దీపావళి రోజున మీ కారు లేదా బైక్ కాలిపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందా.. అవ్వదా? చాలా షరతులు వర్తిస్తాయి!
దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు ఆరంభం అయిపోయాయి. ఇప్పటికే జనాలు ప్రత్యేక పూజలు ఆరంభించారు. పట్టణం, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా టపాసులు కాల్చడం కూడా ప్రారంభించారు. ప్రస్తుతం పేలుడు పదార్థాల వాసన ఆయా కాలనీలను చుట్టుముట్టాయి. ఇతర పండుగల మాదిరిగా కాకుండా దీపావళి సమయంలో ఎక్కువ మొత్తంలో టపాసులు పేలుస్తూ జనాలు ప్రత్యేకంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దీపావళి రోజున టపాసులు పేల్చడం అనేది ఓ ప్రత్యేక క్షణంగా జరుపుకుంటారు. అయితే దీపావళి సందర్భంగా సాధారణం కంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే టపాసులు పేల్చే ఆనందంతో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఈ ప్రమాదాల్లో రోడ్డు పక్కన పార్క్ చేసిన బైకులు, కార్లు టాపాసులు వాటిపై పడటం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కాబట్టి, సాధ్యమైనంత వరకు మీ కార్లు, బైక్‌లను దీపావళి ముగిసే వరకు టపాసులు, అగ్ని ప్రమాదం పొంచి ఉన్న ప్రదేశాల్లో పార్కింగ్ చేయవద్దు. అలానే ఈ సమయంలో వీలేతే ఏదైనా ఫైర్ ప్రూఫ్ కవర్‌తో వాహనాన్ని పూర్తిగా కవర్ చేయండి.

మీ కారు లేదా బైక్‌కి టపాసుల నుంచి వచ్చే స్పార్క్ వల్ల పెయింట్ తొలగిపోయి గీతలు ఏర్పడతాయి. లేదా భారీ స్థాయిలో స్పార్క్ రావడం వల్ల వాహనం పూర్తిగా కాలిపోతుంది. టపాసుల మంటల కారణంగా కారు, బైక్ ప్రమాదానికి గురైతే ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చాలామందికి తెలియదు. అసలు ఇన్సూరెన్స్ వర్తిస్తుందా? ఇందుకోసం ఎటువంటి నియమాలు పాటించాలి? అనే తదితర అంశాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం..
దాదాపు 90 శాతం మంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే టపాసుల వల్ల కలిగే నష్టాలను థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్లాన్ కింద క్లెయిమ్ చేయలేం. కేవలం సమగ్ర ఇన్సూరెన్స్ స్కీమ్ (Comprehensive Insurance)ని ఎంచుకుంటేనే మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో మీకు ఈ స్కీమ్ ఉన్నాకానీ సరైన జాగ్రత్తలు తీసుకుకోకుంటే మీ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది.

మీరు సరైన ఫ్రూప్స్, కీలకమైన వివరాలను వెల్లడించకుంటే వాటిని కారణాలుగా చూపుతూ క్లెయిమ్ తిరస్కరించబడుతుంది. ముఖ్యంగా మీ కారు లేదా బైక్‌ని ప్రమాదం జరిగే అవకాశం ఉన్న చోట, మిమ్మల్నీ హెచ్చరిస్తూ ఉండే సైన్ బోర్డ్స్, నో పార్కింగ్ జోన్‌లో వాహనాన్ని నిలిపితే మీ క్లెయిమ్‌ని రిజెక్ట్ చేస్తారు.
ఇంకా మీ కారులో బ్యాటరీలో కదలికలు లేదా ఏదైనా లీకేజ్ ఉంటే ఇన్సూరెన్స్ రాదు. ఎందుకంటే చిన్నపాటి స్పార్క్స్ బ్యాటరీకి అంటుకుంటే అది తీవ్ర ప్రమాదంగా మారుతుంది. ఇది మీ కారు మొత్తాన్ని కాల్చివేస్తుంది. కానీ బ్యాటరీని సరిగ్గా నిర్వహించకపోవడం మీ తప్పు కాబట్టి ఈ సందర్భంలో ఎటువంటి క్లెయిమ్ వర్తించదు. ఒకవేళ మీరు క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నించినా, మీ రెక్వెస్ట్‌ని ప్రారంభ దశలోనే రిజెక్ట్ చేస్తారు.

అదేవిధంగా మీ కారులో ఎలక్ట్రిక్ వైరింగ్ వ్యవస్థలో లోపం ఉంటే దాని వల్ల కారులో మంటలు చెలరేగినట్లు గుర్తిస్తే మీరు క్లెయిమ్ చేయలేరు. ఇది కాకుండా కారు ఏసీ లేదా LPG గ్యాస్ సిలిండర్‌ని మార్చేటప్పుడు మీకు తెలియకుండా మీరు ఏదైనా పొరపాటు జరిగితే ఆ సదర్భాల్లోనూ బీమా వర్తించదు. అంటే ఏసీ గ్యాస్ లేదా ఎల్పీజీ గ్యాస్ లీక్ ఉంటే సులభంగా గుర్తించవచ్చు.
గ్యాస్ లీకైనప్పుడు దీపావళి టపాసులకు మంటలు అంటుకునే ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్యాస్, ఆయిల్ లీక్ లేదా ఓవర్ హీట్ కారణంగా మంటలు వేగంగా విస్తరిస్తాయి. వీటిలో బీమా కంపెనీ టెక్నీషీయన్స్ ద్వారా ఏ ఒక్కదాన్ని గుర్తించినా మీ ఇన్సూరెన్స్‌ని రిజెక్ట్ చేస్తారు. ఇవన్నీ చాలా సున్నితమైన అంశాలు కాబట్టి వీటిని బీమా కంపెనీలు కచ్చితంగా అమలు చేస్తూ ఉంటాయి. వీటిలో ఎటువంటి మార్పులు ఉండవు.


Click it and Unblock the Notifications








