ఎండ దంచి కొడుతుంది.. ఈ టైంలో కారును ఎలా కాపాడుకోవాలి? టైర్లు, బ్యాటరీ, కూలింగ్ సిస్టమ్ కోసం కీలకమైన టిప్స్!
దేశంలో అప్పుడే వేసవి కాలం వచ్చేసింది. ఎక్కడ చూసినా కూడా ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరువలో ఉంది. ప్రజలు ఉదయం 10 దాటితే బయటకు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో తమ వావానాలను కాపాడుకోవాల్సిన అవసరం కూడా వాహనదారులకు ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ప్రతి ఏడాది కూడా తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఈ 2025లో కూడా ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ టైంలో వేడి కారణంగా కార్ల ఇంజిన్ వేడెక్కే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
లోపల ఉన్న ఇతర యంత్రాలు కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. దీంతో బ్రేక్‌డౌన్ కావచ్చు. ఇవి మాత్రమే ఇతర ఇబ్బందులు, టైర్ల ప్రెజర్ పెరగడం, బ్యాటరీ ఫెయిల్యూర్, ఎయిర్ కండిషనింగ్, కారు లోపల వేడి అధిక ఉండటం వంటి సమస్యలు ఎదురవుతాయి. వీటి గురించి ముందుగా తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే అనవసరమైన ఖర్చులను, ఇబ్బందులను నివారించవచ్చు. పూర్తి వేసవి కాలం రాకముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కింది కథనంలో తెలుసుకోండి.

బ్యాటరీని చెక్ చేయడం: అధిక వేడి కారణంగా బ్యాటరీ లోపల ఉన్న ద్రవం కూడా వేగంగా ఆవిరైపోతుంది. దీంతో బ్యాటరీ లోపల తుప్పు పట్టే అవకాశం ఉంది. వైర్లు బ్యాటరీకి కనెక్ట్ అయ్యే ప్రాంతం బాగా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. వేసవి వేడిలో బ్యాటరీ త్వరగా వేడెక్కి, పనితీరు తగ్గిపోవచ్చు. కాబట్టి కారును డైరెక్ట్ సన్‌లైట్‌లో పార్క్ చేయకుండా, షేడ్‌లో ఉంచండి.
AC ఎక్కువగా వాడటం వల్ల బ్యాటరీపై ఎక్కువ లోడ్ పడుతుంది. సాధారణంగా వేసవిలో కూలింగ్ కోసం మరింత ఎక్కువ ఉపయోగిస్తుంటాం. అందుకే ప్రయాణం పూర్తయిన వెంటనే AC, లైట్స్ ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి. బ్యాటరీ వయస్సు 3-5 ఏళ్ల వరకు ఉంటుంది. కాబట్టి మీ కారులో దాన్ని ఎప్పుడు అమర్చారో గుర్తు చేసుకుని కాల పరిమితి దాటిందో లెదో చెక్ చేసుకుని వీలైతే కొత్తది మార్చుకోవాలి.

కూలింగ్ సిస్టమ్ మెయింటనెన్స్: కారు కూలింగ్ సిస్టమ్ అంటే కేవలం AC మాత్రమే అని భావించవచ్చు. ఇది వేడిగా ఉన్నటువంటి కారు ఇంజిన్ వ్యవస్థను చల్లబరుస్తుంది. అధిక వేగంతో కారు వెళ్ళినప్పుడు ఇంజిన్ సాధారణంగానే ఎక్కువ పెరుగుతుంది. అలాంటిది వేసవి కాలంలో మరింత అధికంగా ఉంటుంది. బయటి నుండి వచ్చే వేడి కారులోకి వ్యాపించి క్యాబిన్ మాత్రమే కాకుండా ఇంజిన్ కూడా ఎక్కువ హీట్ కావడానికి అవకాశం ఉంది.
కాబట్టి AC బయటి నుంచి వచ్చే గాలిని చల్లబరిచి క్యాబిన్‌ను మాత్రమే కాకుండా ఇంజిన్‌ను కూడా కూల్‌గా ఉంచుతుంది. ఇటీవల కాలంలో కార్ల కంపెనీలు ఇంజిన్ వ్యవస్థలో కూలెంట్‌ను ప్రత్యేకంగా అందిస్తున్నాయి. లీకేజ్, గాలికి ఆవిరయ్యే వాటి కారణంగా ఈ కూలింగ్ వ్యవస్థలోని లిక్విడ్ కాలక్రమేణా తగ్గుతుంది. వేసవిలో అయితే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వేసవికి ముందుగానే ఇంజిన్ కూలింగ్ సిస్టంను చెక్ చేయాలి.

టైర్ల మెయింటెనెన్స్: ఎండ వేడి వల్ల టైర్లలో గాలి ఒత్తిడి పెరుగుతుంది. టైర్లు వేడెక్కి ఎయిర్ ఎక్స్‌పాండై, టైర్లు పేలడం వంటి సంఘటనలు విస్తృతంగా జరుగుతాయి. ముఖ్యంగా వేసవిలో రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇవి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ప్రతి 15 రోజులకు ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి. కారు మాన్యువల్‌లో సూచించిన ప్రెజర్‌కు టైర్ ప్రెజర్ సెట్ చేయండి.
డైరెక్ట్ సన్‌లైట్ కారణంగా టైర్లు బలహీనంగా మారి క్రాక్‌లు వచ్చే అవకాశం ఉంది. టైర్లలో గాలి ఒత్తిడిని స్థిరంగా మెయింటెనెన్స్ చేయడం ద్వారా ప్రమాదాల నుంచి ముందు జాగ్రత్తగా బయటపడే అవకాశం ఉంది. వీలైనంత వరకు కూడా కార్లను నీడగా ఉండే ప్రాంతంలో పార్క్ చేయాలి. ఇవి కాకుండా, వేసవి కాలంలో కార్లను పనితీరు మెరుగ్గాఉంచడానికి ఇతర జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.


Click it and Unblock the Notifications








