హ్యాండిల్‌ వదిలేసి బైక్‌ నడుపుతున్నారా??.. ఇలా చేస్తే ట్రాఫిక్‌ పోలీసులు చలాన్‌ విధిస్తారా.??

రోడ్డుపై వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్‌ రూల్స్‌(Traffic Rules)ను పాటించడం తప్పనిసరి. లేదంటే జరిమానా తప్పదు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా కొందరు రోడ్డుపై విచ్చలవిడిగా డ్రైవ్‌ చేస్తుంటారు. బైక్‌ హ్యాండిల్‌ను వదిలేసి సోషల్‌ మీడియాలో రీల్స్‌ కోసం విన్యాసాలు చేస్తుంటారు. అయితే ఇలా చేస్తే చలాన్‌ విధిస్తారా లేదా అనేది చాలా మందికి డౌట్‌..

వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. టూ వీలర్ రైడింగ్‌ చేసేటప్పుడు హెల్మెట్‌ ధరించడం, బాధ్యతాయుతంగా డ్రైవింగ్‌ చేయడం చాలా అవసరం. కానీ కొందరు వీటిని విస్మరిస్తున్మారు. హై స్పీడ్‌తో బైక్‌ నడపడం లేదంటే సోషల్‌ మీడియాలో రీల్స్‌ కోసం హ్యాండిల్‌ వదిలేసి ప్రమాదకరంగా నడపడం లాంటివి చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా ఇతర వాహనదారులు ఇబ్బందులకు గురవుతారనే విషయాన్ని పట్టించుకోరు.

Challan-Bike-Ride-Without-Handle

అయితే హెల్మెట్‌ లేకుండా డ్రైవ్‌ చేయడం, యాక్సిడెంట్‌కు కారణమవడం, సంబంధిత డాక్యుమెంట్లు లేకుండా బైక్‌ నడపడం లాంటి చర్యలకు పాల్పడితే ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధిస్తారనే సంగతి మనకు తెలిసిందే. కానీ ఇలా హ్యాండిల్‌(Bike Handle)ను విడిచిపెట్టి బైక్‌ నడిపేతే చలాన్‌ విధిస్తారా అనే దానిపై చాలా మందికి స్పష్టత లేదు.

కొందరు చలాన్‌ విధిస్తారు అని చెబితే.. మరికొందరు అలాంటిది ఏమీ ఉండదంటారు. అయితే దీనిపై మీకున్న సందేహాలను ఈ స్టోరీలో నివృత్తి చేసుకోవచ్చు. మీరు టూ వీలర్‌ హ్యాండిల్‌(Bike ride Without Using Handle)ను వదిలేసి నడిపితే ట్రాఫిక్‌ పోలీసులు మీకు ఖచ్చితంగా జరిమానా విధిస్తారు. ఎందుకంటే ఇది నిర్లక్ష్య డ్రైవింగ్‌ కిందకు వస్తుంది.

Challan-Bike-Ride-Without-Handle

మీరు రోడ్డుపై విన్యాసాలు చేస్తూ లేదంటే నిర్లక్ష్యంగా బైక్‌ నడుపుతూ ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కితే మీకు జరిమానా తప్పదు. ఇక సోషల్‌ మీడియాలో రీల్స్‌ చేస్తూ దొరికినా కూడా పోలీసులు మిమ్మల్ని గుర్తించి మీకు చలాన్‌ విధిస్తారని గుర్తుంచుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీకు ఫైన్‌ రూ. వేలల్లో ఉంటుంది.

కాగా చలాన్ల విషయం పక్కన పెడితే.. పబ్లిక్‌ రోడ్డుపై ఇలా టూ వీలర్ హ్యాండిల్‌ను వదిలేసి నడపడం చాలా ప్రమాదకరమని వాహనదారులు గమనించాలి. ఇది మీకే కాదు ఇతర వాహనదారులకు కూడా నష్టం కలిగిస్తుంది. తద్వారా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇందుకు సంబంధించి వాహనదారులు కొన్ని సూచనలు పాటించాలి.

Challan-Bike-Ride-Without-Handle

హ్యాండిల్‌ను వదిలి బైక్ నడపడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. మీరు హ్యాండిల్‌ని వదిలి బైక్‌ను నడుపుతుంటే, మీరు బైక్‌పై నియంత్రణ కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా ప్రమాదాలు జరగొచ్చు. ప్రమాదం జరిగినప్పుడు తీవ్ర గాయాలకు గురి కావడం లేదంటే ప్రాణ నష్టం సంభవించొచ్చు.

ఇలా బైక్‌ హ్యాండిల్ వదిలేసి మీరు రైడింగ్‌ చేయడం ద్వారా ప్రమాదం జరిగినట్లయితే.. ఎవరైనా గాయాలపాలైనా, ప్రాణాలు కోల్పోయినా మీరు చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జరిమానా విధించొచ్చు, లేదా జైలు శిక్ష పడొచ్చు. మరికొన్ని సందర్భాల్లో కోర్టు రెండూ విధించే అవకాశం ఉంది.

అయితే మరికొందరు బైక్‌ నడుపుతున్నప్పుడు ఒక్కోసారి ఫోన్‌ మాట్లాడుతుంటారు. ఒక చేత్తో హ్యాండిల్‌ పట్టుకుని మరో చేతిలో ఫోన్‌ మాట్లాడతారు. ఇలా చేయడం కూడా చట్టవిరుద్ధం. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే.. బైక్ నడుపుతున్నప్పుడు ఎల్లప్పుడూ బైక్ హ్యాండిల్‌ను పట్టుకోవాలి. ఇంకా టూ వీలర్‌ నడిపేటప్పుడు ఫోన్‌ ఉపయోగించకూడదు. లేదంటే బైక్‌ను రోడ్డు పక్కగా ఆపి ఫోన్‌ మాట్లాడిన అనంతరం మీ జర్నీని స్టార్ట్‌ చేయండి.

మరో ముఖ్యమైన విషయం బైక్ నడుపుతున్నప్పుడు ఏకాగ్రతతో ఉండాలి. ఇంకా మీరు అలసిపోయినా లేదా మత్తులో ఉన్న సందర్భాల్లో ద్విచక్ర వాహనం నడపకుండా చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలను పాటించడం ద్వారా మీరు చలాన్ల బారిన పడే అవకాశం ఉండదు. అంతే కాకుండా రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ఉండొచ్చు.

More from DriveSpark

Article Published On: Sunday, January 7, 2024, 11:30 [IST]
English summary
Do traffic police issue challan if you leave the handle and ride the bike
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+