కారు మైలేజీ రావడం లేదా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి... చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు!

దేశంలో ఇంధన ధరల భారం పెరిగిపోతోంది. చాలామంది తమ సంపాదనలో ప్రతినెల కొంత ఫ్యూయల్ ఖర్చులకోసం తీసి పక్కన పెడుతూ ఉంటారు. సాధ్యమైనంత మేర ఈ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఫ్యూయల్ ఖర్చులతో పాటు.. మనం వాడే కారు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా అదనంగా ఉంటాయి. మనం మన కారు సరిగ్గా సర్వీసు చేయించకపోతే ఈ ఫ్యూయల్ భారం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ ఖర్చుల్లో చాలావరకు మనం ఆదా చేసుకోవచ్చు. అంటే దీన్నిబట్టి కారు మెయింటెనెన్స్‌కు, దాని ఫ్యూయల్ కన్సంప్షన్‌కు మధ్య సంబంధం ఉంటుందనేది తెలుస్తుంది. అయితే ఈ కథనంలో ఫ్యూయల్ కాస్ట్ తగ్గించుకోవడానికి ఉండే అవకాశాలు ఏంటో చూసేద్దాం.

రెగ్యులర్ కార్ మెయింటెనెన్స్: ముందుగా చెప్పుకున్నట్లుగా.. కారును సమయానికి అనుకూలంగా సర్వీస్ చేయిస్తూ మంచి కండిషన్లో ఉండే విధంగా చూసుకుంటే ఫ్యూయల్ వినియోగం తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా.. కారు టైర్లు inflated గా ఉండేలా చూస్తూ.. ఇంజిన్ ఎయిర్ ఫిల్టర్‌ను శుభ్రం చేస్తూ ఉంటే.. ఇంజిన్ సామర్థ్యం పెరుగుతుంది. దాంతోపాటు ఫ్యూయల్ కన్సంప్షన్‌ కూడా తగ్గుతుంది.

Car Fuel Consumption Reducing Tips

మంచి రూటు ఎంచుకోవడం: మీరు ఎక్కడికైనా ప్రయాణించే ముందు ఏ దారిలోనైతే తక్కువ ఫ్యుయల్ ఖర్చు అవుతుందో చూసి సరైన దారిని ఎంచుకోవాలి. కొన్నిసార్లు షార్ట్ కట్ అనుకున్న రూట్ కూడా ఎక్కువ ఇంధనాన్ని లాగేస్తుంది కారును డ్యామేజ్ చేసేస్తుంది. అందుకే మంచి రూటు ఎంచుకోవడం తప్పనిసరి.

యూజింగ్ యాక్సిలరేషన్ & బ్రేక్: కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్న వ్యక్తిలా తరచూ యాక్సిలరేషన్ బ్రేక్ పెడల్స్ నొక్కకండి. సడెన్ యాక్సిడెంట్ బ్రేకింగ్ ఒకేసారి వేయడాన్ని మానుకోవాలి. దీన్నిబట్టి యాక్సిలరేషన్ బ్రేక్ కార్ ఇంజిన్‌పై ప్రభావం చూపుతాయనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Car Airconditioning

నిర్దిష్ట వేగంతో జర్నీ: ఎక్కువ స్పీడ్‌తో ప్రయాణించడం ప్రమాదకరమే కాదు చాలా ఫ్యూయల్ కూడా వినియోగించడం జరుగుతుంది. అలాగే మరీ తక్కువ వేగంతో కూడా ప్రయాణించడం సరికాదు. అందుకే మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఒక సాధారణ వేగంతో మనం ప్రయాణించాలి.

అనవసరమైన లోడ్స్ తగ్గించాలి: కారు ఇంజిన్ ఎక్కువగా పనిచేస్తే ఎక్కువ అయిందని ఖర్చు అవుతుంది. అందుకే ఇంజిన్‌పై భారం పడకుండా ఉండాలంటే కారులో లోడ్స్ తగ్గించాలి. అలాగే కారులో అనవసరమైన వస్తువులు లేకుండా చూసుకోవాలి. అలాగే కారు సస్పెన్షన్ బ్రేకుల వంటి వాటిలో ప్రేమెచ్చూర్ డ్యామేజ్ లేకుండా జాగ్రత్త వహించాలి.

Car Luggage

AC కొంచెం తక్కువగా..: కారులో ఉండే ఏసీ లైట్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ దాంట్లో ఉండే బ్యాటరీ ఆధారంగా పనిచేస్తాయి. అందువల్ల కారులోని AC ఆపరేషన్ పరోక్షంగా ఇంజిన్ పర్ఫామెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. అందుకే అవసరం లేనప్పుడు ఏసీ వినియోగాన్ని మానుకోవాలి.

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: మీరు పైన చెప్పిన విషయాలన్నీ పాటిస్తే.. ఫ్యూయల్ ఖర్చుల విషయంలో పెద్ద తేడాను గమనిస్తారు. వీటన్నింటి కంటే ముఖ్యంగా మంచి మైలేజీ ఇచ్చే కారు కొనడం ఇంకా బెటర్. ప్రస్తుత రోజుల్లో CNG కార్లు మైలేజీ విషయంలో మెరుగ్గా రాణిస్తున్నాయి. వీటితో పాటు సేఫ్టీ రేటింగ్‌పై కూడా దృష్టి సారించండి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, February 12, 2025, 14:44 [IST]
English summary
Car fuel consumption reducing tips if you follow this you can save more money
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+