కారులో ఎవరు లేనప్పుడే ఇలా చేయండి.. లేకపోతే మీ కారుతో పాటు మీరు ప్రమాదంలో పడిపోతారు..!

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ వాహనాలతో పాటు CNGల అమ్మకాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో పెట్రోల్ బంకుల్లో సీఎన్‌జీ ఇంధనాన్ని నింపే సౌకర్యాలు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని బంకులు అయితే ప్రత్యేకంగా సీఎన్‌జీ వాహనాల కోసమే పనిచేస్తున్నాయి. ఇంధనాలను వాహనాల్లో నింపే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఎక్కువ మంది పెట్రోల్, డీజిల్ వాహనాల విషయంలో ఎలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసు. అయితే CNGని కూడా వాహనంలో నింపే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. దీనికి సంబంధించిన నిబంధనలు కూడా ఉన్నాయి. కానీ వీటి గురించి అవగాహన తక్కువగా ఉంటుంది. అందుకోసమే సీఎన్‌జీ వాహనాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో క్రింది కథనంలో వివరించడం జరిగింది.

CNG ఇంధనాన్ని కారులో నింపుతున్న సమయంలో లోపల కూర్చున్న వారు, అలాగే డ్రైవర్‌తో పాటు నింపే వ్యక్తి కూడా కొన్ని రక్షణ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. భద్రతా కారణాల కారణంగా డ్రైవర్‌తో పాటు, లోపల కూర్చున్న ప్రయాణికులు గ్యాస్‌ని నింపుతున్నప్పడు బయటకు రావాలి. ఇది అందరూ చేపట్టాల్సిన మొదటి పని.

Cng Vehicle Refuelling

గ్యాస్‌ వాహనంలోకి వెళ్తున్న సమయంలో కొంత పీడనానికి గురవుతూ ఉంటుంది. దీంతో అది లీక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి లోపల కూర్చున్న వారు దాన్ని పీల్చినట్లయితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా లీక్ అయిన గ్యాస్ కారు లోపల వ్యాపించి అగ్ని ప్రమాదానికి గురయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా అందరూ వాహనం నుంచి బయటకు రావడం ఉత్తమం.

రీఫ్యూయలింగ్ సమయంలో పైపులో లేదా వాల్వ్‌లో ఏదన్నా చిన్న డ్యామేజ్ ఉన్న కూడా అది లీక్ అవుతుంది. కారు లోపల బ్యాటరీ వంటి వాటికి గ్యాస్ చేరి మంటలు చెలరేగే అవకాశం ఉంది. దీంతో లోపల కూర్చున్న వారి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే బయట ఉండటం వల్ల ఒకవేళ ప్రమావం జరిగిన కూడా గాయపడే లేదంటే మరణించే అవకాశం తక్కువగా ఉంటుంది.

Cng Vehicle Refuelling Safety Precautions

ఒకవేళ కారులో గ్యాస్ నింపుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగిన కూడా బయట ఉండటం వలన అక్కడి నుంచి పారిపోయి తమ ప్రాణాలను రక్షించుకోవచ్చు. బయట వేచి ఉన్నట్లయితే గాయాల ప్రభావం కూడా తక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు వాహనాల్లో CNG లను నింపుతున్నప్పుడు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలు రూపొందించారు.

ప్రతి ఒక్కరు కూడా వీటిని పాటించాల్సిందే. లేదంటే చట్ట ప్రకారం, శిక్షిస్తారు కూడా. CNG ని నింపుతున్న సిబ్బంది కూడా తప్పనిసరిగా రక్షణ సూత్రాలు పాటించాలి. కారు యజమానికి ఈ నిబంధనలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఆ సిబ్బందిపై ఉంటుంది. గ్యాస్ నింపే టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగానే సిబ్బందికి ట్రైనింగ్ తప్పనిసరిగా ఇస్తారు.

ప్రమాదాలను నివారించడానికి సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తారు. పెట్రోల్ బంకుల వద్ద ఉన్నటువంటి CNG నింపే వారికి కారు యజమానులు, ప్రయాణికులు తప్పనిసరిగా సహకరించాలి. ఎందుకంటే ఏ చిన్న తప్పు జరిగిన కూడా ఊహించని ప్రమాదాన్ని అందరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్షణ నిబంధనలు పాటించాలి.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, November 24, 2024, 9:10 [IST]
English summary
Cng vehicle refuelling safety precautions here the full details
Read more on: #auto
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+