగలమో, మెయింటెనెన్స్ ఖర్చులు, ఇన్సూరెన్స్, ఫ్యూయల్ ఖర్చులు ఇలా అన్ని కలిపి లెక్క వేసుకోవాలి. చాలామంది కారు ధర మాత్రమే చూసి కొనేస్తారు, కానీ తరువాత మెయింటెనెన్స్‌లో ఇబ్బందులు పడతారు.

అవసరానికి తగ్గ మోడల్: కారు కొనే ముందు మన అవసరాన్ని బాగా అర్థం చేసుకోవాలి. రోజూ ఆఫీస్‌కి వెళ్ళడం, సిటీ ట్రాఫిక్‌లో డ్రైవ్ చేయడం మాత్రమే అయితే చిన్న హాచ్‌బ్యాక్ సరిపోతుంది. కుటుంబం పెద్దది అయితే, లాంగ్ డ్రైవ్స్ లేదా టూరింగ్‌కి వెళ్ళాలనుకుంటే SUV బెటర్ ఆప్షన్. స్టైలిష్‌గా, కంఫర్ట్‌గా ఫ్యామిలీ ట్రిప్స్‌కి అనుకుంటే సెడాన్ కూడా మంచి ఛాయిస్ అవుతుంది. లేదంటే MPV టైప్ మోడల్ బెస్ట్ ఆప్షన్.
ఫ్యూయల్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి: కారు కొనేటప్పుడు పెట్రోల్, డీజిల్, CNG లేదా ఎలక్ట్రిక్ ఏ ఫ్యూయల్ టైప్ బెటర్ అనేది ముందే నిర్ణయించుకోవాలి. సిటీ యూజ్‌కి, మెయింటెనెన్స్ తక్కువగా ఉండాలనుకునేవాళ్లకు పెట్రోల్ కార్లు బెస్ట్. ఎక్కువ డ్రైవింగ్ చేసే వాళ్లకు, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్‌కి డీజిల్ కార్లు సూట్ అవుతాయి. తక్కువ ఖర్చుతో మైలేజ్ కావాలనుకునే వారికి CNG కార్లు బాగుంటాయి. ఫ్యూయల్ ఖర్చు వద్దనుకుంటే ఈవీ బెస్ట్.

సేఫ్టీ ఫీచర్లను ప్రాధాన్యం: కారు ఎంచుకునేటప్పుడు ఫీచర్లు, లగ్జరీ కంటే ముందుగా సేఫ్టీనే ప్రాధాన్యం ఇవ్వాలి. రోడ్డుపై ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి మన కుటుంబం సేఫ్‌గా ఉండటం చాలా ముఖ్యం. Airbags, ABS, ESP లాంటి ఫీచర్లు ఉండటం చాలా ముఖ్యం. అదేవిధంగా Global NCAP రేటింగ్స్ కూడా చూసుకోవాలి. క్రాష్ టెస్ట్ ఫలితాలను కూడా చూసిన తరువాత సరైన కారును ఎంచుకోవాలి.
టెస్ట్ డ్రైవ్ తప్పనిసరి: కారులో ఎన్ని ఫీచర్లు ఉన్నా, పేపర్ మీద ఎంత అద్భుతంగా కనిపించినా, డ్రైవ్‌లో అనుభవం వేరే. అందుకే కొనుగోలు చేసేముందు టెస్ట్ డ్రైవ్ చేయడం తప్పనిసరి. సీటింగ్ పొజిషన్, లెగ్ స్పేస్, స్టీరింగ్ గ్రిప్, కంఫర్ట్‌గా ఉన్నాయా చూడాలి. ట్రాఫిక్‌లో, హైవేపై, మలుపుల దగ్గర కారు ఎలా రియాక్ట్ అవుతుందో గమనించాలి. బ్రేకులు టైట్‌గా ఉన్నాయా, సేఫ్‌గా అనిపిస్తాయా అనేది చూసుకోవాలి.

చివరగా: మొత్తానికి కొత్త కారు కొనడం అంటే ఒక బాధ్యత. అవసరాలు, బడ్జెట్, సేఫ్టీ అన్ని దృష్టిలో పెట్టుకుని సరైన కారు ఎంపిక చేసుకుంటే, అది మన జీవితానికి ఒక మంచి తోడ్పాటు అవుతుంది. మన ప్రయాణ అవసరాలను తీర్చుతుంది. అదే సమయంలో రీసేల్ విలువను మైండ్‌లో పెట్టుకోవాలి. ఒకవేళ వాటిని తిరిగి అమ్మినా కూడ మంచి విలువ కట్టే విధంగా ఉండే వాటిని ఎంచుకోవడం బెస్ట్.


Click it and Unblock the Notifications








