కారు ఏ/సి ఆన్‌లో ఉన్నపుడు ఇంజన్ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది ?

By Anil Kumar

కారు ఇంజన్ స్టార్ట్ లేదా స్టాప్ చేస్తున్నపుడు కారులో ఏసి సిస్టమ్ ఆఫ్‌ లేదా ఆన్‌లో ఉంచకూడదా...? ఉంటే ఏమవుతుంది ? అస్సలు, కారు ఇంజన్‌కు కారులో ఏసికి మధ్య సంభందం ఏంటి ? కారు నడుపుతున్న ప్రతి ఒక్కరి మైండ్‌లో ఎప్పుడో ఒక్కసారి ఇలాంటి ప్రశ్నలు మెదిలే ఉంటాయి.

ఇంజన్ స్టార్ట్ చేస్తున్నపుడు కార్ ఏ/సి ఆన్‌లో ఉంచవచ్చా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు "చిట్కాలు" శీర్షిక ద్వారా ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవాళ్టి స్టోరీలో అందిస్తోంది. కారు ఏసి పనితీరు, ఇంజన్ ఆఫ్ మరియు ఆన్ చేయడం పట్ల ఉన్న అనుమానాలను నేటి స్టోరీలో నివృత్తి చేసుకుందాం రండి...

ఇంజన్ నుండి ఏ/సి వ్యవస్థకు పవర్ ఎలా అందుతుంది...?

ఇంజన్ స్టార్ట్ చేస్తున్నపుడు కార్ ఏ/సి ఆన్‌లో ఉంచవచ్చా

కారు ఏసి సిస్టమ్‌లో ఉన్న కంప్రెసర్ మ్యాగ్నెటిక్ క్లచ్ అనుసంధానంతో పుల్లీ-బెల్ట్ డ్రైవ్ ద్వారా ఇంజన్ క్రాంక్‌షాఫ్టుకు కనెక్ట్ అయి ఉంటుంది. ఇంజన్ క్రాంక్‌షాఫ్ట్‌కు కనెక్ట్ అయిన పుల్లీ ద్వారా కంప్రెసర్‌కు పవర్ అందుతుంది.

ఇంజన్ స్టార్ట్ చేస్తున్నపుడు కార్ ఏ/సి ఆన్‌లో ఉంచవచ్చా

అయితే, ఇంజన్ రన్ అవుతున్నంత సేపు కంప్రెసర్ ఆన్‌లో ఉండదు. ఇది కార్ క్యాబిన్‌లో మనం సెట్ చేసిన టెంపరేచర్‌కు అనుగుణంగా ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉండాలి. కానీ ఇంజన్ నుండి వచ్చే పవర్ ద్వారా ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటుంది. కాబట్టి దీనిని నియంత్రించడానికి మ్యాగ్నెటిక్ క్లచ్ సహాయపడుతుంది.

ఇంజన్ స్టార్ట్ చేస్తున్నపుడు కార్ ఏ/సి ఆన్‌లో ఉంచవచ్చా

ఈ మ్యాగ్నెటిక్ క్లచ్ కంప్రెసర్‌ నుండి వేరుచేయడం మరియు మళ్లీ కలపడం చేస్తుంది. కారులో టెంపరేచర్‌ను బట్టి మనం కంప్రెసర్‌ ఆన్ అండ్ ఆఫ్ చేయడం ద్వారా మ్యాగ్నెటిక్ క్లచ్ కంప్రెసర్‌‌కు పుల్లీని కలపడం లేదా వేరుచయడం చేస్తుంది.

ఏసి ఆన్‌లో ఉన్నపుడు ఇంజన్ స్టార్ట్ చేయవచ్చా...?

ఇంజన్ స్టార్ట్ చేస్తున్నపుడు కార్ ఏ/సి ఆన్‌లో ఉంచవచ్చా

బెల్ట్ డ్రైవ్ ద్వారా ఇంజన్ నుండి కొంత పవర్ ఏసి వ్యవస్థకు మళ్లుతుంది. అంటే కారు నడవడం మాత్రం కోసమే కాదు ఏసి, రేడియేటర్, డైనమో వంటి వాటికి ఇంజన్ నుండే పవర్ అందుతుంది. వెహికల్ రన్నింగ్‌లో ఉన్నపుడు అన్నింటికీ పవర్ సరఫరా చేయడం పెద్ద కష్టమేమీ కాదు.

ఇంజన్ స్టార్ట్ చేస్తున్నపుడు కార్ ఏ/సి ఆన్‌లో ఉంచవచ్చా

ఇగ్నిషన్ కీ ఆన్ చేయగానే ఎలక్ట్రిక్ మోటార్ ఇంజన్‌ను ఆన్ చేస్తుంది. అప్పటికే డైనమో, ఫ్యాన్ వంటివి కనెక్ట్ అయ్యి ఉండటంతో ఇంజన్ స్టార్ట్ అవడానికి కాస్త ఇబ్బంది అవుతుంది. దీనికి అదనంగా ఏసి కంప్రెసర్ బెల్ట్ డ్రైవ్ కూడా కనెక్ట్ అయితే ఇంజన్ స్టార్ట్ చేయడానికి బ్యాటరీ మీద లోడ్ ఎక్కువ పడుతుంది.

ఇంజన్ స్టార్ట్ చేస్తున్నపుడు కార్ ఏ/సి ఆన్‌లో ఉంచవచ్చా

ఇంజన్ స్టార్ట్ చేయడానికి ముందే ఏసి ఆన్‌లో ఉండటం వలన బ్యాటరీ నుండి అటు ఏసీకి, ఇటు ఇంజన్ స్టార్ట్ చేసే ఎలక్ట్రిక్ మోటార్‌కు పవర్ సరఫరా చేయాల్సి ఉంటుంది. దీంతో ఒక్కసారిగా బ్యాటరీ మీద లోడ్ ఎక్కువ అవడం వలన ఇంజన్ స్టార్ట్ అయ్యేందుకు మొరాయిస్తుంది.

ఇంజన్ స్టార్ట్ చేస్తున్నపుడు కార్ ఏ/సి ఆన్‌లో ఉంచవచ్చా

ఇంజన్ స్టార్ట్ చేస్తున్నపుడు ఎలక్ట్రిక్ మోటార్‌కు వీలైనంత వరకు ఎక్కువ పవర్ కావాల్సి ఉంటుంది. అందుకే, కారులో మ్యూజిక్ సిస్టమ్, హెడ్ లైట్లు మరియు ఏసి ఆఫ్ చేయాలని సూచిస్తారు. కానీ బ్యాటరీ సామర్థ్యం బాగున్నపుడు ఇలా చేయాల్సిన అవసరం లేదు.

ఇంజన్ స్టార్ట్ చేస్తున్నపుడు కార్ ఏ/సి ఆన్‌లో ఉంచవచ్చా

ఏసి ఆన్‌లో ఉన్నపుడు ఇంజన్ స్టాప్ చేయకూడదా...?

కారులో ఏసీ ఆన్‌లో ఉన్నపుడు ఇంజన్ ఆఫ్ చేయడం వలన ఇంజన్ మరియు కంప్రెసర్ మీద ఎలాంటి ప్రభావం చూపదు.

Most Read Articles

English summary
Read In Telugu: Do you really have to turn off the car's ac before turning on the engine?
Story first published: Friday, July 13, 2018, 13:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X