సెకండ్ హ్యాండ్ ప్రీమియం బైక్ కొనేముందు జాగ్రత్తగా లేకుంటే, జేబుకు చిల్లు ఖాయం..!

ఏదైనా కొత్త మోటార్‌సైకిల్ ఒక్కసారి డీలర్‌షిప్ దాటి, కస్టమర్ చేతికి వచ్చిన వెంటనే దాని విలువ భారీగా తగ్గుతుంది మరియు అది సెకండ్ హ్యాండ్ మోడల్‌గా పరిగణించడం జరుగుతుంది. ఇలా వాహనం యొక్క వయస్సు గడిచే కొద్దీ దాని విలువ కూడా గణనీయంగా తగ్గుతుంది.

సెకండ్ హ్యాండ్ ప్రీమియం బైక్ కొనేముందు జాగ్రత్తగా లేకుంటే, జేబుకు చిల్లు ఖాయం..!

ప్రీమియం బైక్‌ల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. అత్యంత ఖరీదైన ఈ ప్రీమియం బైక్‌లను నేరుగా డీలర్‌షిప్ నుండి కొనుగోలు చేయాలంటే, అవి చాలా ఖరీదైనవిగా ఉంటాయి. కానీ, అదే మోటార్‌సైకిల్‌ను సెకండ్ హ్యాండ్ రూపంలో కొనుగోలు చేస్తే, కొన్ని సందర్భాల్లో, అవి వాటి అసలు ధర కంటే దాదాపు సగం ధరకే కొనుగోలుదారుల సొంతమయ్యే అవకాశం ఉంటుంది.

సెకండ్ హ్యాండ్ ప్రీమియం బైక్ కొనేముందు జాగ్రత్తగా లేకుంటే, జేబుకు చిల్లు ఖాయం..!

నిజానికి, లక్షల ఖరీదు చేసే ప్రీమయం మరియు సూపర్‌బైక్‌లను కొనుగోలు చేసే కసమర్లు, వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంటారు. కాబట్టి, అలాంటి వాటిని సందేహం లేకుండా సెకండ్ హ్యుండ్ రూపంలో కొనుగోలు చేయవచ్చు. అయినప్పటికీ, ఈ విషయంలో మాత్రం అప్రమత్తంగా లేకపోతే, మీ జేబుకు భారీ చిల్లుపడే ప్రమాదం ఉంటుంది. సెకండ్ హ్యాండ్ ప్రీమియం బైక్‌లను కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

సెకండ్ హ్యాండ్ ప్రీమియం బైక్ కొనేముందు జాగ్రత్తగా లేకుంటే, జేబుకు చిల్లు ఖాయం..!

ఏదైనా మోటార్‌సైకిల్ దాని షోరూమ్ కండిషన్ నుండి సుమారు 12 నెలలు నడిపిన/ఉపయోగించిన తర్వాత, సదరు మోటార్‌సైకిల్ దాని అసలు విలువలో దాదాపు 70 శాతం మాత్రమే విలువను కలిగి ఉంటుంది. ఈ విలువ అనేది వాహన రిజిస్ట్రేషన్ సంవత్సరం మరియు మొత్తం బైక్ మైలేజ్ (మీటర్ రీడింగ్)పై ఆధారపడి ఉంటుంది.

సెకండ్ హ్యాండ్ ప్రీమియం బైక్ కొనేముందు జాగ్రత్తగా లేకుంటే, జేబుకు చిల్లు ఖాయం..!

లగ్జరీ మరియు సూపర్‌బైక్‌లను ప్రీ-ఓన్డ్ యాజమాన్యం నుండి కొనుగోలు చేయడం సాధారణంగా లాభదాయకంగానే ఉంటుంది. ముందస్తు యాజమాన్యంలోని సూపర్‌బైక్ సంతృప్తికరమైన ఒప్పందంగా అనిపించినప్పటికీ, అలాంటి ప్రీమియం మోటార్‌సైకిళ్ల కొనుగోలు విషయంలో మీరు నిర్ణయం తీసుకునే ముందు కొన్ని అంశాలను గుర్తుంచుకోవాలి.

సెకండ్ హ్యాండ్ ప్రీమియం బైక్ కొనేముందు జాగ్రత్తగా లేకుంటే, జేబుకు చిల్లు ఖాయం..!

మనదేశంలో సెకండ్ హ్యాండ్ ప్రీమియం బైక్ మార్కెట్‌లో జపనీస్ బ్రాండ్ నుండి ఇటాలియన్ బ్రాండ్ వరకూ అనేక రకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, ప్రీ-ఓన్డ్ ప్రీమియం బైక్‌ను కొనుగోలు చేయటానికి ముందు, మీరు ఏ బ్రాండ్ మరియు ఏ స్టైల్ బైక్‌ను కోరుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. ఆ తర్వాతనే కొనుగోలు విషయానికి రావాలి.

సెకండ్ హ్యాండ్ ప్రీమియం బైక్ కొనేముందు జాగ్రత్తగా లేకుంటే, జేబుకు చిల్లు ఖాయం..!

