కరోనా మళ్ళీ విజృంభిస్తోంది! మీ కారులో కరోనా రిస్క్ తగ్గించేందుకు ఇలా చేయండి
కరోనా మహమ్మారి మళ్లీ భారతదేశం మొత్తం వ్యాప్తి చెందుతోంది. గతంలో దీని కారణంగా ఎంతో మంది మరణించారు. తీరిగి అలాంటి రోజుల రాకుండా చూడటానికి అధికారులు కూడా తీవ్ర అప్రమత్తంగా ఉన్నారు. చాపకింద నీరులా కరోనా నెమ్మదిగా దేశంలోని ప్రముఖ నగరాలకు విస్తరిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, రోడ్డుపై రోజూ ప్రయాణించే వారు, ముఖ్యంగా ఆటో, క్యాబ్, ట్రక్ లేదా బస్సులు నడిపే డ్రైవర్లు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. రోడ్లపై గంటల తరబడి ప్రయాణించాల్సిన డ్రైవర్లు రోజూ అనేకమంది ప్రయాణికులతో సంబంధం పెట్టుకుంటారు. అందుకే కొంతమంది డ్రైవర్లు ఇప్పటికే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మాస్క్ ధరించడం, వాహనాన్నిశుభ్రంగా ఉంచడం, కస్టమర్లు దిగిన తరువాత హ్యాండ్ సానిటైజర్ వాడటం వంటి చర్యలు తీసుకుంటున్నారు. అయితే, ఇంకా చాలామందికి ఏం చేయాలో స్పష్టంగా తెలియక అయోమయంలో ఉన్నారు. కొందరికి ఇది చిన్న విషయంగా అనిపిస్తున్నా, నిజానికి ఇది చాలా కీలకమైన దశ. చిన్న జాగ్రత్తలు చాలా పెద్ద ప్రమాదాన్ని నివారించగలవు. ముఖ్యంగా వాహనంలో ప్రయాణికులు దిగిన తరువాత, సీట్లు, తలపైన హ్యాండిల్ పట్టే భాగాలను శుభ్రం చేయాలి.

డ్యాష్‌బోర్డ్ వంటి ఉపరితలాలపై కూడా వైరస్ నిలవవచ్చు కాబట్టి అవి కూడా శుభ్రపరచాలి. ప్రయాణికులకు కూడా సానిటైజర్ అందుబాటులో ఉంచడం మంచిది. వాహనంలో గాలి బాగా వచ్చేలా కిటికీలను కొంతవరకూ తెరిచి ఉంచడం ద్వారా వాతావరణాన్ని ఆరోగ్యంగా ఉంచొచ్చు. ఏ పరిస్థితిలోనూ మాస్క్ తొలగించకుండా, కస్టమర్లకు కూడా దాన్ని ధరించమని కోరడం వల్ల మేలే జరుగుతుంది. వారానికి ఒకసారైనా వాహనాన్ని డీప్ క్లీనింగ్ చేయించడం బెస్ట్.
రోజుకు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతున్న ఈ సమయంలో, ప్రభుత్వం మరింత అప్రమత్తమై చర్యలు తీసుకుంటోంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అనేక రకాల ఆంక్షలు విధించబడ్డాయి. అయినా, ప్రతి ఒక్కరి వ్యక్తిగత జాగ్రత్తలే ఈ మహమ్మారిని అడ్డుకునే ప్రధాన ఆయుధంగా నిలుస్తున్నాయి. ఇలాంటి తరుణంలో, వ్యక్తిగతంగా ప్రయాణించే వారు, ముఖ్యంగా కారుతో ప్రయాణించే వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

చాలామందికి తప్పుగా ఉండే అభిప్రాయం ఏమిటంటే, వ్యక్తిగత వాహనంలో ప్రయాణిస్తే మాస్క్ అవసరం లేదని భావించడం. కానీ ఇది పూర్తిగా అపోహ. లోపల ఉండే గాలి కొన్ని సమయాల్లో బయట గాలితో కలిసిపోదు. మీరు ఒంటరిగా లేక కుటుంబసభ్యులతోనే ప్రయాణిస్తున్నా, ఎప్పుడూ మాస్క్‌ను మర్చిపోవద్దు. ముఖ్యంగా ఇతర వ్యక్తులు మీ వాహనంలోకి ఎక్కబోతున్నట్లయితే, మాస్క్ తప్పనిసరి. ఇది కేవలం మీ రక్షణ కోసమే కాదు, ఇతరుల భద్రత కోసమూ కావాలి.
ఇక వాహన శుభ్రత కూడా చాలా కీలకం. ప్రతిసారీ ప్రయాణం మొదలుపెట్టేముందు, మీ కారు సీట్లు, డోర్ హ్యాండిల్స్, స్టీరింగ్, గేర్ లీవర్, విండో కంట్రోల్ బటన్‌లు వంటి ముట్టుకునే ప్రదేశాలను శానిటైజ్ చేయాలి. వైరస్ కణాలు ఈ ఉపరితలాలపై నిలిచి ఉండే అవకాశముంది, కాబట్టి అలాంటి ఏరియాలపై శ్రద్ధ వహించాలి. అలాగే, కారులో ఎప్పటికప్పుడు వినియోగించుకునేందుకు హ్యాండ్ శానిటైజర్‌ను ఉంచుకోవాలి.

ఇంకా, వాహనంలో గాలి సక్రమంగా ఉండేలా కిటికీలను కొంతవరకు తెరిచి ఉంచడం మంచిది. ఏసీ నడుపుతున్నా, ఫ్రెష్ ఎయిర్ మోడ్‌లో ఉంచడం వల్ల కారులోని గాలి చక్కగా బయటకు వెళ్లి కొత్త గాలి లోపలికి వస్తుంది. ఇది వైరస్ సాంద్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ చిన్న చిన్న చర్యలే, మన ఆరోగ్యాన్ని కాపాడటంలో పెద్ద పాత్ర వహిస్తాయి. మాస్క్ ధరించడం, శానిటైజర్ వినియోగించడం, వాహనాన్ని శుభ్రంగా ఉంచడం బాధ్యతగా చేయాలి.
కారులో ఎల్లప్పుడూ కొన్ని తాజా మాస్క్‌లను ఉంచుకోండి, మీరు ఒకే మాస్క్‌ను ఎక్కువసేపు ఉపయోగించకూడదు. మీరు దానిని అలా ఉపయోగించినప్పటికీ, అది మీకు మరిన్ని సమస్యలను కలిగించే అవకాశం ఉంది. అదే సమయంలో, మీ కారును ఎప్పటికప్పుడు పూర్తిగా శుభ్రం చేయండి. కరోనా కష్టకాలం మళ్లీ ముంచొస్తున్న ఈ వేళ, మన జాగ్రత్తలే మన ఆయుధాలు కావాలి.


Click it and Unblock the Notifications








