చలిలో ఎలక్ట్రిక్ వాహనాలు డ్రైవ్‌ చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి.!!

చలి తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతుంది. దీంతో తెల్లవారుజామున పొగ మంచు సమస్య ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి సమయాల్లో రోడ్లపై వాహనాలను నడపడం కష్టంగా మారుతోంది. ఇదిలా ఉంచితే.. శీతాకాలంలో ఎలక్ట్రిక్ వాహనాల పనితీరు మనకు అనుకూలంగా ఉండదు. ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే పడిపోతే ఈవీలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు వాహన నిపుణులు..

దేశ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవతున్నాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. దీంతో ఈ కాలంలో ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల పనితీరుపై ప్రభావం చూపిస్తుందట. ఈవీల్లో లిథియం- అయాన్‌ బ్యాటరీ ఉపయోగిస్తారు. అయితే తగ్గిన ఉష్ణోగ్రతల ద్వారా బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా తగ్గిపోతుంది అంటున్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి..

Driving-Tips-In-Winter

చలికాలంలో(Electric Vehicles in Winter) తగ్గుతున్న ఉష్ణోగ్రతల ద్వారా ఎలక్ట్రిక్‌ వాహనాల పనితీరు సాధారణ పరిస్థితులతో పోలిస్తే 20 నుంచి 30 శాతం తగ్గుతుందని ఎక్స్‌పర్ట్స్‌ పేర్కొంటున్నారు. అయితే దీనికి రెండు కారణాలు ఉన్నాయట. ఒకటి బ్యాటరీ పనితీరు తగ్గడం.. మరొకటి ఎనర్జీ వినియోగం పేరగడం.

ఈ వాహనాల్లో బ్యాటరీలు 15 నుంచి 25 డిగ్రీల సెల్సియస్‌లోనే మెరుగ్గా పనిచేస్తాయట. టెంపరేచర్‌ తగ్గితే.. వాహనాలకు సరైన వేడి కావాల్సి ఉంటుంది. ఇందుకోసం బ్యాటరీ నుంచే ఎక్కువ శక్తిని తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో సాధారణ పరిస్థితులతో పోలిస్తే.. చలికాలంలో బ్యాటరీ వినియోగం పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు..

Driving-Tips-In-Winter

చలికాలంలో ఎలక్ట్రిక్‌ వాహనాల్లో రీజనరేటివ్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ అంత ఎఫెక్టివ్‌గా పనిచేయదు అంటున్నారు. సాధారణ పరిస్థితుల్లో ఈ వ్యవస్థ ద్వారా బ్యాటరీ కొంతమేర ఛార్జింగ్‌ అవుతుంది. కానీ చలికాలంలో మాత్రం ఈ ప్రభావం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను డ్రైవ్‌ చేయడం కష్టం అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎక్కువగా మాన్యువల్‌ బ్రేకింగ్‌ను ఉపయోగించాల్సి వస్తుందని సూచిస్తున్నారు.

ఇలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే.. మీ ఎలక్ట్రిక్‌ వాహనాలను సాధ్యమైనంత వరకూ బహిరంగ ప్రదేశాల్లో పార్కింగ్‌ చేయవద్దని చెబుతున్నారు నిపుణులు. క్లోజ్‌డ్‌ ప్రాంతాల్లో పార్కింగ్‌ చేయడం ద్వారా వాటిపే చలి ప్రభావం తగ్గుతుంది. ఇలా సాధ్యం కాకపోతే వాహనాన్ని కవర్‌తోనైనా కప్పి సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి.

Driving-Tips-In-Winter

చలికాలంలో ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ 20 శాతం కంటే తక్కువగా ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఈవీని స్టార్ట్‌ చేసినప్పుడు.. అందులోని కొన్ని పార్ట్స్‌ వేడెక్కడానికి బ్యాటరీ నుంచి శక్తి అవసరం ఉంటుంది. దీని ద్వారా బ్యాటరీ ఛార్జింగ్‌ తొందరగా అయిపోతుంది. మీరు లాంగ్‌ జర్నీస్‌ ప్లాన్‌ చేస్తే ఛార్జింగ్‌ 80 శాతం పైనే ఉండేలా చూసుకోవాలి.

మీరు మీ ఎలక్ట్రిక్‌ కారు లేదా బైక్‌లో బయటకు వెళ్లేటప్పుడు వాటిని ప్రీ కండిషన్‌ చేయడం అవసరం. ఎందుకంటే ఇంటీరియర్‌ వేడెక్కడానికి బ్యాటరీ నుంచి ఎనర్జీ కావాలి. ఇందుకోసం మీరు ఛార్జింగ్‌ పెట్టుకునే సమయం ఉన్న సందర్భాల్లో మాత్రమే ప్రీ కండిషన్ సాధ్యమవుతుంది. దీంతో ఖాళీ అయిన బ్యాటరీని త్వరగా ఛార్జ్‌ చేసుకోవచ్చు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఈ విషయం గుర్తుంచుకోవాలి.

Driving-Tips-In-Winter

శీతాకాలంలో బ్యాటరీని ఛార్జింగ్ చేయడానికి సమయం ఎక్కువగా తీసుకుంటుంది. ఇలాంటి సమయాల్లో బ్యాటరీ చల్లగా ఉంటే ఇంకా టైమ్‌ ఎక్కువగా తీసుకుంటుంది. అందుకే చలికాలంలో బ్యాటరీని ఛార్జింగ్‌ చేసేటప్పుడు వేడిగా ఉన్నప్పుడే ఛార్జింగ్ చేసుకోవాలి. ఇంకా ఈ కాలంలో ఈవీల పనితీరుపై టైర్లలోని గాలి ఒత్తిడి ప్రభావం కూడా ఉంటుంది. దీని ద్వారా రేంజ్‌ తగ్గే అవకాశం ఉంటుంది. ఇందుకోసం టైర్లలో ఎల్లప్పుడూ గాలి ఉండేలా చూసుకోవాలి.

More from DriveSpark

Article Published On: Tuesday, January 2, 2024, 9:40 [IST]
English summary
Effect on evs battery performance in winter key tips to drive safely
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+