మీ కారు మైలేజ్ తక్కువగా ఇస్తుందా.?? అందుకు ప్రధాన కారణమిదే.. ఇప్పుడే ఈ చిట్కాలు పాటించండి.!!
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ. 100 దాటడమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో రూ.110 కి పైగానే ఉంది. ఇక డీజిల్ ధరలు కూడా తగ్గడం లేదు. అందుకే కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునేటప్పుడు కస్టమర్లు ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ కారు కొన్నాక.. ఆ జాగ్రత్తలు మరిచిపోతున్నారు.
సాధారణంగా ఎవరైనా సరే కారు కొనేముందు ధర, మైలేజ్, నాణ్యత, ఫీచర్లను పరిశీలిస్తారు. కానీ వీటిలో అన్నిటికంటే ముఖ్యమైనది మైలేజ్. పెరుగుతున్న ఇంధన ధరల దృష్ట్యా అధిక మైలేజ్ ఇచ్చే కార్ల వైపే కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. అందుకు అనుగుణంగా కార్ మేకర్లు(Car Mileage) సైతం అధిక మైలేజ్ ఇచ్చే కార్లను తయారుచేసేందుకు యత్నిస్తున్నాయి.

అయితే కొంతమంది అప్పుడప్పుడూ కార్లను బయటకు(Car Mileage Tips) తీస్తుంటారు. మరి కొంతమందికి ప్రతిరోజూ కారు బయటకు తీయనిదే నడవదు. ముఖ్యంగా ఉద్యోగస్థులు, క్యాబ్, ట్యాక్సీ నడిపేవారికి, లాంగ్ జర్నీలు చేసేవారికి ఇది తప్పనిసరి. ఈ తరహా వ్యక్తులు అధిక మైలేజ్ ఇచ్చే కార్ల వైపు మొగ్గు చూపుతారు. కానీ అలా కొనుగోలు చేసినంత మాత్రాన సరిపోతుందా.?? కారు కొన్న తర్వాత ఎప్పుడూ అదే మైలేజ్ ఇస్తుందని చెప్పగలమా.??
అలా చెప్పడం కష్టం. ఎందుకంటే కారు ఎల్లప్పుడూ అధిక మైలేజ్‌తోనే నడుస్తుండాలంటే.. మీ కారును రోజూ శుభ్రం చేసుకోవాలని తెలుసా.?? మీ కారును లోపలా బయటా దుమ్ము కనబడకుండా నిత్యం శుభ్రంగా ఉండేలా చూసుకుంటేనే చూడగానే మీకు ఫ్రెష్ ఫీల్‌ను ఇస్తుంది. అంతే కాకుండా మీ కారు మైలేజ్ కూడా పెరుగుతుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ.. అందుకు కారణాలివే.!!

అవును మీరు మీ కారును శుభ్రం చేసి శుభ్రంగా ఉంచుకుంటే మీ మైలేజ్ పెరుగుతుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఇందుకోసం 2009లో అమెరికాలోని మైత్ బస్టర్ అనే సంస్థ పరిశోధనలు నిర్వహించింది. ఈ అధ్యయనంలో రెండు ఒకేలాంటి కార్లను ఉపయోగించి పరిశీలించారు. అంటే అదే కంపెనీకి చెందిన అదే మోడల్ కార్లను ఒకటి శుభ్రంగా, మరొకటి మురికిగా చేశారు.
నైపుణ్యం ఉన్న డ్రైవర్లు ఈ కార్లను నడిపారు. ఈ రెండు కార్లు దాదాపు ఒకే విధమైన రోడ్లపై ఒకే విధమైన ప్రయాణాన్ని ప్రారంభించాయి. వారు ఒకే దూరం ప్రయాణించారు. ఇలా రెండు కార్లను ఒకే పద్ధతిలో నడిపి చాలా సేపు పరీక్షించారు. అయితే ప్రతి ట్రిప్ తర్వాత క్లీన్‌గా ఉన్న కారును మళ్లీ క్లీన్ చేస్తున్నారు. కానీ డర్టీ కారును ఎలాంటి క్లీనింగ్ చేయకుండా అలాగే ఉపయోగించారు.
ఈ సందర్భంలో, ఈ రెండు కార్ల మైలేజీపై అధ్యయనం చేశారు. ఇందులో, రెండు కార్లకు గ్యాసోలిన్ ధర లెక్కిస్తారు. ఆ తర్వాత రెండు వాహనాలు ఎంత దూరం ప్రయాణించాయో దానితో పోల్చుతారు. ఈ పరిశోధనలో చాలా ముఖ్యమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కారు మైలేజ్ దాని డిజైన్ ద్వారా నిర్ణయించబడుతుందని తేలింది. కారు మంచి మైలేజీని ఇచ్చేలా కారు డిజైనర్లు కారును డిజైన్ చేస్తారు.
కారు వేగాన్ని పెంచుతున్నప్పుడు, కారు గాలిని చీల్చడం వల్ల కారు వేగం తగ్గకుండా ఉండేందుకు కొన్ని డిజైన్లు ఉన్నాయి. కారులో చిన్న చిన్న డిజైన్ల వెనుక కూడా కారణాలు ఉన్నాయి. ఇది ప్రధానంగా ఏరోడైనమిక్స్‌తో అత్యంత ముఖ్యమైన అంశంగా రూపొందించబడింది. ఈ సమయంలో, కారు చాలా ధూళితో నిండినప్పుడు ఈ డిజైన్ పనిని చేయదు. ఇది మైలేజ్‌పై ప్రభావం చూపిస్తుంది.
ఇలా కారును మురికిగా ఉంచడం వల్ల మీ కారు మైలేజీపై నేరుగా ప్రభావం పడుతుంది. అంటే ఎప్పటికప్పుడు కారును క్లీన్ చేసి శుభ్రంగా ఉంచుకుంటే మీకు లాంగ్ డ్రైవ్‌లలో కారు మంచి మైలేజీని ఇస్తుంది. దేశంలో చాలా మంది వాహనదారులు తమ కారును శుభ్రంగా ఉంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ కొందరు మాత్రం ఇవేమీ పట్టించుకోరు. ఇక నుంచి మీరు ఈ చిట్కాను పాటించిట్లయితే మీ కారు అధిక మైలేజ్‌తో దూసుకుపోతుంది.


Click it and Unblock the Notifications








