డ్రైవింగ్ చేసే గర్భిణీ స్త్రీల కోసం ముఖ్యమైన చిట్కాలు

సాధరణంగా స్త్రీలు గర్భం (ప్రెగ్నెన్సీ)తో ఉన్నప్పుడు వాహనం నడపకపోవటమే చాలా మంచిది. అయితే, కొన్ని అనివార్య కారణాలు, పరిస్థితుల వలన తప్పనిసరిగా డ్రైవ్ చేయాల్సి వస్తే, అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలి. ఉద్యోగం చేసే మహిళలకు స్వతహాగా వాహనాలు డ్రైవ్ చేసుకొని వెళ్లటం తప్పనిసరిగా ఉంటుంది.

సాధారణంగా గర్భం దాల్చినప్పుడు స్త్రీల శరీరం భారంగా అనిపిస్తుంటుంది. ఆ సమయంలో వారు ఎక్కువగా ఒత్తిడికి గురి అవుతుంటారు. అటువంటి పరిస్థితుల్లో డ్రైవింగ్ అంటే చాలా రిస్కుతో కూడుకున్నది. ఇలాంటి సందర్భాల్లోనే ప్రమాదాలు ఎక్కువగా జరిగే ఆస్కారం ఉంటుంది. అయితే, కొన్ని చిన్న చిట్కాలను పాటించడం వలన ఈ రిస్కు శాతాన్ని తగ్గించుకోవచ్చు.

గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా వాహనం డ్రైవ్ చేయాల్సిన వస్తే, అలాంటి సందర్భాల్లో ఈ క్రింది చిట్కాలను పాటించడం వలన వారి ప్రయాణం మరింత సజావుగా, సౌకర్యవంతంగా సాగిపోతుంది. మరి ఆ చిట్కాలేంటో క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఫుల్ ట్యాంక్/తగినంత ఇంధనం

ఫుల్ ట్యాంక్/తగినంత ఇంధనం

గర్భిణీ స్త్రీలు వాహనంలో ప్రయాణించడానికంటే ముందుగా, సదరు వాహనంలో తమ ప్రయాణ దూరానికి కావల్సినంత ఇంధనం ఉందో లేదోనని తనిఖీ చేసుకోవాలి. (ఫుల్ ట్యాంక్ ఇంధనం ఉంటే ఇంకా మంచిది). కేవలం ఫ్యూయెల్ ట్యాంక్ ఫుల్లుగా ఉండే సరిపోదు, కడుపు నిండా ఆహారం కూడా తీసకోవాలి.

జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి

జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి

సాధారణ పరిస్థితుల్లో డ్రైవ్ చేయటం వేరు, గర్భిణిగా ఉన్నప్పు డ్రైవ్ చేయటం వేరు. గర్భిణిగా ఉప్పుడు అత్యంత జాగ్రత్తతో, శ్రద్ధగా డ్రైవ్ చేయాలి. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, నెమ్మదిగా డ్రైవ్ చేయాలి.

సెల్‌ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం

సెల్‌ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం

సాధారణ పరిస్థితుల్లోనే సెల్‌ఫోన్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమైనది. అలాంటిది ప్రెగ్నెన్సీ సమయంలో ఇది మరింత ప్రమాదంతో కూడుకున్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సెల్‌ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపకండి. మరీ అత్యవసరం అయితే, వాహనాన్ని రోడ్డుకు పక్కగా నిలిపి, హాజర్డ్ లైట్లు ఆన్ చేసిన తర్వాత టెలిఫోన్ కాల్‌ను ఆన్సర్ చేయండి.

సీటింగ్ పొజిషన్‌ను సర్దుబాటు చేసుకోండి

సీటింగ్ పొజిషన్‌ను సర్దుబాటు చేసుకోండి

స్త్రీలు గర్భంతో ఉన్నప్పుడు ఉదర భాగం (పొట్ట) ముందుకు వచ్చినట్టు ఉంటుంది కాబట్టి, డ్రైవర్ సీటును తమకు అనుకూలంగా సర్దుబాటు చేసుకోవాలి. స్టీరింగ్ వీల్‌కు, పొట్ట మధ్య తగినంత దూరం ఉండేలా సీటును/స్టీరింగ్‌ను అడ్జస్ట్ చేసుకోవాలి.

