హైవేపై కారు డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. లేదంటే మైలేజ్‌ తగ్గిపోతుంది.!!

కారులో లాంగ్‌ డ్రైవ్‌కు(Long Drive In A Car) వెళ్లడమంటే చాలా మందికి సరదా.. ఇలా వెళ్తున్నప్పుడు కారులోని ఏసీ గాలి కంటే బయటి నుంచి వచ్చే చల్లగాలిని ఆస్వాదించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. కానీ ఇలా కారు విండోస్‌ తెరిచి ప్రయాణించడం వల్ల ఆర్థిక పరంగా కొన్ని నష్టాలు ఉన్నాయని మీకు తెలుసా.?? అవేంటే ఇక్కడ తెలుసుకుందాం..

భారతదేశంలో జాతీయ రహదారులు చాలా ఉన్నాయి. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు కలుపుతూ నేషనల్‌ హైవేస్‌ను చాలా విశాలంగా నిర్మించారు. అందుకే నగరాల్లో ట్రాఫిక్‌ మధ్య ప్రయాణానికి జాతీయ రహదారుల మీదుగా ప్రయాణానికి చాలా తేడా ఉంటుంది. ఈ రోడ్లపై లాంగ్‌ డ్రైవ్‌ చేయడమంటే చాలా మందికి సరదా ఉంటుంది.

Do-Not-Open-Car-Windows-While-Driving

అందుకే జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం నిత్యం అభివృద్ధి పరుస్తూనే ఉంటుంది. రోడ్డు నిర్మాణంలో నాణ్యతను పాటిస్తూ.. అక్కడకక్కడా టోల్‌ బూత్‌లను పెట్టి నాణ్యమైన రోడ్లను అందిస్తోంది. ఈ క్రమంలో ఈ రోడ్లపై ప్రయాణించేటప్పుడు చాలా మంది విండోస్‌ తెరిచి సహజ గాలి కారులోకి ప్రవేశించేలా చూస్తారు.

కానీ జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు మీ కారు విండోస్‌ను పూర్తిగా మూసి ఉంచడం చాలా అవసరం. దీని వెనుక కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. జాతీయ రహదారిపై కారు విండో గ్లాసెస్‌ తెరిచి ప్రయాణిస్తే నేరుగా కారు లోపలికి గాలి వస్తుంది. దీని కారణంగా మీరు ఎక్కువ శక్తిని ఇచ్చి కారును వేగంగా నడపాల్సి ఉంటుంది. దీంతో వాహనం మైలేజ్‌పై ప్రభావం చూపిస్తుంది. తద్వారా వాహనంపై భారం పడటమే కాకుండా.. సాంకేతిక సమస్యలు కూడా తలెత్తుతాయి.

Do-Not-Open-Car-Windows-While-Driving

సాధారణంగా ఆటో మేకర్లు కారు డిజైన్‌ చేసేటప్పుడు.. దాని ఏరోడైనమిక్స్‌పై చాలా శ్రద్ధ కనబరుస్తారు. ఈ ఏరోడైనమిక్స్ పూర్తిగా లాక్ చేయబడిన అద్దాల(Don't Open Car Windows During Journey)తో మాత్రమే పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించేలా రూపొందిస్తారు. అందువల్ల, జాతీయ రహదారిపై డ్రైవింగ్ చేసేటప్పుడు మీ కారు మంచి పనితీరును ప్రదర్శించాలంటే, విండోలు మూసివేయడం తప్పనిసరి.

జాతీయ రహదారిపై కారు హై స్పీడ్‌తో వెళ్తున్నప్పుడు విండోస్‌(Don't Open Car Windows On National Highways)ను తెరిచి ఉంచడం ద్వారా.. కారు లోపలికి దుమ్ము, క్రిములు, ఇతర వస్తువులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా కారు లోపలి భాగం దుమ్ముతో నిండిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా కారు ఇంటీరియర్‌, క్యాబిన్‌ను శుభ్రం చేసేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది.

అదే సమయంలో నేషనల్‌ హైవేస్‌పై వేగంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు విండోస్‌ తెరిచి ఉంచితే ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రమాదాలు జరిగే సమయంలో కారు విండోస్‌ తెరిచి ఉంచడం ద్వారా.. బయటి నుంచి ఏదైనా వాహనం లోపలికి వచ్చి మిమ్మల్ని ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది.

అందువల్ల, జాతీయ రహదారిపై కార్లలో ప్రయాణించేటప్పుడు, మీరు తప్పనిసరిగా కారు విండోస్‌ కవర్ చేయాల్సి ఉంటుంది. దీన్ని తెరిచి ప్రయాణం చేయడం వల్ల మీకు చాలా సమస్యలు వాటిల్లుతాయి. కారు మైలేజ్‌ నుంచి కార్ డస్ట్ వరకు అనేక ప్లాబ్లమ్స్‌ను ఫేస్‌ చేయాల్సి ఉంటుంది.

మీరు జాతీయ రహదారిపై వెళ్లే కార్లను ఎక్కువగా గమనిస్తే వాటి విండోస్‌ మూసి ఉంటాయి. వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు కారులోకి గాలి ఎక్కువగా వస్తుందని చాలా మంది ఇలా చేస్తారు. తెలిసో తెలియకో వాళ్ళు చేసింది సరైన పని. కాబట్టి మీ ప్రయాణంలో మీరు కారు విండోస్‌ మూసి ఉంచాలని గుర్తుంచుకోండి.

కాగా భారత మార్కెట్లో ప్రస్తుతం విక్రయిస్తున్న కార్లలో ఏసీ అనేది చాలా కీలకం. అందుకే మీరు జర్నీలో ఉన్నప్పుడు ఏసీ గాలిని పూర్తిగా ఆస్వాదించాలంటే విండోస్‌ తెరిచి ఉంచాలి. లేని పక్షంలో ఏసీ గాలి కూడా కలుషితం అవుతుంది. ఈ జాగ్రత్తలను పాటించడం ద్వారా మీరు సురక్షితమైన జర్నీని ఆస్వాదించవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, April 2, 2024, 18:59 [IST]
English summary
Do not open car windows while driving on highways it effects on car mileage and safety
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+