డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మానుకోవాల్సిన అలవాట్లు

By Ravi

డ్రైవింగ్ అనేది ఓ మంచి అనుభూతిగా మిగిలిపోవాలే కాని, జీవితాల్లో మాయని మచ్చగా, తీర్చలేని లోటుగా మారకూడదు. సాధారణంగా, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొన్ని పనులు చేయకూడదు. ఈ పనులు చిన్నవే అయినప్పటికీ, వీటి వలన కలిగే ప్రమాదం మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది. ప్రతినిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ డ్రైవర్ల తప్పిదాల కారణంగా జరుగుతున్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

ఈ చిన్న చిన్న తప్పులను మానుకున్నట్లయితే రోడ్లపై సురక్షితంగా ప్రయాణించి మీపై ఆధారపడిన వారికి మీరు కలకాలం అండగా నిలిచే అవకాశం ఉంటుంది. వాస్తవానికి తెలిసి తెలిసి ఎవరూ తప్పులు చేయరు. కానీ, కొన్ని సందర్భాల్లో చిన్నపాటి ఏమరపాటు, నిర్లక్ష్యం కూడా పెను ప్రమాదాలకు కారణమవుతుంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మానుకోవాల్సిన కొన్ని అలావాట్లు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మానుకోవాల్సిన అలవాట్లు

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మానుకోవాల్సిన అలవాట్లు

సాధారణంగా డ్రైవింగ్ చేస్తున్నప్పు కొందరు వాహనాన్ని నడుపుతూనే, కొన్ని పనులు చేస్తుంటారు. ఇలాంటి కొన్ని చర్యలే భవిష్యత్తులో అలవాట్లుగా మారిపోతాయి. ఈ అలవాట్ల వలన పెను ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. అవేంటో ఈ ఆర్టిక్‌లో తెలుసుకుందాం..!

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మానుకోవాల్సిన అలవాట్లు

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మానుకోవాల్సిన అలవాట్లు

టెయిల్‌గేటింగ్

టెయిల్‌గేటింగ్ అంటే, మీ ముందుగా వెళ్తున్న వాహనానికి అతి సమీపంలో మీరు కూడా డ్రైవ్ చేయటం. వేగంగా వెళ్తున్నప్పుడు టెయిల్‌గేటింగ్ చేయటం వలన ఘోర ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ ముందుగా వెళ్తున్న వాహనంలోని డ్రైవర్ హఠాత్తుగా బ్రేకులు వేసినట్లయితే ప్రమాదం జరగవచ్చు. కాబట్టి, ఎప్పుడు కూడా మీ ముందుగా వెళ్తున్న వాహనాని అతి సమీపంలో వెళ్లకుండా, వీలైనంత దూరాన్ని మెయింటైన్ చేస్తూ డ్రైవ్ చేస్తే మీ ప్రయాణం మరింత సురక్షితమవుతుంది.

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మానుకోవాల్సిన అలవాట్లు

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మానుకోవాల్సిన అలవాట్లు

డ్రైవింగ్‌‌లో సెల్ ఫోన్ వాడటం

వాహనాన్ని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ వంటి పరికరాలను ఉపయోగించడం వలన ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది, పైగా ఇది చట్టరీత్యా నేరం కూడా. ఒక్క చేతితో స్టీరింగ్‌ను కంట్రోల్ చేస్తూ మరొక చేతితో సెల్ ఫోన్‌ను పట్టుకొని మాట్లాడటం, ఎస్ఎమ్ఎస్‌లు పంపించడం మొదలైనవి చేయటం వలన మీ దృష్టి రోడ్డుపై నుండి మరలిపోయి మిమ్మల్ని పరధ్యానానికి గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్‌ను వినియోగించరాదు. మరీ అత్యవసరమైన ఫోన్ కాల్ అనిపిస్తే, వాహనాన్ని పక్కగా నిలిపి, హజార్డ్ లైట్స్ ఆన్ చేసి ఫోన్ కాల్‌ను ఆన్సర్ చేయాలి.

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మానుకోవాల్సిన అలవాట్లు

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మానుకోవాల్సిన అలవాట్లు

ఓవర్ స్పీడింగ్

మితిమీరిన వేగంతో పరిమితి మించి వాహనాన్ని నడపటం మంచిది కాదు. ఇది కూడా చట్టరీత్యా నేరమే. వేగంగా వెళ్తున్న వాహనాన్ని కంట్రోల్ చేయటం, సదరు వాహనాన్ని అత్యధిక వేగాన్ని తీకువెళ్లినంత సులువు కాదు. వేగంలో కొన్నిసార్లు బ్రేక్ ఫెయిల్ అయ్యి పెను ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. మీ దగ్గర వేగంగా వెళ్లే కారు ఉన్నప్పటికీ, అనుమతించబడే వేగంతో వాహనాన్ని నడిపితేనే సురక్షితంగా ప్రయాణించగలరనే విషయాన్ని మీరు గ్రహించాలి.