వీపుకు తగిన సపోర్ట్ ఉండాలి

వీపుకు తగిన సపోర్ట్ ఉండాలి

గర్భంతో ఉన్న స్త్రీలు ఎక్కువ సమయం డ్రైవ్ చేస్తే నడుము నొప్పి వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి దీనిని నివారించేందుకు వెనుక వైపు వీపుకు తగిన సపోర్ట్ ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే మెత్తటి దిండును ఉపయోగించుకోవచ్చు.

సీట్ బెల్ట్ (ముఖ్యమైనది)

సీట్ బెల్ట్ (ముఖ్యమైనది)

గర్భణీ స్త్రీలు తప్పనిసరిగా డ్రైవ్ చేయాల్సి వచ్చినప్పుడు సీట్ బెల్టును ధరించాలి. అయితే, ఈ సందర్భంలో సాధారణ సీట్ బెల్టుల కన్నా, గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన త్రీ పాయింట్ బెల్టును ధరించడం కడుపులో పెరుగుతున్న బిడ్డకు, తల్లికి ఇద్దరికీ మంచిది. ఇవి డీలర్ల వద్ద లేదంటే బయటి మార్కెట్లలో కూడా లభ్యమవుతాయి. షోల్డర్ బెల్ట్ పొట్టపైకి రాకుండా ఉండేలా జాగ్రత్త వహించాలి.

తరచూ విరామాలు తీసుకోండి

తరచూ విరామాలు తీసుకోండి

మీ ప్రయాణం మొదలైన తర్వాత నిరంతరాయంగా డ్రైవ్ చేయకుండా, అప్పుడప్పుడు విరామం తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి మంచిది. దీనివలన బాడీలో రక్తప్రసరణ సజావుగా జరిగి, కీళ్లు పట్టేయటం వంటి సమస్యలు రావు.

గతుకులు/కుదుపుల రోడ్లలో ప్రయాణించకండి

గతుకులు/కుదుపుల రోడ్లలో ప్రయాణించకండి

గుంతలు, కుదుపులు ఎక్కువగా ఉండే రోడ్లపై అస్సలు ప్రయాణించకండి. షార్ట్ కర్ట్ అని ఇలాంటి రూట్లలో ప్రయాణిస్తే, బిడ్డకు తల్లికి ఇద్దరికీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలస్యమైనా ఫర్వాలేదు మంచి రోడ్లపైన ప్రయాణించండి. వాహనంలో ఒంటరిగా దూర ప్రయాణాలు చేయకండి.

రాత్రిపూట డ్రైవింగ్ చేయకండి

రాత్రిపూట డ్రైవింగ్ చేయకండి

గర్భిణీ స్త్రీలు రాత్రివేళల్లో ఎట్టిపరిస్థితుల్లోను డ్రైవ్ చేయకండి. ఒకవేళ తప్పనిసరై డ్రైవ్ చేయాల్సి వస్తే, డ్రైవింగ్ తెలిసిన సన్నిహితులు లేదా బంధువుల సాయం తీసుకోవటం ఉత్తమం.

గడువు తేదీ దగ్గరపడితే డ్రైవ్ చేయకండి

గడువు తేదీ దగ్గరపడితే డ్రైవ్ చేయకండి

గడువు తేది దగ్గరపడే సమయంలో గర్భణీ స్త్రీలు ఎట్టిపరిస్థితుల్లోను వాహనం డ్రైవ్ చేయకూడదు. ఇది చాలా ప్రమాదకరమైనది. కారులో కుదుపుల వలన కడుపులో పెరిగి బిడ్డకు అపాయం సంభవించే అవకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, August 2, 2013, 12:56 [IST]
English summary
Ideally, driving when you are pregnant is a strict no-no. However, there are times when you are forced to make exceptions. This is more often the case than not. Also, working women have no option but to take to the wheels. Here we are giving some important tips for pregnant women drivers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+