మీ కారు చోరీకి గురైతే అస్సలు బాధ పడొద్దు.. ఇలా చేశారంటే మొత్తం సొమ్ము మీకు వచ్చేస్తుంది.!!

గతేడాది భారత్‌లో కార్లు ఎక్కువగా దొంగతనానికి గురయ్యాయని నివేదికలు వెల్లడించిన విషయం విదితమే. ఇందుకు సంబంధించి వార్తలు వైరల్‌ అయ్యాయి. కాగా దేశ రాజధాని ఢిల్లీలోనే కార్లు ఎక్కువగా చోరీకి గురవుతున్నాయని నివేదికలు(Car Theft India) వెల్లడిస్తున్నాయి. అయితే చోరీకి గురైన కారుకు సంబంధించి మీరు మొత్తం బీమాను క్లెయిమ్‌ చేసుకోవచ్చని తెలుసా.??

ప్రపంచవ్యాప్తంగా కార్ల దొంగతనం అతిపెద్ద సమస్యగా మారింది. అత్యాధునిక టెక్నాలజీ, యాంటీ థెఫ్ట్‌ అలారంతో లక్షల విలువ చేసే కార్లను తయారుచేస్తున్నప్పటికీ.. కొందరు అతి చాకచక్యంగా టెక్నాలజీ ఉపయోగించి నిమిషాల్లో కార్లను యజమానుల్లా డ్రైవ్‌ చేస్తూ పోతున్నారు. ఈ క్రమంలో మీరు కొత్తగా కొనుగోలు చేసిన కారు చోరీకి గురైనట్లయితే.. మీరు ఎలాంటి నష్టం ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.

Car-Theft-Insurance-Claim

మీరు కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు(Car Theft Insurance), దానికి మీరు ఖచ్చితంగా ఇన్సూరెన్స్‌ చేసుకోవాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం థర్డ్ పార్టీ బీమా తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం మోటారు వాహనాల చట్టం ప్రకారం.. నష్ట బీమా, సమగ్ర బీమా అనే రెండు రకాల బీమాలు ఉన్నాయి. వాహనం యొక్క పూర్తి రక్షణ కోసం చాలా మంది సమగ్ర బీమాను సెలెక్ట్‌ చేసుకుంటారు.

ఇన్సూరెన్స్ అనేది మీకు ఏ రకమైన నష్టాన్ని అయినా భర్తీ చేయడానికి ఉద్దేశించబడినది. ఇన్సూరెన్స్‌ చేయబడిన మీ కారు చోరీకి గురైనట్లయితే.. మీరు బీమా సొమ్మును క్లెయిమ్ చేసే హక్కు మీకు ఉంటుంది. అంటే మీరు వాహనం డ్యామేజ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, మీ కారు దొంగతనానికి గురైతే ఆ ఇన్సూరెన్స్‌ కింద మీరు బీమా సొమ్మును క్లెయిమ్ చేసుకోలేరు.

Car-Theft-Insurance-Claim

ఒకవేళ మీరు సమగ్ర బీమా కింద వాహనాన్ని ఇన్సూరెన్స్‌(Comprehensive Insurance) చేసినట్లయితే, మీ వాహనం దొంగిలించబడిన తర్వాత మీరు పోలీసు రిపోర్ట్‌ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. పోలీసులు మీ వాహనాన్ని గుర్తించడానికి చర్యలు తీసుకుంటారు. ఏదో ఒక సమయంలో మీ వాహనాన్ని గుర్తించలేకపోతే, పోలీసులు దానికి సంబంధించిన రుజువును మీకు అందజేస్తారు.

దీంతో మీరు బీమా సొమ్మును క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా, మీరు క్లెయిమ్ చేసినప్పుడు, సమగ్ర బీమాలో మీకు కేటాయించిన పూర్తి మొత్తాన్ని మీరు పొందగలుగుతారు. సమగ్ర బీమా తీసుకునేటప్పుడు మీరు ఇన్‌వాయిస్ రిటర్న్ ఎంపికను ఎంచుకుంటే మీరు మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.

అంటే మీరు కారును కొనుగోలు చేసినప్పుడు మీకు జారీ చేయబడిన ఇన్‌వాయిస్‌లో పేర్కొన్న మొత్తానికి సమగ్ర బీమాను సంస్థ అందిస్తుంది. ఈ విధంగా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు మీకు ఎలాంటి నష్టం కలగకుండా మీరు ఇన్‌వాయిస్‌లో పేర్కొన్న మొత్తం పూర్తి వాపసు పొందవచ్చు.

ఇలా మీరు కొనుగోలు చేసిన కారు చోరీకి గురైనట్లయితే.. మీరు బాధపడాల్సిన అవసరం లేకుండా ముందుగానే సమగ్ర బీమా చేసుకోండి. మీరు సమగ్ర బీమా తీసుకున్నప్పుడు రిట్టర్ ఆఫ్ ఇన్‌వాయిస్ ఎంపికను ఎంచుకోవడం వాహనాన్ని బీమా చేయడానికి ఉత్తమ మార్గమని గుర్తుంచుకోవాలి. దీనికి ఇన్సూరెన్స్‌ ప్రీమియం ఎక్కువగా ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, March 18, 2024, 9:12 [IST]
English summary
Claim process comprehensive policy vehicle insurance for a stolen car here all you need to know
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+