కారులో ఏ/సి వాడితే మైలేజ్ పెరుగుతుందా..? తగ్గుతుందా..? వివరంగా!!
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కేకొద్దీ వాటి మీద ప్రజలకు ఎన్నో అపోహలు కలిగాయి. అందులో ఒకటి కారులో ఏ/సి ఉపయోగిస్తే... మైలేజ్ తగ్గిపోవడం. కారులో ఏ/సి వాడుతున్నపుడు నిజంగానే మైలేజ్ తగ్గిపోతుందా...?
దాదాపు 20 ఏళ్ల క్రితమే కార్లలో ఏ/సి అనే కాన్సెప్టుకి బీజం పడింది. అప్పట్లో కార్లలో ఏ/సి ఉంటే అదొక లగ్జరీ ఫీచర్. ఇరవై ఏళ్ల క్రితం అంబాసిడర్ కార్లలో డిక్కీ మీద ఏ/సి అన్ని పెద్ద అక్షరాలతో రాసిఉంటుంది. కేవలం డబ్బున్న పెద్దోళ్ల మాత్రమే అలాంటి కార్లలో వెళ్లేవారు. ఆటోమొబైల్ ప్రపంచంలో కాలం చాలా వేగంగా మారిపోయింది. కారులో ఏ/సి అనే పదం కాలగర్భంలో కలిసిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఏ/సి లేని కారంటూ ఉండదు.

ఆటోమొబైల్స్‌లో ఎన్ని మార్పులు జరిగినా... ప్రజల ఆలోచనా తీరులో మాత్రం అన్ని మార్పులు జరగలేదు. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కేకొద్దీ వాటి మీద ప్రజలకు ఎన్నో అపోహలు కలిగాయి. అందులో ఒకటి కారులో ఏ/సి ఉపయోగిస్తే... మైలేజ్ తగ్గిపోవడం. కారులో ఏ/సి వాడుతున్నపుడు నిజంగానే మైలేజ్ తగ్గిపోతుందా...? ఇది ఎంత వరకు నిజమో చూద్దాం రండి...
Recommended Video


సంవత్సరం మొత్తం ఇండియాలో ఉష్ణోగ్రత మరియు ఇంధన ధరలు రెండూ అధికమే. అందుకే మరి, కార్ల కంపెనీలు మరియు కార్లను ఉపయోగించే కస్టమర్లు అందరూ... కార్ల మైలేజ్ మరియు కార్లలో మంచి ఎయిర్ కండీషనింగ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

ఎయిర్ కండీషనర్‌లోని ఎయిర్ కంప్రెసర్ పనిచేయడానికి కారు ఇంజన్ నుండి పవర్ అందుతుంది. ఏ/సి వ్యవస్థలోని కంప్రెసర్, కండెన్సర్, ఎక్స్‌పాండర్ మరియు ఎవాపరేటర్ అన్ని సంయుక్తంగా పనిచేసి కారు క్యాబిన్ లోకి చల్లని గాలిని పంపిస్తుంది.

ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ కారు నడవడానికి కాకుండా ఏ/సి వ్యవస్థకు కూడా కొంత మేర సరఫరా అవుతుంది. కాబట్టి, ఇంజన్ మండించే ఇంధనంలో కొంత మేర ఏ/సి కోసం ఖర్చవుతుంది.

ప్రస్తుతం ఆధునిక కార్లలో ఏ/సి కోసం ఖర్చయ్యే ఇంధన చాలా తక్కువ. అయితే, ప్రత్యేకించి తక్కువ పవర్ ఉత్పత్తి చేసే ఇంజన్ గల పాత కార్లలో నిరంతరం ఏ/సి ను వాడినట్లయితే సుమారుగా 20 శాతం వరకు మైలేజ్ తగ్గిపోయేది.
Trending On DriveSpark Telugu:

అలాంటి కార్లు కొండ ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నప్పుడైతే, మైలేజ్ ఇంకా దారుణంగా తగ్గిపోయేది. గురుత్వాకార్షణ శక్తికి వ్యతిరేకంగా ఏటవాలు తలం మీద ప్రయాణించాల్సి ఉంటుంది కాబట్టి ఇంజన్ మీద ఎక్కువ భారం పడుతుంది, అదే సమయంలో ఏ/సి ఆన్‌లో ఉంటే ఇంధన వినియోగం మరింత పెరిగి మైలేజ్ తగ్గిపోతుంది.

ఏ/సి ఆఫ్ చేసుకుని అద్దాలన్నీ క్రిందకు దించేసి, కారును డైవ్ చేస్తే మైలేజ్ పెరుగుతుందని భావిస్తున్నారా...? ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్ని అద్దాలను క్రిందకు దించేయడంతో లోపలికి వచ్చే గాలి కారు ముందుకు కదలడాన్ని నిరోదిస్తుంది. ఇలా చేయడంతో మైలేజ్ భారీగా తగ్గిపోతుంది.

కాబట్టి, విండోస్ ఓపెన్ చేసి డ్రైవ్ చేయడం కన్నా, క్లోజ్ చేసి ఏ/సి ఆన్ చేసుకుని ప్రయాణించడం ఎంతో ఉత్తమం. ఏదేమైనప్పటికీ, తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నపుడు బాహ్య వాతావరణం చల్లగా ఉంటే ఏ/సి ఆఫ్ చేసి అద్దాలను కొద్దిగా క్రిందకు దించి ప్రయాణించే మంచి మైలేజ్ సొంతం అవుతుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఏ/సి సిస్టమ్ పనిచేయడానికి చాలా తక్కువ ఇంధనం మాత్రమే ఖర్చవుతుంది. ఎందుకంటే, ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ ఆధారంగానే ఏ/సి రన్ అవుతుంది కాబట్టి. ఇంజన్ ప్రొడ్యూస్ చేసే పవర్ ద్వారా ఏ/సి సిస్టమ్ మాత్రమే కాదు ఇంకా ఎన్నో వ్యవస్థలు పనిచేస్తాయి.
ఏ/సి వాడితే మైలేజ్ తగ్గుందనేది ఎంత నిజమే... అంత అబద్దం కూడా... ఎందుకంటే ఇంజన్ మీద ఏ/సి చూపే ప్రభావం చాలా తక్కువ. కాబట్టి, ఏ/సి-మైలేజ్ పట్ల అపోహలు వీడి సౌకర్యంగా ట్రావెల్ చేయండి.
ఈ కథనంపై మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్స్ ద్వారా మాతో పంచుకోండి....
Trending DriveSpark Telugu YouTube Videos


Click it and Unblock the Notifications