ప్రీమియం మోటార్‌సైకిల్ విభాగంలో సూపర్‌స్పోర్ట్, నేక్డ్ రోడ్‌స్టర్, అడ్వెంచర్, అడ్వెంచర్ టూరింగ్, ఆఫ్-రోడర్ మరియు రేసింగ్ స్పోర్ట్ వంటి విభాగాల్లో వివిధ రకాల బాడీ స్టైల్స్‌లో ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. కాబట్టి, మీ అవసరాలకు ఎలాంటి బైక్ కావాలో నిర్ణయించుకోవాలి.

సెకండ్ హ్యాండ్ ప్రీమియం బైక్ కొనేముందు జాగ్రత్తగా లేకుంటే, జేబుకు చిల్లు ఖాయం..!

ఉదాహరణకు, మీకు లాంగ్ రైడ్స్ చేయటం ఇష్టమైనట్లయితే, మీరు అడ్వెంచర్ టూరింగ్ లేదా క్రూయిజర్ మోటార్‌సైకిళ్లను ఎంచుకోవచ్చు. ఇవి మంచి కంఫర్టబల్ రైడింగ్ పొజిషన్‌ను కలిగి ఉండి, సుదూర ప్రయాణాలకు అనువుగా ఉంటాయి. ఒకవేళ మీకు వేగంగా వెళ్లే బైక్‌లు ఇష్టమైనట్లయితే, సూపర్‌స్పోర్ట్ బైక్‌లను ఎంచుకోవచ్చు. ఇలా, మీ అవసరానికి ఏ బైక్ సరిపోతుందోని ఆలోచించుకోవాలి.

సెకండ్ హ్యాండ్ ప్రీమియం బైక్ కొనేముందు జాగ్రత్తగా లేకుంటే, జేబుకు చిల్లు ఖాయం..!

మీరు కొనాలనుకునే బైక్ బ్రాండ్ మరియు బాడీ స్టైల్‌ని ఎంచుకున్న తర్వాత, సదరు బ్రాండ్ యొక్క ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ పనితీరు, స్పేర్ పార్ట్స్, మెయింటినెన్స్, సర్వీస్ సెంటర్ లభ్యత వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఒకవేళ మీరు ఎంచుకున్న ప్రీమియం బైక్‌కు సంబంధించి, పైన పేర్కొన్న అంశాలు ఏవీ విశ్వసనీయంగా లేకుంటే, మీరు అలాంటి ప్రీమియం బైక్‌లను కొనుగోలు చేయకపోవటమే మంచిది.

సెకండ్ హ్యాండ్ ప్రీమియం బైక్ కొనేముందు జాగ్రత్తగా లేకుంటే, జేబుకు చిల్లు ఖాయం..!

ప్రీమియం బైక్‌ల సర్వీస్ విషయంలో, వాటి ముందస్తు యాజమాన్యంలో ఉన్న కస్టమర్లు దాదాపుగా వాటిని అధీకృత సర్వీస్ సెంటర్లు మరియు నిపుణులైన సర్వీస్ టెక్నీషియన్లతోనే సర్వీస్ చేయిస్తుంటారు. కొందరైతే, దీనికి సంబంధించిన పూర్తి సర్వీస్ ట్రాక్ రికార్డును కూడా భద్రపరచుకొని ఉంటాయి. ఒకేవేళ మీరు కొనాలనుకునే ప్రీమియం బైక్ విషయంలో అలాంటి సర్వీస్ రికార్డ్ లభించినట్లయితే దానిని, నిశితంగా పరీశిలించండి.

సెకండ్ హ్యాండ్ ప్రీమియం బైక్ కొనేముందు జాగ్రత్తగా లేకుంటే, జేబుకు చిల్లు ఖాయం..!

మోటారుసైకిల్ మంచి స్థితిలో ఉందని నిర్ధారించుకోవడానికి ఈ సర్వీస్ రికార్డులు ఉపయోగపడుతాయి. అంతేకాకుండా, సదరు మోటార్‌సైకిల్‌లో ఏదైనా పెద్ద మరమ్మత్తులు జరిగాయా అనే విషయాన్ని కూడా ఇవి నిర్ధారిస్తాయి. అలాగే, భీమా పత్రాలలో 'నో క్లెయిమ్ బోనస్' వివరాలను తనిఖీ చేసి, బైక్ పెద్ద మరమ్మతులకు గురికాలేదని తెలుసుకున్న తర్వాతనే సదరు బైక్ కొనుగోలు విషయంలో తుది నిర్ణయం తీసుకోండి.

సెకండ్ హ్యాండ్ ప్రీమియం బైక్ కొనేముందు జాగ్రత్తగా లేకుంటే, జేబుకు చిల్లు ఖాయం..!

మనదేశంలో డ్యుకాటి మరియు ట్రయంప్ వంటి సంస్థలు ఇప్పటికే ప్రీ-ఓన్డ్ మోటార్‌సైకిల్ వ్యాపారాలను నిర్వహిస్తున్నాయి. తక్కువ ధరలో మీ కలల బైక్‌ను సొంతం చేసుకునేందుకు ఇవి కూడా చక్కని మార్గాలు. ఇలాంటి ప్రీ-ఓన్డ్ కంపెనీలు ఇదివరకటి యాజమాన్యంలో ఉన్న మోటార్‌సైకిల్‌ను అనేక విధాలుగా తనిఖీ, నిర్ధారించుకున్న తర్వాతనే వాటిని విక్రయానికి ఉంచుతారు.

Most Read Articles

English summary
Don't Forget To Check These Things Before Buying A Pre-Owned Premium Bike. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X