రవాణా ఖర్ఛులు తగ్గించుకునేందుకు ఉత్తమ మార్గం 'కార్ పూలింగ్'
పెట్రోల్ ధరలు భగ్గుంటున్న ఈ రోజుల్లో వాహనంలో బయటకు వెళ్లాలంటే కాస్తంత ఖర్చుతో కూడుకున్న పనే మరి. అలాగని ప్రత్యామ్నాయ మార్గాల్లో.. అంటే ఆటోరిక్షాలు, కాల్ టాక్సీలు వంటి వాటిలో ప్రయాణిద్దామనుకున్న బిల్లు తడిసి మోపెడవుతుంది. ఇక నిరంతరం రద్దీగా ఉండే సిటీ బస్సుల్లో ట్రావెల్ చేయాలంటే ఎక్కడలేని చిరాకు, అసౌకర్యం అనిపిస్తుంది.
మరి ఇలాంటి పరిస్థితుల్లో.. తమ స్వంత కారునే ఉపయోగిస్తూ.. ఇంధనం ఆదా చేసుకోవటాని ఓ చక్కటి మార్గం ఉంది. అదే 'కార్ పూలింగ్'. కార్ పూలింగ్ అంటే కారును ఇతరులో పంచుకోవటమే (అంటే కారును వేరే వాళ్లకి ఇవ్వటం కాదండోయ్, మీ కారులో వారికి చోటివ్వటం). సింపుల్‌గా చెప్పాలంటే.. మీరు ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లటానికి ఒకే రూట్‌లో ట్రావెల్ చేస్తున్నట్లయతే, అదే రూట్‌లో ట్రావెల్ చేసే ఇతర వ్యక్తులను మీ కారులో పికప్, డ్రాపింగ్ చేయటం ద్వారా వారి నుండి కొంత మొత్తాన్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా చేయటం వలన ఇంధన ఖర్చును అందరూ సమానంగా పంచుకున్నట్లు అవుతుంది.

ఒకవేళ మీరు పికప్, డ్రాపింగ్ చేయాలనుకున్న వ్యక్తి మీ స్నేహితుడో లేక బంధువో అయితే, ఒకరోజు మీ వాహనంలోనూ, మరొక రోజు అతని వాహనంలోనూ వెళ్లటం ద్వారా కూడా ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు. ఇదే సూత్రం టూవీలర్‌కు కూడా వర్తిస్తుంది. దీనినే కార్ పూలింగ్ (కార్ షేరింగ్ కూడా అనొచ్చు), బైక్ షేరింగ్ అంటారు.
మరి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే ఎలా..? మీరు వెళ్లే రూట్లోనే ఇతరులు కూడా ప్రయాణిస్తున్నారని తెలుసుకోవటం ఎలా..? అంటే.. ఇందుకు మా దగ్గర ఓ చక్కని పరిష్కారం ఉంది. డ్రైవ్ స్పార్క్ మాతృ సంస్థ అయిన 'వన్ఇండియా'కు చెందిన ప్రకటనల విభాగం (క్లాసిఫైడ్స్ సెక్షన్) 'క్లిక్ డాట్ఇన్' (Clik.in) ఉచిత క్లాసిఫైడ్ సర్వీస్‌ను అందిస్తుంది.
ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీరు డైలీ ట్రావెల్ చేసే రూట్, మీరు ఉపయోగించే వాహనం (కారు/బైక్ మోడల్ పేరు) తదితర వివరాలతో కూడిన ఓ ఉచిత క్లాసిఫైడ్‌ను ఫిల్ చేయటమే. కేవలం డైలీ ట్రావెల్ చేసే రూట్లే కాకుండా.. ఒకవేళ ఎప్పుడైనా స్పెషల్/లాంగ్ ట్రిప్‌లకు వెళ్తున్నప్పుడు కూడా కార్ పూలింగ్ సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఈ క్లాసిఫైడ్ సర్వీస్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం కోసం 'క్లిక్ డాట్ఇన్' (Clik.in) సందర్శించండి లేదా 080 - 67150880 నెంబర్‌పై మా ప్రతినిధిని సంప్రదించండి.


Click it and Unblock the Notifications








