నార్మల్ vs ప్రీమియం పెట్రోల్; ఇందులో మీ వాహనానికి ఏది బెస్ట్?

సాధారణంగా పెట్రోల్ బంకుల్లో రెగ్యులర్ పెట్రోల్‌తో పాటుగా ప్రీమియం పెట్రోల్‌ను కూడా విక్రయిస్తుంటారు. ప్రీమియం పెట్రోల్ ధర సాధారణ పెట్రోల్ ధర కన్నా కాస్తంత అధికంగా ఉంటుంది. కొత్తగా వాహనం కొనుగోలు చేసే చాలా మందిలో సాధారణ పెట్రోల్ ఉపయోగించాలా లేక ప్రీమియం పెట్రోల్ ఉపయోగించాలా అనే సంశయం ఉంటుంది.

నార్మల్ vs ప్రీమియం పెట్రోల్; ఇందులో మీ వాహనానికి ఏది బెస్ట్?

కొన్ని పెట్రోల్ పంపుల వద్ద ఉండే ఏజెంట్లు కూడా ప్రీమియం పెట్రోల్ గురించి ఎక్కువ చేసి చెబుతూ, దాని వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని కస్టమర్లను ఒప్పించి అధిక ధర పెట్రోల్‌ను విక్రయిస్తుంటారు. భారతదేశపు అతిపెద్ద చమురు కంపెనీ, అయిన ఇండియన్ ఆయిల్ ఇటీవలే హై ఆక్టేన్ ప్రీమియం పెట్రోల్‌ను విడుదల చేసింది, ఇది సాధారణ పెట్రోల్ కంటే 15 రూపాయలు ఎక్కువ ధరను కలిగి ఉంటుంది.

నార్మల్ vs ప్రీమియం పెట్రోల్; ఇందులో మీ వాహనానికి ఏది బెస్ట్?

అసలు సాధారణ పెట్రోల్‌కి ప్రీమియం పెట్రోల్‌కి మధ్య తేడా ఏంటి. ఈ రెండింటి ఉపయోగించడం వలన వాహనాల్లో కలిగే మార్పులు మరియు ప్రయోజనాలు ఏంటి? మీ బైక్ లేదా కారు యొక్క ఇంజన్ ప్రకారం ఏ రకం ఇంధనం ఎక్కువ మైలేజ్ మరియు పనితీరును ఇస్తుంది? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ కథనం, తెలుసుకుందాం రండి.

MOST READ:ఈ రూల్స్ సాధరణ వాహనాలకు మాత్రమే కాదు పోలీస్ వాహనాలకు కూడా వర్తిస్తాయి.. ఆ రూల్స్ ఏవో మీరూ చూడండి

నార్మల్ vs ప్రీమియం పెట్రోల్; ఇందులో మీ వాహనానికి ఏది బెస్ట్?

ప్రీమియం పెట్రోల్ vs సాధారణ పెట్రోల్

పెట్రోల్ యొక్క గ్రేడ్‌ను దాని ఆక్టేన్ విలువను ఆధారంగా చేసుకొని వర్గీకరిస్తారు. భారతదేశంలో సాధారణ పెట్రోల్ ఆక్టేన్ విలువ 87 కాగా, ప్రీమియం పెట్రోల్ ఆక్టేన్ విలువ 91గా రేట్ చేయబడింది. అధిక ఆక్టేన్ కలిగిన ఇంధనం ఎక్కువ కంప్రెషన్ రేషియోని కలిగి ఉంటుంది. ఫలితంగా, ఇంజన్‌ను స్టార్ట్ చేసే సమయంలో ఎక్కువ ఇంధనం కాలిపోదు మరియు కార్బన్‌పై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది.

నార్మల్ vs ప్రీమియం పెట్రోల్; ఇందులో మీ వాహనానికి ఏది బెస్ట్?

అదే సమయంలో, సాధారణ పెట్రోల్ తక్కువ ఆక్టేన్ కలిగి ఉంటుంది, దీని వలన ఇంజన్ ప్రారంభమయ్యే కొద్ది సెకన్ల పాటు ఎక్కువ ఇంధనం కాలిపోతుంది. ఈ ఇంధనం ఉపయోగించే వాహనాల్లో కాలక్రమేణా కార్బన్ స్తంభించిపోతుంది. ఫలితంగా ఇంజన్ పనితీరు మరియు మైలేజ్ వంటి అంశాలు ప్రభావితం అవుతాయి.

MOST READ:ఫ్యాన్సీ నెంబర్ కోసం 32 లక్షలు వేలం పాడాడు.. కానీ చివరికి ఏమైందంటే ?

నార్మల్ vs ప్రీమియం పెట్రోల్; ఇందులో మీ వాహనానికి ఏది బెస్ట్?

