రివర్స్ గేర్ ఎక్కువగా వాడితే ఇంజన్ మీద ఎలాంటి ప్రభావం పడుతుందా...?

By Anil Kumar

కారు రివర్స్ గేరులో గరిష్టంగా ఎంత దూరం ప్రయాణించగలదు....? రివర్స్ గేర్ కేవలం పార్కింగ్ కోసం మరియు కొద్ది మేర వెనక్కి వెళ్లడానికి మాత్రమే ఉపయోగిస్తామని ప్రతి డ్రైవర్‌కు తెలిసిందే. కానీ, పార్కింగ్ చేసిన అనంతరం రివర్స్ గేరును అలానే ఉంచరు.

రివర్స్ గేర్ ఎక్కువగా వాడితే ఇంజన్ మీద ఎలాంటి ప్రభావం పడుతుందా...?

మరి కారులోని రివర్స్ గేరు కారుకు మంచిది కాదా...? డ్రైవింగ్‌లో ఎంత అనుభవజ్ఞులైనా సమాధానం లభించక ఏదో మూలన ఇంకా కొన్ని అనుమానాలు అలానే ఉండిపోయి ఉంటాయి. రివర్స్ గేరులో కారు ఎంత ప్రయత్నించినా... అది కారు ముందు వైపుకు వెళ్లడానికి సహకరించే మొదటి గేర్‌కు సమానం.

రివర్స్ గేర్ ఎక్కువగా వాడితే ఇంజన్ మీద ఎలాంటి ప్రభావం పడుతుందా...?

ఫస్ట్ గేర్ తరహాలోనే రివర్స్ గేర్ కూడా పరిమిత వేగం వరకు మాత్రమే ప్రయాణించడానికి అనుమతిస్తుంది. రోడ్డు ఎంత బాగున్నా కూడా, రివర్స్ గేర్‌లో ఉపయోగించే గేర్ల నిష్పత్తి తక్కువ వేగంతో ప్రయాణించడానికి సెట్ చేస్తారు.

రివర్స్ గేర్ ఎక్కువగా వాడితే ఇంజన్ మీద ఎలాంటి ప్రభావం పడుతుందా...?

రివర్స్ గేర్ చాలా అరుదుగా అది కూడా పార్కింగ్ సందర్భాల్లో మాత్రమే ఉపయోగిస్తాం కాబట్టి ఫస్ట్ గేర్ తరహా అధిక వేగం వంటి కంట్రోల్ తప్పే ప్రమాదం ఉంది. అందుకోసమే గేర్‌బాక్స్‌లో ఉండే అన్ని గేర్ల యొక్క గరిష్ట వేగం చూసుకుంటే రివర్స్ గేర్ యొక్క గరిష్ట వేగం చాలా తక్కువగా ఉంటుంది.

రివర్స్ గేర్ ఎక్కువగా వాడితే ఇంజన్ మీద ఎలాంటి ప్రభావం పడుతుందా...?

రివర్స్ గేరులో కారును నడపడం దాని ఇంజన్ మీద ఎలాంటి ప్రభావం చూపదు. కానీ, అనవసరంగా మరియు పదే పదే రివర్స్ గేర్ ఉపయోగించడం వలన క్లచ్ ప్లేట్లు దెబ్బ దినడం మరియు ఇంజన్ ఓవర్ హీట్ అవ్వడం జరుగుతుంది. ఇది కారు ఇంజన్‌కు అంత మంచిది కాదు.

రివర్స్ గేర్ ఎక్కువగా వాడితే ఇంజన్ మీద ఎలాంటి ప్రభావం పడుతుందా...?

కార్లలో గేర్లను ఎల్లప్పుడూ ముందుకు వెళ్లడానికి మాత్రమే ఉపయోగిస్తారు. వివిధ రకాల రహదారులకు అనుగుణంగా ఇంజన్ నుండి వచ్చే అధిక పవర్‌ను విభజించి పలు గేర్ల ద్వారా ఆయా రహదారి పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన పవర్‌ను మాత్రమే చక్రాలకు అందిస్తాయి. అయితే, వీటిలో రివర్స్ గేర్ యొక్క ముఖ్యం లక్ష్యం కారును వెనక్కి నడపడం.

రివర్స్ గేర్ ఎక్కువగా వాడితే ఇంజన్ మీద ఎలాంటి ప్రభావం పడుతుందా...?

రివర్స్ గేర్ అవసరాలని తగ్గట్లుగా తక్కువ వేగంతో ప్రయాణించాల్సిన ఉంటుంది కాబట్టి, ఇంజన్ నుండి వచ్చే అధిక పవర్ మరియు టార్క్‌ను కొద్ది మేర మాత్రమే కారు వెనక్కి వెళ్లడానికి చక్రాలకు సరఫరా చేస్తుంది.

రివర్స్ గేర్ ఎక్కువగా వాడితే ఇంజన్ మీద ఎలాంటి ప్రభావం పడుతుందా...?

సాధారణంగా కారు ముందుకు వెళ్లడానికి ఉపయోగించే గేర్లతో పోలిస్తే, రివర్స్ గేర్ వాడకం చాలా తక్కువ. ఏదేమైనప్పటికీ, రివర్స్ గేరులో కారు నడపితే ఇంజన్ మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు రివర్స్ గేర్‌ను ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిది.

రివర్స్ గేర్ ఎక్కువగా వాడితే ఇంజన్ మీద ఎలాంటి ప్రభావం పడుతుందా...?

రివర్స్ గేరులో ఎక్కువగా నడపడం ద్వారా కలిగే మరో పెద్ద సమస్య హీటింగ్. కారు ముందుకు వెళుతున్నపుడు దానికి వ్యతిరేక దిశలో గాలి ప్రవాహం ఉంటుంది కాబట్టి, ఎప్పటికప్పుడు ఇంజన్ వేడి తగ్గుతుంటుంది. అయితే, రివర్స్ గేర్‌లో కారు వెనక్కి వెళుతుంది కాబట్టి ఇంజన్ వైపుకు గాలి ప్రవాహం ఉండదు. ఈ క్రమంలో ఇంజన్ ఆర్‌పిఎమ్ ఎక్కువగా ఉండటం వలన ఓవర్ హీట్ అవుతుంది.

రివర్స్ గేర్ ఎక్కువగా వాడితే ఇంజన్ మీద ఎలాంటి ప్రభావం పడుతుందా...?

ఇలా ఇంజన్ వేడి క్రమక్రమంగా పెరిగిపోవడం వలన ఇంజన్ లోపల ఉండే పిస్టన్ రింగ్స్ మరియు క్యామ్ షాప్ట్, పిస్టన్ పిన్ వంటి విడి భాగాలు దెబ్బతింటాయి.

రివర్స్ గేర్ ఎక్కువగా వాడితే ఇంజన్ మీద ఎలాంటి ప్రభావం పడుతుందా...?

ఇవాళ్టి కథనంలో రివర్స్ గేర్ యొక్క ప్రాముఖ్యత, రివర్స్ గేర్ ఎక్కువగా ఉపయోగిస్తే ఇంజన్‌‌కు కలిగే అనర్థాలు గురించి తెలుసుకున్నారు కదా. కాబట్టి, రివర్స్ గేరులో వాహనాన్ని నడిపేటపుడు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని డ్రైవ్ చేసి, మీ వెహికల్ ఇంజన్ లైఫ్ పెంచుకోండి.

Most Read Articles

English summary
Read In Telugu: Reverse Gear Impact On Engine
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X