సన్‌రూఫ్ అసలు ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు! కంపెనీ కూడా మీకు చెప్పదు!

కార్లలో స్టైల్, లగ్జరీ అన్నీ కలగలిసిన ఫీచర్‌లలో ప్రత్యేకమైనది సన్‌రూఫ్(Sunroof). ఇది కేవలం కిటికీ కప్పు మాత్రమే కాదు, డ్రైవింగ్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే టెక్నాలజీ. గతంలో లగ్జరీ కార్లలో మాత్రమే సన్‌రూఫ్ లభించేది. అంటే, బిఎండబ్ల్యూ, ఆడి, మెర్సిడెస్-బెంజ్ వంటి ఖరీదైన వాహనాల్లోనే ఉండేది. కానీ ఇప్పుడు మారుతున్న మార్కెట్ ట్రెండ్, వినియోగదారుల డిమాండ్ కారణంగా మిడ్-రేంజ్ మరియు బడ్జెట్ కార్లలో కూడా సన్‌రూఫ్ అందుబాటులోకి వచ్చింది. చాలామంది దీన్ని కేవలం స్టైలిష్ లుక్ కోసం మాత్రమే అనుకుంటారు. నిజమే, సన్‌రూఫ్ ఉండటం వలన కారు బయటికి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. క్యాబిన్‌లో కూడా ఓపెన్, ఎయిరీ ఫీలింగ్ వస్తుంది. కానీ ఈ ఫీచర్ వెనుక కేవలం స్టైల్ మాత్రమే కాదు, అనేక ఉపయోగాలు, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటిని ఒకసారి చూద్దాం.

సహజ కాంతి: సన్‌రూఫ్ ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, ఇది సూర్యరశ్మిని నేరుగా క్యాబిన్‌లోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది. దాంతో ప్రయాణికులు సహజ కాంతిని ఆస్వాదించగలరు. సాధారణంగా కార్లలో కేవలం కిటికీల ద్వారానే వెలుతురు లోపలికి వస్తుంది. కానీ సన్‌రూఫ్ వలన పై భాగం నుండి వచ్చే సూర్యకాంతి కారు లోపల ఇంకా ప్రకాశవంతంగా, బహిరంగంగా అనిపిస్తుంది. ఇది కేవలం ప్రకాశం మాత్రమే కాదు, ప్రయాణికుల మనసుకు తాజాతనం కూడా ఇస్తుంది.

Car Sunroof Purpose And Benefits

ముఖ్యంగా లాంగ్ జర్నీల్లో లేదా ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించే సమయంలో, సన్‌రూఫ్ ద్వారా వచ్చే సహజ కాంతి, శుభ్రమైన గాలి ఒక రిఫ్రెషింగ్ ఎక్స్పీరియన్స్ ను ఇస్తుంది. అదేవిధంగా, సన్‌రూఫ్ ఉన్న కారు లోపల విశాలమైన స్పేస్ ఫీలింగ్ వస్తుంది. అంటే చిన్న కారు అయినా లోపల కూర్చున్న వారికి మరింత పెద్దగా, ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇది ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచే ముఖ్యమైన అంశం.

సేఫ్టీ: కారు తలుపులు ఏదైనా ప్రమాదం లేదా సాంకేతిక సమస్య వల్ల ఆగిపోతే, సన్‌రూఫ్ ఒక ప్రత్యామ్నాయ తప్పించుకునే మార్గంగా ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా వరదలు, రోడ్డు ప్రమాదాలు వంటి పరిస్థితుల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పై భాగంలో ఉండటం వల్ల, ప్రయాణికులు సులభంగా బయటకు రావడానికి ఇది ఒక సేఫ్టీ ఆప్షన్ అవుతుంది.

Car Sunroof Purpose And Benefits

మెరుగైన వెంటిలేషన్: సన్‌రూఫ్ తెరవడం వల్ల కారులోకి తాజా గాలి నేరుగా ప్రవేశిస్తుంది. సైడ్ విండోలు తెరిస్తే గాలి ఒకే దిశ నుంచి వస్తుంది, దాంతో లోపల గాలి ప్రసరణ అంత బాగా జరగదు. కానీ సన్‌రూఫ్ ఓపెన్ చేస్తే, పైభాగం నుంచి గాలి లోపలికి వచ్చి బయటకు వెళ్ళడం వల్ల వెంటిలేషన్ మెరుగ్గా జరుగుతుంది. ఇది కేవలం గాలి ప్రసరణకే కాదు, కారులోని వేడి త్వరగా తగ్గడానికి హాయపడుతుంది.

ప్రత్యేకంగా వేసవిలో కారు ఎక్కువ సేపు సూర్యరశ్మిలో నిలిపి ఉంచితే లోపల ఉక్కపోతగా ఉంటుంది. అప్పుడు సన్‌రూఫ్‌ను ఓపెన్ చేస్తే, వేడి గాలి పై భాగం నుంచి బయటకు పోయి, క్యాబిన్ వేగంగా చల్లబడుతుంది. ఇంకా ఒక ప్రయోజనం ఏమిటంటే, సన్‌రూఫ్ ద్వారా గాలి ప్రవేశం వల్ల కారు లోపల ఒత్తిడి భావన తగ్గిపోతుంది. ప్రయాణికులు మరింత సుఖంగా, ఫ్రెష్‌గా అనిపిస్తుంది. దూర ప్రయాణాల్లో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Car Sunroof Purpose And Benefits

కాలుష్య కారకాలకు తక్కువ గురికావడం: సాధారణంగా కారు ప్రయాణంలో మనం కిటికీలు తెరిస్తే, బయట ఉన్న పొగ, ధూళి, వాహనాల ఎగ్జాస్ట్ నుండి వచ్చే కాలుష్యం నేరుగా లోపలికి వస్తుంది. ముఖ్యంగా ట్రాఫిక్‌లో నిలబడి ఉన్నప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. వాహనం చుట్టూ ఉత్పత్తి అయ్యే హానికరమైన పొగ, కార్బన్ ఉద్గారాలు ప్రయాణికుల ఆరోగ్యానికి హానికరంగా మారవచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, August 29, 2025, 17:01 [IST]
English summary
Car sunroof purpose and benefits full details inside
Read more on: #auto tips #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+