అధిక ఆక్టేన్ కలిగిన పెట్రోల్‌ను ఉపయోగించే వాహనాల్లో ఇంజన్ ప్రారంభమైనప్పుడు నాకింగ్ (కొట్టుకునే) శబ్దం ఉండదు. ఫలితంగా, ఇంజన్‌ను ప్రారంభించడం సులభం అవుతుంది. అదే సమయంలో, సాధారణ పెట్రోల్‌ను ఉపయోగించే వాహనాల్లో నాకింగ్ ఎక్కువగా ఉండి, ఇంజన్ శబ్ధం కూడా ఎక్కువగా అనిపిస్తుంది.

నార్మల్ vs ప్రీమియం పెట్రోల్; ఇందులో మీ వాహనానికి ఏది బెస్ట్?

ఏ ఇంజన్‌కు ఏ ఇంధనం సరైనది?

వాస్తవానికి, ప్రీమియం పెట్రోల్ అంటే ఎక్కువ ఆక్టేన్ కలిగిన పెట్రోల్ అధిక కంప్రెషన్ ఇంజన్లకు అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు శక్తివంతమైన ఇంజన్లు కలిగిన స్పోర్ట్స్ కార్లు, సూపర్ కార్లు మొదలైన వాటికి ఈ ప్రీమియం ఇంధనం ఉత్తమంగా ఉంటుంది. శక్తివంతమైన బైక్‌ల విషయంలో కూడా అంతే. ఇలాంటి వాహనాల్లో ప్రీమియం ఇంధనాన్ని ఉపయోగించడం వలన వాటి పనితీరు మరింత మెరుగ్గా ఉంటుంది.

MOST READ:తల్లిని హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నప్పుడు ట్రాఫిక్‌లో చిక్కుకున్న కొడుకు.. తర్వాత ఏం జరిగిందంటే ?

నార్మల్ vs ప్రీమియం పెట్రోల్; ఇందులో మీ వాహనానికి ఏది బెస్ట్?

అలాగే, తక్కువ ఇంధన సామర్థ్యం కలిగిన ఇంజన్‌లను ఉపయోగించుకునే కమ్యూటర్ వాహనాలకు ఈ ఇంధనం పెద్దగా ఉపయోగపడదు. తక్కువ పవర్ కలిగిన ఇంజన్లలో ఉండే తక్కువ కంప్రెషన్ రేషియో కారణంగా, వాటిలో ప్రీమియం ఇంధనం పెద్దగా పనిచేయదు. ఫలితంగా, వాటి పనితీరులో కానీ మైలేజ్‌లో కానీ పెద్ద మార్పు ఉండదు. కాబట్టి, ఇలాంటి వాహనాల్లో ప్రీమియం ఇంధనాన్ని ఉపయోగించడం లాభదాయకం కాదు.

నార్మల్ vs ప్రీమియం పెట్రోల్; ఇందులో మీ వాహనానికి ఏది బెస్ట్?

ప్రీమియం ఇంధనం వలన కలిగే ప్రయోజనాలు

ప్రీమియం ఇంధనాన్ని ఉపయోగించడం వలన మైలేజీ పెరుగుతుందని మరియు ఇది ఇంజన్‌పై ఎక్కువ ఒత్తిడి చేయదని పెట్రోల్ కంపెనీలు చెబుతున్నాయి. అధిక ఆక్టేన్ కలిగిన పెట్రోల్ సాధారణ పెట్రోల్ కంటే తక్కువ కర్బన వ్యర్థాలను విడుదల చేస్తుంది. ప్రీమియం ఇంధనంలో కొన్ని సంకలనాలు జోడించబడి ఉంటాయి, అవి ఇంజన్లలోని కార్బన్‌ను తగ్గించడంలోనూ మరియు ఇప్పటికే నిల్వ ఉన్న కార్బన్‌ను తొలగించడంలో సహకరిస్తుంది.

MOST READ:ఈ-రిక్షాలు ఇవ్వ‌నున్న‌ సోనూసూద్.. కానీ ఇవి వారికి మాత్రమే

నార్మల్ vs ప్రీమియం పెట్రోల్; ఇందులో మీ వాహనానికి ఏది బెస్ట్?

మరి ఇందులో మీ వాహనానికి ఏ ఇంధనం మంచిది?

వాహనంలో ఇంధనం నింపే విషయంలో ప్రతి వినియోగదారుడు ముందుగా, వారి వాహన మ్యాన్యువల్‌లో ప్రస్థావించిన అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా, మీ కారు లేదా బైక్‌కు ఐదు లేదా పది సంవత్సరాలు వయస్సు ఉంటే, అందులో సాధారణ ఇంధనాన్ని ఉంచడం మంచిది. లేదా ఒకవేళ మీ కారు లేదా బైక్ మరింత శక్తివంతంగా ఉండే మోడల్ అయితే, అలాంటి వాహనాల్లో ప్రీమియం ఇంధనాన్ని ఉపయోగించడం మంచిది.

Most Read Articles

English summary
Difference between normal and Premium fuel, know which one is better for your vehicle. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X