కారు ఇండికేటర్లు ఎలా వినియోగించాలో తెలుసా..? ఇలా చేస్తే ప్రమాదాలే జరగవు..!
వాహన డ్రైవర్లు ఇండికేటర్లను సరిగా వినియోగిస్తే చాలా వరకు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది. వాహన డ్రైవర్లు ఎల్లప్పుడూ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ద్వారా తెలియజేయాలని రోడ్డు భద్రత నిబంధనలు చెబుతున్నాయి. ఇండికేటర్ల ద్వారా సమీప వాహనాల డ్రైవర్లు తమ ముందున్న డ్రైవర్ యొక్క ఉద్దేశం తెలుసుకోవచ్చు.
అయితే కారు ఇండికేటర్లు అంటే కుడి, ఎడమ మాత్రమే కాదు. ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ ఇండికేటర్లు ఎలా, ఎప్పుడు వినియోగించాలో చాలా మంది వాహనదారులకు సరైన అవగాహన ఉండదు. ఫలితంగా ప్రమాదాలకు కారణం అవుతారు. అలాంటి వారికోసం ఈ కథనం.

ఇండికేటర్లను వినియోగించేందుకు సరైన సమయం ఏది..? : ఒకే రహదారిపై డ్రైవింగ్ చేస్తున్న వాహనదారులు తాము ఏ సమయంలో, ఎటువైపు వెళ్లాలనుకుంటున్నారో.. ఇతర వాహనదారులకు చెప్పేందుకు ఇండికేటర్లను ఉపయోగించాలి. వాహన డ్రైవర్లు ఎడమ లేదా కుడి వైపునకు వాహనాన్ని మళ్లిస్తున్నప్పుడు ఇండికేటర్ వేయాలి. ఫలితంగా వెనుక వచ్చే వారికి మీ ఉద్దేశం అర్థమవుతుంది. మీరు ఎటువంటి ఇండికేటర్లు ఉపయోగించకుండా వాహనాన్ని కుడి లేదా ఎడమ వైపునకు మళ్లిస్తే.. ప్రమాదాలకు దారితీస్తుంది.

* కారులో వెళ్తున్నప్పుడు యూటర్న్ తీసుకోవాలనుకుంటే.. అంతకంటే ముందే ఇండికేటర్ వేయాల్సి ఉంటుంది. ఫలితంగా వెనుక వస్తున్న వాహనదారులు వాహన వేగాన్ని పెంచడం లేదా తగ్గిస్తారు. రోడ్లపై లైన్లు మారుతున్న సమయంలోనూ ముందుగానే వెనుక ఉన్న డ్రైవర్లకు అర్థమయ్యే విధంగా ఇండికేటర్లు ఉపయోగించాలి. ఫలితంగా సమీపంలోని వాహనదారులు వారి వేగంలో మార్పులు చేయడం లేదా మనం వెళ్లేందుకు వీలు కల్పిస్తారు.
* కార్లను ఓవర్‌టేక్ చేయాలనుకున్న సమయంలో ఏవైపు నుంచి ఓవర్‌టేక్ చేయాలనుకుంటున్నారో ముందుగానే ఇండికేటర్ ద్వారా తెలియజేయాలి. ఫలితంగా వెనుకనున్న వాహనదారులకు మన ఉద్దేశం తెలుస్తుంది. దాని ప్రకారం వారి నిర్ణయం తీసుకుంటారు. లేకుంటే గందరగోళ పరిస్థితికి దారితీసి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.

* సాధారణంగా డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మనం ఎటువైపు వెళ్లాలని అనుకుంటున్నామో.. ముందుగానే తెలియజేయాలి. ఫలితంగా వెనుకనున్న డ్రైవర్లు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాకాకుండా అకస్మాత్తుగా ఇండికేషన్ ఇచ్చి, వాహనాలు మలుపులు తిప్పడం వల్ల గందరగోళానికి దారితీస్తుంది. ఫలితంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది.
* ఇండికేటర్లు అనగానే ఎడమ, కుడివైపున ఉన్నవే అనుకుంటారు. కానీ ముందున్న డ్రైవర్ ఉద్దేశం తెలుసుకొనేందుకు ఇతర ఇండికేటర్లు కూడా ఉన్నాయి. అన్ని కార్లతో శాశ్వతంగా ఇన్‌స్టాల్ చేయబడిన ఇండికేటర్ - స్టాప్ ఇండికేటర్. కారు బ్రేక్‌తో స్టాప్ ఇండికేటర్ లింక్ చేయబడి ఉంటుంది. కారు బ్రేక్ వేసినప్పుడు ఆటోమేటిక్‌గా స్టాప్ ఇండికేటర్ వెలుగుతుంది. ఫలితంగా కారు వేగం తగ్గిస్తున్నామని, కారును పూర్తిగా ఆపేస్తున్నామని వెనుక వస్తున్న డ్రైవర్లకు అర్థమవుతుంది.

* కొన్ని సందర్భాల్లో కార్లు బ్రేక్‌డౌన్ లేదా రోడ్డు మధ్యలో టైర్ పంక్చర్ అయినప్పుడు.. వెనుకనున్న వాహనాలు ఆగకుండా వెళ్లిపోయేందుకు ఓ ఇండికేటర్ ఉంటుంది. కారు వెనుక భాగంలో త్రిభుజాకారంలో ప్రమాద సంకేతం కనిపిస్తుంది. దీనిపైన లైట్ పడినప్పుడు మరింత ప్రకాశిస్తుంది.
రోడ్లుపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సందర్భానికి అనుకూలంగా ఇండికేటర్లను వినియోగించడం వల్ల రోడ్లపై సురక్షితంగా ప్రయాణించవచ్చు. సరైన సమయంలో ఇండికేటర్లు వినియోగించడం వల్ల చాలా వరకు ప్రమాదాలను తగ్గించవచ్చు. మరియు కారుకు ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం ఎప్పుడూ మరిచిపోవద్దు.


Click it and Unblock the Notifications








