మీ లాంగ్ డ్రైవ్‌కి డీజిల్ లేదా పెట్రోల్ కారు.. ఏది బెస్ట్.?
దేశంలో లాంగ్ డ్రైవ్‌లకు సరైన వాహనాన్ని ఎంచుకోవడం చాలా కష్టమైన పని. ఇందులో మైలేజ్, మెయింటెనెన్స్ కాస్ట్, పొల్యూషన్, పర్యావరణంపై ప్రభావం ముఖ్యమైనవి. అయితే, ఇది ప్రధానంగా డీజిల్ మరియు పెట్రోల్ కార్ల మధ్య చర్చకు వస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ధర: పెట్రోల్, డీజిల్ కార్లను పరిశీలిస్తే.. పెట్రోల్ కారు కంటే డీజిల్ కార్ల ధర ఎక్కువ. దీనికి పెట్టుబడి ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. దీంతో కారుపై పెట్టే పెట్టుబడి సైతం క్రమంగా పెరుగుతుంది. ఇంకా పెట్రోల్‌తో నడిచే వాహనాలతో పోలిస్తే.. డీజిల్‌తో నడిచే కార్లు మెరుగైన మైలేజ్‌ని అందిస్తాయి.

ఫ్యూయెల్ కాస్ట్: ఫలితంగా కిలోమీటరుకు తక్కువ ఖర్చుతో నడపవచ్చు. కాబట్టి ఈ కార్లు తరచుగా లాంగ్ డ్రైవ్‌కి అనుకూలంగా ఉంటాయి. మీరు లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాలనుకుంటే, పెట్రోల్ కారుతో పోలిస్తే ఈ డీజిల్ కారులో ఫ్యూయెల్ ఖర్చు తక్కువగా ఉంటుంది కాబట్టి డీజిల్ కారును ఎంచుకోవడం బెస్ట్ ఆప్షన్.
మెయింటెనెన్స్ కాస్ట్: డీజిల్ కార్లు మెరుగైన మైలేజ్‌ని అందిస్తున్నప్పటికీ, వీటిని మెయింటెన్స్‌కి ఖర్చు ఎక్కువగా అవుతుంది. ఇది మీకు ఫ్యూయెల్ ద్వారా చేసిన పొదుపును భర్తీ చేస్తుంది. పెట్రోల్ కారుతో పోలిస్తే డీజిల్ కారు నిర్వహణ ఖర్చు ఎక్కువ. ఇంధనంపై ఆదా చేసిన డబ్బు ఇక్కడ ఖర్చు అవుతుందనే చెప్పవచ్చు.

పనితీరు: పెట్రోల్ కార్లతో పోలిస్తే డీజిల్ కార్లు ఎక్కువ టార్క్‌ను అందిస్తాయి. ఇంకా మీకు డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ప్రత్యేకించి హైవేలపై లాంగ్ డ్రైవ్‌ల సమయంలో మీకు ఎక్కువ అలసటగా ఉండదు. ఎక్కువ పవర్ ఉన్న వాహనాలను ఎంచుకోవాలంటే డీజిల్ కారు మంచి ఆప్షన్.
పొల్యూషన్ ఎఫెక్ట్: పర్యావరణానికి పెట్రోల్ కార్లతో పోలిస్తే డీజిల్ కార్లు ఎక్కువ హాని చేస్తాయి. పెట్రోల్ కార్లు పర్యావరణానికి అనుకూలమైనవి. ఈ కార్లు తక్కువ హానికరమైన గ్రీన్ హౌస్ ఉద్గారాలను విడుదల చేస్తాయి. కాబట్టి ఉద్గారాల పరంగా డీజిల్ కార్ల కంటే పెట్రోల్ కార్లు పర్యావరణానికి మేలు చేస్తాయి.

రీసేల్: డీజిల్ కార్లను మీరు వాడిన తర్వాత రీ సేల్ చేయాలనుకుంటే మీకు మంచి ధర లభిస్తుంది. మీరు డీజిల్ కార్లను సెకండ్ హ్యాండ్‌లో విక్రయించాలనుకుంటే మీరు సంతృప్తి చెందే రీతిలోనే మీకు ధర లభిస్తుంది. కాగా డీజిల్ కార్లతో పోలిస్తే పెట్రోల్ కార్ల రీసేల్ విలువ తక్కువగా ఉంటుంది.
డీజిల్ Vs పెట్రోల్ తీర్పు: డీజిల్ లేదా పెట్రోల్ వాహనం మధ్య ఆప్షన్.. కస్టమర్ వినియోగ విధానం, బడ్జెట్ మరియు వ్యక్తిగత ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరికీ భిన్నమైన బడ్జెట్ మరియు వినియోగ నమూనా ఉంటుంది. కొంతమంది మొదట్లో ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. కానీ నిర్వహణ ఖర్చు మాత్రం భరించలేరు. కొందరు మొదట ఎక్కువ చెల్లించలేకపోవచ్చు.
ఫైనల్‌గా కొనుగోలు ధర, మైలేజ్, నిర్వహణ ఖర్చులు, పర్యావరణ ప్రభావం, రీసేల్ విలువ మరియు డ్రైవింగ్ అనుభవం వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని పూర్తి సమాచారంతో మీరు సంతృప్తి చెందేలా నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. మీక లాంగ్ డ్రైవ్‌కు పెట్రోల్ లేదా డీజిల్ సరైనదో నిర్ణయించుకోవడం అనేది మీ వినియోగాన్ని బట్టి ఉంటుంది.
పెట్రోల్ కారు మరియు డీజిల్ కారు రెండూ ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉన్నాయి. లాంగ్ డ్రైవ్‌కు వెళ్లడం వల్ల రెండింటిలో కొన్ని లాభాలు మరియు కొన్ని నష్టాలు ఉన్నాయి. మీరు నిశితంగా పరిశీలించి దాని విశేషాలను తెలుసుకుని మీ లాంగ్ డ్రైవ్‌కి ఏది సరైందో ఎంపిక చేసుకుంటే బాగుంటుంది.


Click it and Unblock the Notifications








