కారు కింద నీరు లీక్ అవుతుందా?.. అలసత్వం వద్దు వెంటనే ఇలా చేయండి, లేదంటే రిపేర్ ఖర్చుతో మీకు తడిసిపోతుంది!
ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. ఈ సమయంలో మీ కారులో ఏసీ చెడిపోతే లేదా ఏదైనా టెక్నికల్ సమస్యతో ఇబ్బంది పెడితే మీరు కంఫర్ట్‌గా ప్రయాణించలేరు. వేసవి కాలం, చలికాలం, వర్షాకాలం అనే తేడాలు లేకుండా ప్రతీ సీజన్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ సమయంలో మీ కారులో ఏసీ ఉంటే అది మీకు ఓ వరమే అవుతుంది. కారులో కచ్చితంగా ఉండాల్సిన దాంట్లో ఏసీ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం మార్కెట్‌లో విడుదలవుతున్న ప్రతీ కారు ఎయిర్ కండిషనింగ్‌తో వస్తున్నాయి. డ్రైవర్ల కంఫర్ట్‌కి అధిక ప్రాధాన్యతను ఇస్తూ.. పెద్ద పెద్ద లారీలు, ట్రక్కుల్లో సైతం నేడు ఏసీ ఫిట్టింగ్ అనేది కామన్ అయిపోయింది.
ఇక అసలు విషయానికి వస్తే.. మనం ఇళ్లల్లో లేదా షాపులో అమర్చిన ఏసీ నుంచి నీరు కారడం చూసే ఉంటాం. అచ్చం అలాగే కారులోంచి నీరు లీకవడం మీరు ఎప్పుడైనా గమనించారా? మీకు కూడా అలాగే కనిపిస్తే ఆ కారులో కండెన్సేట్ డ్రెయిన్ పైప్ (Car Condensate Drainpipe) బ్లాక్ అయి ఉండవచ్చు. ఈ పైపులో ఏదైనా అడ్డుపడితే నీరు బయటకు వెళ్లకుండా నీరు లీకవుతుంది.

ఈ సమస్యను డ్రెయిన్ పైప్‌ని నొక్కడం లేదా వంచడం వంటివి చేయడం ద్వారా పరిష్కరించవచ్చు. అదే విధంగా స్క్రూడ్రైవర్ కూడా ఆ పైప్‌ని క్లీన్ చేయడంలో సహాయపడుతుంది. మీ కారు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ రిఫ్రిజిరేటర్‌లో లోపం ఉంటే ఈ లీకేజీకి దారితీస్తుంది. వాస్తవానికి రిఫ్రిజిరేటర్ వల్ల ఏసీ సిస్టమ్ పీడనం తగ్గడానికి కారణమవుతుంది. ఇది ఎవాపోర్ కాయిల్స్ గడ్డకట్టడానికి కారణమవుతుంది.
మీ కారు ఏసీ చల్లని గాలికి బదులుగా వేడి గాలిని అందిస్తే రిఫ్రిజిరేటర్ వర్క్ లేదా లెవల్ తక్కువగా ఉందని అర్థం గుర్తించాలి. దీంతో ఈ సమస్యను పరిష్కరించడానికి వీలైనంత త్వరగా దీనిని రీఫిల్ చేయాలి. మీ కారు ఎయిర్ కండీషనర్ నుండి నీరు లీక్ కావడానికి ఒక కారణం కాలక్రమేణా కండెన్సేట్ డ్రెయిన్ పైప్ తుప్పు పట్టడం, అరుగుదలకు దారితీస్తుంది. దీని వల్ల కారు లోపల నీరు లీకవుతుంది.

దీనిని నివారించడానికి ఆ పైపు దెబ్బతిన్నదా లేదా చెక్ చేసుకోవాలి. అవసరం అనిపిస్తే దానిని పూర్తిగా మార్చేయాలి. కండెన్సేట్ డ్రెయిన్ పైప్ అలాగే వెంటిలేషన్ సిస్టమ్ మధ్య సరైన వైరింగ్ కనెక్షన్స్ లేకపోవడం కూడా లీకేజీకి దారితీసే అవకాశం ఉంటుంది. ఈ భాగాలను సరిగ్గా కనెక్ట్ చేయకపోతే నీరు బయటకు వస్తుంది. కావున కండెన్సేట్ డ్రెయిన్ పైపును వెంటిలేషన్ సిస్టమ్ కనెక్షన్‌ని సరిచేస్తే ఈ సమస్య తలెత్తదు.
ఇదే కాకుండా ఏసీ ఎయిర్ ఫిల్టర్లు మూతపడటం వల్ల కూడా నీరు కారుతుంది. దుమ్ము, తేమ పేరుకుపోయి ఎయిర్ ఫిల్టర్లు మూసుకుపోతాయి. ఇది కండెన్సేట్ డ్రెయిన్ పైప్ ద్వారా లీకేజీని పెంచుతుంది. దుమ్ము, ఇతర వ్యర్థాలు పేరుకుపోకుండా ఉండేందుకు ఎయిర్ ఫిల్టర్లను టెక్నీషియన్‌తో క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలి. దీనికి సంబంధించి కారు మాన్యువల్‌లోనూ ఎయిర్ ఫిల్టర్లను క్లీనింగ్‌పై సూచనలు ఉంటాయి.

ముఖ్యంగా మీ కారుని క్రమం తప్పకుండా చెక్ చేయించాలి. కారు లోపలే కాకుండా బయట కూడా నీరు లీక్ అవుతుంది. ముఖ్యంగా కారు ముందు భాగంలో డ్యాష్ బోర్డు దిగువన నీరు లీకయ్యే అవకాశం ఉంది. కొన్ని ఎంపీవీ కార్లలో వెనుక భాగంలో ఏసీ వాటర్ లీకేజీ ఉంటుంది. ఈ కార్లన్నింటిలో వెనుక సీటు కోసం ప్రత్యేక ఏసీ హ్యాండ్లింగ్ యూనిట్ ఉండటం వల్ల వెనక నీరు లీక్ అవుతుంది.
కీలకమైన ఏసీపై అందరూ దృష్టి పెట్టాలి. ఏసీ నుంచి నీరు లీక్ కావడాన్ని చాలా మంది సీరియస్‌గా తీసుకోకపోవడం వల్ల దీర్ఘకాలంలో ఈ సమస్య వేధించే అవకాశం ఉంటుంది. దీంతో మీ ప్రయాణం కంఫర్ట్‌గా అనిపించదు. ఏసీని సక్రమంగా మెయింటైన్ చేయడం ద్వారా ఈ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అలసత్వం వహిస్తే మీ ఖర్చుకి మీరే దగ్గరుండి ఆహ్వానం పలికినట్లు అవుతుంది.


Click it and Unblock the Notifications








