వానాకాలంలో మీ బండ్లను భద్రంగా కాపాడుకోండి.. లేదంటే రిపేర్‌ తప్పదు.. ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి!

దేశంలో రుతుపవనాల రాకతో ఇప్పుడిప్పుడే వర్షాలు ఊపందుకుంటున్నాయి. దేశంలోని పలు ముఖ్య నగరాలు, ఇతర పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ విరివిరిగా వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం జూలై తర్వాత జరుగుతుంది. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు వచ్చి చేరుతుంది. ఈ సమస్య వర్షాకాలం ముగిసే వరకు ఉంటుంది. ఈ వర్షాల భారీనుంచి మనల్నీ రక్షించుకోవడమే కాకాండా వాహనాలను మనం ఎంతవరకు జాగ్రత్తగా కాపాడాతున్నామనేదే ఇక్కడ ప్రశ్న.

కొన్ని ప్రాంతాల్లో గంట పాటు వర్షం కురిసినా మోకాలి లోతు నీరు నిలిచిపోతుంది. అలాంటి రోడ్లపై వాహనాలు నడపడం వల్ల నష్టం వాటిల్లుతుంది. ఆ నీటిలోనే డ్రైవింగ్‌ చేయడం వల్ల వాహనాలు కొంత డ్యామేజ్ అవుతాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు కొన్ని భాగాలు పనిచేయడం ఆపేస్తాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. వర్షపు నీటి కారణంగా ద్విచక్ర వాహనాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఒకసారి పరిశీలిద్దాం.

Control-Two-Wheelers-Damage-In-Rainy-Season

ఇంజిన్ మరియు ఎగ్జాస్ట్ పైప్: వర్షపు నీటితో నిండిన రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంజిన్ మరియు దాని నుండి పొగను విడుదల చేసే ఎగ్జాస్ట్ పైప్ ద్విచక్ర వాహనాలకు ప్రధాన నష్టం చేకూరుస్తుంది. ఎందుకంటే ఈ రెండింటిలో చాలా వరకు రంధ్రాలు ఉంటాయి. ఎగ్జాస్ట్ ట్యూబ్ నిండా ఇంకా రంధ్రాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఇంజిన్ వ్యవస్థలో గాలి ప్రవేశించడానికి రంధ్రాలు ఏర్పాటు చేస్తారు.

వాటి గుండా వర్షపు నీరు ప్రవేశించినప్పుడు తుప్పు పట్టడంతో సహా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా, స్పార్క్ ప్లగ్ దెబ్బతినడం వల్ల మీరు టూ వీలర్ స్టార్ట్ చేయలేకపోవచ్చు. ద్విచక్రవాహనం ఇంజిన్ వ్యవస్థలో హైడ్రోలాక్ సమస్య తలెత్తితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇంజిన్ సిలెండర్ లోపల నీరు ఉన్నప్పుడు టూ వీలర్ స్టార్ట్ చేయడం వల్ల పీడనం ఏర్పడుతుంది దీనివల్ల ఇంజిన్ పూర్తిగా ఆగిపోతుంది.

Two-Wheelers-Damage-In-Rainy-Season

ఎలక్ట్రికల్ పార్ట్స్: వర్షపు నీరు నిలిచిన ప్రాంతంలో ద్విచక్ర వాహనాన్ని ఎక్కువ సేపు పార్కింగ్ చేయడం వల్ల ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ వరకు నీరు వెళ్లే అవకాశం పెరుగుతుంది. ముఖ్యంగా నేటి ఆధునిక ద్విచక్ర వాహనాల్లో అందించే సెన్సార్లు నీటిలో త్వరగా పాడైపోతాయి. ద్విచక్రవాహనంపై సరఫరా చేసే వైర్ల లోపల ఉన్న లోహం కూడా వర్షపు నీటితో తుప్పు పట్టే అవకాశం ఉందని మర్చిపోవద్దు.

నేటి ద్విచక్ర వాహనాలు ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అధునాతన టెక్నాలజీతో అందిస్తున్నారు. వాటిని తయారు చేసేటప్పుడు నీటితో పరీక్షించినప్పటికీ, ద్విచక్రవాహనం వర్షపు నీటిలో ఎక్కువసేపు నిలబడినప్పుడు ఈ సాంకేతిక భాగాలు కూడా దెబ్బతింటాయి. ట్రాక్షన్ కంట్రోల్ వంటి సాంకేతిక పరిజ్ఞానం దెబ్బతింటే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

Bike-Damage-IN-Rains

ఇంజిన్ భాగాలు: ద్విచక్ర వాహనాల బ్రేకులు వర్షపు నీటితో నేరుగా ప్రభావితమవుతాయి. ద్విచక్ర వాహనం యొక్క బ్రేక్ సిస్టమ్‌లోని కాలిపర్లు, డిస్క్‌లు లేదా వీల్‌బేరింగ్‌లు దెబ్బతినడం వల్ల పెద్ద ప్రమాదం సంభవించవచ్చు. వర్షపు నీరు నిలిచిన ప్రాంతం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బ్రేక్ సిస్టమ్ నుంచి నీరు లీకైనట్లు గమనించినట్లయితే వెంటనే మెకానిక్ షాపుకు వెళ్లి సరిచేయించుకోవాలి.

ఎందుకంటే బ్రేక్ ప్యాడ్లు ఎక్కువ సేపు నీటిలో ఉంటే తుప్పు పట్టే అవకాశం ఉంది. ఇది ఒక పాయింట్‌లో బ్రేక్ ప్యాడ్‌లు విరిగిపోవడానికి దారితీస్తుంది. అదేవిధంగా ద్విచక్రవాహనం చైన్‌, స్ప్రాకెట్ కూడా వర్షపు నీటిలో దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా వర్షపు నీరు చైన్‌లో చేరితే చైన్‌ జీవితకాలం తగ్గి త్వరగా విరిగిపోతుంది. అలాగే, వర్షాకాలంలో సస్పెన్షన్ ఫోర్క్ సీల్స్, షాక్ అబ్జార్బర్లు మొదలైన వాటిని తనిఖీ ఎప్పటకప్పుడు తనిఖీ చేయాలి.

More from DriveSpark

Article Published On: Sunday, July 14, 2024, 10:12 [IST]
English summary
Control your two wheelers damage in rainy season by using these tips
Read more on: #bikes #two wheelers #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+