చలికాలంలో కార్ల మైలేజీ తగ్గుతుంది.. అందుకే ఇలా చేయండి మైలేజీ సమస్య మళ్లీ రాదు!
చలికాలం కార్ల మైలేజీ తగ్గుతంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. మైలేజీ తగ్గడం వల్ల మీకు ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ శీతాకాలంలో కోల్డ్ ఇంజిన్, ఫ్రోజెన్ ఇంజిన్ ఆయిల్, బ్యాటరీ సమస్య వంటి ఇతర కారణాల వల్ల ఇంధన వినియోగం పెరుగుతుంది. దీంతో మీ కారు ఇవ్వాల్సిన మైలేజీ కంటే తక్కువగా అందిస్తుంది. దీని నుంచి బయటపడటం పెద్ద సమస్య ఏం కాదు. కొన్ని టిప్స్‌తో మీ మైలేజీని స్థిరంగా కొనసాగించవచ్చు. అంతే కాకుండా మీరు ఊహించన విధంగా మీ కారు మైలేజీని సుమారు 20% పెంచుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాలపై ఓ లుక్కేయండి.
కారు మంచి మైలేజీ రావాలంటే ఒకే విధమైన వేగంతో డ్రైవింగ్ చేయడం చాలా ముఖ్యం. తద్వారా మీ కారు మైలేజీ పెరుగుతుంది. ఒకేసారి కారు వేగాన్ని పెంచడం, మళ్లీ స్పీడ్‌ని అమాంత తగ్గించడం వల్ల ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. కావున ఇంజిన్ పీడనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. మీ మైలేజీ పెరగడానికి గంటకు 50-60 కిలోమీటర్ల నిర్ధిష్టమైన వేగంలో నడిపేందుకు ప్రయత్నించండి.

ఇక వింటర్‌లో టైరు పీడనం పడిపోతుంది. దీంతో ఇది రోడ్డుపై టైరు ఘర్షణకు గురవుతుంది. సరైన పీడనాన్ని మెయింటైన్ చేయడం వల్ల మైలేజీ పెరుగుతుంది. చలి, మంచు రోడ్లలో టైర్లలో సరైన గాలి పీడనం లేకుంటే మైలేజీ భారీగా తగ్గుతుంది. కావున టైర్ ప్రెజర్‌ని ఎప్పటికప్పుడూ చెక్ చేస్తూ ఉండాలి.
చాలా మంది డ్రైవర్లు తమ కార్లను శీతాకాలంలో ఇంజిన్ వేడెక్కేందుకు ఎక్కువ సేపు రేస్ చేస్తూ ఉంటారు. అయితే దీనికోసం ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. రన్నింగ్‌లో ఇంజిన్ వేగంగా వేడెక్కినప్పుడు ఒకటి లేదా రెండు నిమిషాల్లో డ్రైవింగ్ ప్రారంభించండం ఉత్తమం. చలికాలంలో ఇలా చేయడం వల్ల ఫ్రీజ్ అయిన ఆయిల్ కారులోని చివరి వరకు చేరుకుంటుంది. సకాలంలో ఫ్యూయల్ అందడం ద్వారా మైలేజీని పెంచేందుకు సహాయపడుతుంది.

ఇక మీ కారులో అనవసరమైన బరువును తీసుకెళ్లడం వల్ల ఇంజిన్‌పై లోడ్ ఎక్కువ పడి ఇంధన వినియోగం పెరుగుతుంది. కాబట్టి మీకు అనవసరమైన వస్తువులను తొలగించి, నిత్యావసర వస్తువులను మాత్రమే వాహనంలో ఉండేలా చూసుకోండి. ఇలాంటి సందర్భాల్లో మీరు హీటర్లు, ఎయిర్ కండిషనర్లను ఉపయోగించడం వల్ల ఎక్కువ బ్యాటరీ, ఫ్యూయల్ ఖర్చవుతుంది. కావున మీ ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ముందే తీసుకెళ్లాల్సిన వస్తువులు ఏంటో డిసైడ్ చేసుకోండి.
ఇక ఫైనల్‌గా చల్లని వాతావరణం ఇంజిన్ ఆయిల్‌ని చిక్కగా మార్చుతుంది. ఇది ఇంజిన్ పనితీరుని ప్రభావితం చేస్తుంది. శీతాకాలంలో చిక్కదనం తక్కువ ఉండే నాణ్యమైన ఇంజిన్ ఆయిల్‌ని మాత్రమే ఎంచుకోండి. ముఖ్యంగా మెరుగైన ఇంజిన్ పనితీరు కోసం ఎయిర్ ఫిల్టర్‌ని క్రమం తప్పకుండా శుభ్రం చేయండి.

లాంగ్ జర్నీలో కార్ల వేగంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇవి ఎక్కువ ఇంధన వినియోగాన్ని పెంచుతాయి. కావున పైన చెప్పిన విధంగా స్థిరమైన వేగాన్ని నిర్వహించడానికి క్రూయిజ్ కంట్రోల్‌ని ఉపయోగించండి. ఇది సుదూర ప్రయాణాల్లో ఇంధన వినియోగాన్ని ఆదా చేయడానికి సహాయపడుతుంది. ఈ చిన్నపాటి చిట్కాలను పాటించడం వల్ల శీతాకాలంలో మీ కారు మంచి మైలేజీని అందిస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