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మానుకోవాల్సిన అలవాట్లు

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మానుకోవాల్సిన అలవాట్లు

సీట్ బెల్టు పెట్టుకోకపోవటం

సీట్ బెల్టు పెట్టుకోకపోవటమంటే యమపాశానికి బలవ్వటమే. అత్యవసర సమయాల్లో సీట్ బెల్టులు డ్రైవర్ల ప్రాణాలను కాపాడుతాయి. అనేక ప్రమాదాల్లో సీట్ బెల్టులు ఎంతో మంది డ్రైవర్ల ప్రాణాలను నిలబెట్టాయి. మీకు తెలుసా, యాక్సిడెంట్ జరిగే సమయంలో కారులో ఉండే ఎయిర్‌బ్యాగ్ ఓపెన్ అవ్వటానికి, డ్రైవర్ పెట్టుకునే సీట్ బెల్టుకు సంబంధం ఉంటుందని..? ఇది నిజం. ఎయిర్‌బ్యాగ్ విచ్చుకునే వేగం సీట్ బెల్ట్‌పై కూడా ఆధారపడి ఉంటుంది. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో డ్రైవర్, ప్యాసింజర్లు సీట్ బెల్టులు ధరించటం తప్పనిసరి.

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మానుకోవాల్సిన అలవాట్లు

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మానుకోవాల్సిన అలవాట్లు

రోడ్డుపై అనవసరమైన గొడవలు

ఎవరో ఓవర్‌టేక్ చేశారోనో లేదా అవతలి డ్రైవర్లు సరిగ్గా డ్రైవ్ చేయటం లేదనో ఇలా చిన్న చిన్న కారణాల చేత రోడ్డుపై తెలియని వ్యక్తులతో గొడవకు దిగటం మంచి కాదు. కోపానికి మించిన శత్రువు లేదనే విషయం మనకు తెలిసినదే. కోపంలో అవతలి వాళ్లు ఎంతకైనా తెగించవచ్చు. చివరికి నష్టపోయేది మాత్రం మనమే అనే విషయాన్ని గ్రహించుకోవాలి. రోడ్డుపై ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే వాటిని కోపంతో కాకుండా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి.

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మానుకోవాల్సిన అలవాట్లు

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మానుకోవాల్సిన అలవాట్లు

మద్యం సేవించి డ్రైవ్ చేయటం

మద్య సేవించి డ్రైవ్ చేయటం అత్యంత ప్రమాదకరం. మద్యం మనిషి మెదడును పనిచేయకుండా చేసి, ప్రమాదాలకు కారణమవుతుంది. ఇది చట్టరీత్యా నేరం కూడా. మద్యం సేవించి డ్రైవ్ చేస్తూ దొరికిపోతే భారీ జరిమానాలను చెల్లించుకోవటమే కాకుండా, జైలుశిక్షను కూడా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను మద్యం సేవించి వాహనం నడపకూడదు.

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మానుకోవాల్సిన అలవాట్లు

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మానుకోవాల్సిన అలవాట్లు

రోడ్డుపై దృష్టి సారించకపోవటం

వాహనం నడుపుతున్నప్పుడు రోడ్డుపై దృష్టిని పెట్టకుండా, పక్కల ఉన్న అందాలను, వస్తువులను చూస్తూ ఆకర్షణకు లోనైతే రోడ్డెక్కాల్సిన డ్రైవర్ అంబులెన్స్ ఎక్కాల్సి వస్తుంది. రోడ్డుపై వాహనం నడుపుతున్నప్పుడు పరధ్యానానికి గురై ఇతర విషయాల గురించి ఆలోచిస్తే ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి, వాహనం నడిపేటప్పుడు ఎంతో శ్రద్ధగా, రోడ్డుపై మాత్రమే దృష్టి పెట్టాలి.

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మానుకోవాల్సిన అలవాట్లు

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మానుకోవాల్సిన అలవాట్లు

ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవటం

ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా రెడ్ సిగ్నల్ ఆన్‌లో ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా సిగ్నల్ క్రాస్ చేయటం, రాంగ్ రూట్లలో డ్రైవ్ చేయటం, వన్‌వేలో నడపటం, పరిమితికి మించిన వేగంతో ప్రయాణించటం మొదలైన ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కూడా ప్రమాదానికి కారమవుతుంది. కాబట్టి ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించండి.

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మానుకోవాల్సిన అలవాట్లు

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మానుకోవాల్సిన అలవాట్లు

ఇవే కాకుండా, వాహనం చేస్తున్నప్పుడు తినుబండాలు తీసుకోవటం, ఆడియో సిడిలను ఛేంజ్ చేయటం, పక్కవారితో అనవసరమైన సంభాషణలు చేయటం, ఒకే చేతితో స్టీరింగ్‌ను కంట్రోల్ చేయటం మొదలైన అనేక అలవాట్లు ప్రమాద హేతువులని గుర్తించుకోవాలి. కాబట్టి, ఈ అలవాట్లను మానుకొని సురక్షితంగా ప్రయాణించగలరని డ్రైవ్‌స్పార్క్ కోరుకుంటోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, April 2, 2013, 13:12 [IST]
English summary
Driving is generally considered a pleasurable experience. But pleasure can turn to pain if you are involved in a road accident. Research has indicated that most accidents are caused by mistakes of drivers. There are several common habbits that while appearing normal, can cause a fatal accident. We thought of looking in to some of the habbits that are best avoided while driving.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+